Team India: డెబ్యూ మ్యాచ్‌లోనే డకౌటైన టీమిండియా ప్లేయర్లు వీరే.! లిస్టులో ఎవరున్నారో చూస్తే

ప్రతి ఆటగాడికి తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ను విజయవంతంగా ప్రారంభించాలని కోరుకుంటాడు. అయితే, కొంతమంది స్టార్ టీమిండియా ఆటగాళ్ళకు వారి డెబ్యూ మ్యాచ్‌లోనే నిరాశ ఎదురైంది. వారంతా తొలి మ్యాచ్‌లోనే సున్నా పరుగులకే ఔటై, డకౌట్‌గా రికార్డులలోకి ఎక్కారు. ఆ వివరాలు ఇలా..

Team India: డెబ్యూ మ్యాచ్‌లోనే డకౌటైన టీమిండియా ప్లేయర్లు వీరే.! లిస్టులో ఎవరున్నారో చూస్తే
Cricket

Updated on: Jan 30, 2026 | 9:06 AM

డెబ్యూ మ్యాచ్‌లోనే డకౌట్ అయిన టీమిండియా క్రికెటర్లు ఎవరో మీకు తెలుసా.? లిస్టు చూస్తే షాక్ అవుతారు. 1989లో సచిన్ టెండూల్కర్, 2004లో మహేంద్ర సింగ్ ధోనీ, 2024లో అభిషేక్ శర్మ లాంటి స్టార్ ఆటగాళ్లు తమ తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లలో సున్నా పరుగులకే ఔటయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. ప్రతి ఆటగాడికి తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ను విజయవంతంగా ప్రారంభించాలని కోరుకుంటాడు. అయితే, కొంతమంది స్టార్ టీమిండియా ఆటగాళ్ళకు వారి డెబ్యూ మ్యాచ్‌లోనే నిరాశ ఎదురైంది. వారంతా తొలి మ్యాచ్‌లోనే సున్నా పరుగులకే ఔటై, డకౌట్‌గా రికార్డులలోకి ఎక్కారు.

ఇది చదవండి: మటన్ బోటీ ఇలా తింటున్నారా.! అయితే విషంతో సమానం..

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా ఈ జాబితాలో ఉన్నాడు. 1989వ సంవత్సరంలో పాకిస్తాన్‌తో జరిగిన తన మొదటి వన్డే మ్యాచ్‌లో సచిన్ డకౌట్ అయ్యాడు. ఇది అతడి అద్భుతమైన కెరీర్‌కు ఓ అరుదైన ఆరంభం అని చెప్పొచ్చు. మరోవైపు, భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరైన మహేంద్ర సింగ్ ధోనీ కూడా తన డెబ్యూ మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. 2004లో బంగ్లాదేశ్‌పై జరిగిన తన మొదటి వన్డేలో ధోనీ రన్ ఔట్ రూపంలో సున్నా పరుగులకే వెనుదిరిగాడు. ఇటీవలే, 2024లో జింబాబ్వేతో జరిగిన తన తొలి T20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో యువ ఆటగాడు అభిషేక్ శర్మ సున్నా పరుగులకే ఔట్ అయ్యాడు. ఈ సంఘటన అతడి కెరీర్ ప్రారంభంలోనే జరిగింది. ఈ ఆటగాళ్లు తమ తొలి మ్యాచ్‌లో డకౌట్ అయినప్పటికీ.. ఆ తర్వాత అద్భుతమైన కెరీర్‌లతో రికార్డులు తిరగరాశారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: జబర్దస్త్‌లో సుధీర్, హైపర్ ఆది కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నది అతడే..

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..