Asia Cup 2023: ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జతకట్టిన భారత ఆటగాడు.. ఆసియా కప్‌నకు ముందు కీలక నిర్ణయం..

Milap Pradeepkumar Mewada: మిలాప్ మేవాడా టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్‌కు సన్నిహితుడిగా పేరుగాంచాడు. హైదరాబాద్‌, జమ్మూకశ్మీర్‌ జట్టుకు కోచింగ్‌ కూడా ఇచ్చాడు. ఇర్ఫాన్, మిలాప్ బరోడా జట్టు కలిసి ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌కు బ్యాటింగ్ కోచ్‌గా మారినందుకు మిలాప్ మేవాడాకు ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేసి అభినందనలు తెలిపారు. VVS స్పోర్టింగ్ అకాడమీ, బరోడా క్రికెట్ అసోసియేషన్ కోచింగ్ సెటప్‌లో మిలాప్ కూడా పాలుపంచుకున్నారు.

Asia Cup 2023: ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జతకట్టిన భారత ఆటగాడు.. ఆసియా కప్‌నకు ముందు కీలక నిర్ణయం..
Milap Pradeepkumar Mewada

Updated on: Aug 13, 2023 | 9:03 PM

Afghanistan Cricket Team: ఆసియా కప్ 2023కి ముందు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆఫ్ఘనిస్థాన్‌ తన జట్టులో భారత్‌కు చెందిన ఓ అనుభవజ్ఞుడిని చేర్చుకుంది. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ అనుభవజ్ఞుడిని తమ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా చేసింది. ఈ అనుభవజ్ఞుడు పాకిస్థాన్ క్రికెట్ జట్టుతో వన్డే సిరీస్‌కు ముందు ఆఫ్ఘనిస్తాన్ జట్టులో చేరాడు.

ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) బరోడా మాజీ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ మిలాప్ మేవాడను తమ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా నియమించింది. మేవాడా బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు ఆఫ్ఘనిస్థాన్ బ్యాటింగ్ కోచ్‌గా గతంలో నియమితులయ్యారు. కానీ, అది ఒక్కసారి మాత్రమే జరిగింది. అదే సమయంలో ఇప్పుడు మిలాప్ మేవాడకు డిసెంబర్ వరకు కాంట్రాక్టు ఇచ్చారు. ప్రపంచ కప్ భారతదేశంలో జరగనుంది. ఇటువంటి పరిస్థితిలో, మేవాడా అనుభవంతో ఆఫ్ఘనిస్తాన్ పూర్తి ప్రయోజనం పొందుతుంది. ఇటీవలి అబుదాబి శిక్షణా శిబిరం, జులైలో బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో విజయవంతమైన ప్రయత్నాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత పూర్తి కాంట్రాక్ట్ అందించబడింది.

ఇవి కూడా చదవండి

మేవాడను అభినందించిన ఇర్ఫాన్ పఠాన్..

మిలాప్ మేవాడా టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్‌కు సన్నిహితుడిగా పేరుగాంచాడు. హైదరాబాద్‌, జమ్మూకశ్మీర్‌ జట్టుకు కోచింగ్‌ కూడా ఇచ్చాడు. ఇర్ఫాన్, మిలాప్ బరోడా జట్టు కలిసి ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌కు బ్యాటింగ్ కోచ్‌గా మారినందుకు మిలాప్ మేవాడాకు ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేసి అభినందనలు తెలిపారు. VVS స్పోర్టింగ్ అకాడమీ, బరోడా క్రికెట్ అసోసియేషన్ కోచింగ్ సెటప్‌లో మిలాప్ కూడా పాలుపంచుకున్నారు.

మల్టీ డైమెన్షనల్ క్రికెట్ కోచింగ్‌..


మిలాప్ మేవాడా 1996 నుంచి 2005 వరకు బరోడా, వెస్ట్ జోన్ జట్లకు ఆడాడు. అతని కెరీర్‌లో 11 ఫస్ట్-క్లాస్, 26 లిస్ట్ A మ్యాచ్‌లలో కనిపించాడు. 48 ఏళ్ల మిలాప్ మేవాడకు మల్టీ డైమెన్షనల్ క్రికెట్ కోచింగ్‌లో 32 ఏళ్ల అనుభవం ఉంది. 2004లో అతను తన చివరి ప్రొఫెషనల్ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత కోచింగ్‌లోకి వచ్చాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..