India vs Pakistan : ఆసియా కప్, మహిళల వరల్డ్ కప్ తర్వాత..పాక్ ఆటగాళ్లను మరోసారి చేదు అనుభవం

క్రికెట్ మైదానంలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఉత్కంఠ. అయితే గత కొంతకాలంగా ఈ రెండు దేశాల ఆటగాళ్ల మధ్య ఆట ముగిసిన తర్వాత కూడా ఒక రకమైన వివాదం కొనసాగుతోంది. తాజాగా హాంగ్ కాంగ్ సిక్స్ 2025 టోర్నమెంట్‎లో భారత్, పాకిస్తాన్‌పై 2 పరుగుల తేడాతో విజయం సాధించిన తర్వాత మరోసారి ఇదే పరిస్థితి రిపీట్ అయింది.

India vs Pakistan : ఆసియా కప్, మహిళల వరల్డ్ కప్ తర్వాత..పాక్ ఆటగాళ్లను మరోసారి చేదు అనుభవం
India Pakistan Handshake Controversy

Updated on: Nov 07, 2025 | 7:03 PM

India vs Pakistan : క్రికెట్ మైదానంలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఉత్కంఠ. అయితే గత కొంతకాలంగా ఈ రెండు దేశాల ఆటగాళ్ల మధ్య ఆట ముగిసిన తర్వాత కూడా ఒక రకమైన వివాదం కొనసాగుతోంది. తాజాగా హాంగ్ కాంగ్ సిక్స్ 2025 టోర్నమెంట్‎లో భారత్, పాకిస్తాన్‌పై 2 పరుగుల తేడాతో విజయం సాధించిన తర్వాత మరోసారి ఇదే పరిస్థితి రిపీట్ అయింది. మ్యాచ్ ముగిశాక భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లతో హ్యాండ్ షేక్ చేయడానికి ముందుకు రాలేదు. ఈ పరిణామం ఆసియా కప్ 2025లో మొదలైన ఒక నూతన సంప్రదాయాన్ని కొనసాగించినట్టైంది.

హాంగ్ కాంగ్ సిక్స్ 2025 టోర్నమెంట్‌లో నవంబర్ 7న జరిగిన భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ను వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ద్వారా భారత్ 2 పరుగుల తేడాతో గెలుచుకుంది. అయితే, మ్యాచ్ ఫలితం ప్రకటించిన తర్వాత ఆటగాళ్ల మధ్య ఉండాల్సిన క్రీడా స్ఫూర్తి కనిపించలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత సాధారణంగా జరిగే విధంగా ఇరు జట్ల ఆటగాళ్లు బయటకు వచ్చి షేక్ హ్యండ్ చేసుకోలేదు. భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లతో చేతులు కలపడానికి ముందుకు రాకపోవడం ఈ వివాదానికి కారణమైంది.

ఆసియా కప్ 2025 నుంచి మహిళల ప్రపంచ కప్ 2025లో కూడా భారత జట్లు పాకిస్తాన్ జట్లతో షేక్ హ్యాండ్ చేయడాన్ని నిరాకరించాయి. హాంగ్ కాంగ్ సిక్స్ టోర్నమెంట్‌లో కూడా ఇదే విధానాన్ని కొనసాగించినట్లు తెలుస్తోంది. భారత్,పాకిస్తాన్ మధ్య ఈ హ్యాండ్‌షేక్ వివాదం ఆసియా కప్ 2025 నుంచి తీవ్రమైంది. సెప్టెంబర్ 14న భారత్-పాక్ మ్యాచ్‌కు ముందు టాస్ సమయంలో సూర్యకుమార్ యాదవ్, సల్మాన్ ఆఘా హ్యాండ్‌షేక్ చేసుకోలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చి పాకిస్తాన్ ఆటగాళ్లతో చేతులు కలపలేదు.

సెప్టెంబర్ 28న ఫైనల్‌లో భారత్, పాకిస్తాన్‌ను ఓడించిన తర్వాత, టీమిండియా ఆటగాళ్లు పీసీబీ ఛీఫ్ మోహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించారు. ఈ ట్రోఫీ వివాదం ఇప్పటికీ పరిష్కారం కాలేదు. ట్రోఫీ నఖ్వీ వద్దే ఉన్నట్లు సమాచారం. నవంబర్ 7న జరిగిన ఈ హాంగ్ కాంగ్ టోర్నమెంట్ మ్యాచ్‌లో భారత్ అద్భుత ప్రదర్శన చేసింది. భారత్ బ్యాటింగ్ మొదలుపెట్టింది. రాబిన్ ఉతప్ప కేవలం 11 బంతుల్లో 28 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో నిర్ణీత 6 ఓవర్లలో టీమిండియా 86 పరుగులు చేసింది. 87 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్, 3 ఓవర్లలో 41 పరుగులు చేసింది. అయితే, వర్షం కారణంగా మ్యాచ్‌ను నిలిపివేశారు. వర్షం తగ్గకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం భారత్‌ను 2 పరుగుల తేడాతో విజేతగా ప్రకటించారు.

 

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..