IND vs SL: అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్న భారత్, శ్రీలంక క్రికెటర్లు.. సంప్రదాయ దుస్తుల్లో వెళ్లి ఆశీస్సులు

|

Jan 14, 2023 | 5:03 PM

సూర్యకుమార్‌ యాదవ్‌, యుజ్వేంద్ర చాహల్‌, అక్షర్‌ పటేల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, కుల్దీప్‌ యాదవ్‌, వాషింగ్టన్‌ సుందర్‌ వారితో పాటు మరికొంతమంది శ్రీలంక ఆటగాళ్లు పద్మనాభ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారి ఆశీస్సుల కోసం వచ్చిన క్రికెటర్లకు ఆలయ కమిటీ సాదరంగా స్వాగతం పలికింది. దగ్గరుండి స్వామి వారి దర్శనం చేయించింది.

IND vs SL: అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్న భారత్, శ్రీలంక క్రికెటర్లు.. సంప్రదాయ దుస్తుల్లో వెళ్లి ఆశీస్సులు
Team India
Follow us on

భారత క్రికెట్ జట్టు కొత్త సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించింది. శ్రీలంకతో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్ వన్డే సిరీస్‌ను కూడా గెల్చుకుంది. అది కూడా ఒక మ్యాచ్‌ మిగిలి ఉండగానే. ఇక సిరీస్‌లో నామమాత్రమైన చివరి మ్యాచ్‌ను కూడా గెలిచి క్లీన్‌స్వీప్‌ కొట్టాలనుకుంటోంది టీమిండియా. ఇందుకోసం రోహిత్‌ సేన కేరళ రాజధాని తిరువనంతపురం చేరుకుంది. ఆదివారం (జనవరి 15) మధ్యాహ్నం మ్యాచ్‌ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు భారత ఆటగాళ్లు, సహాయక సిబ్బంది అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించారు. సూర్యకుమార్‌ యాదవ్‌, యుజ్వేంద్ర చాహల్‌, అక్షర్‌ పటేల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, కుల్దీప్‌ యాదవ్‌, వాషింగ్టన్‌ సుందర్‌ వారితో పాటు మరికొంతమంది శ్రీలంక ఆటగాళ్లు పద్మనాభ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారి ఆశీస్సుల కోసం వచ్చిన క్రికెటర్లకు ఆలయ కమిటీ సాదరంగా స్వాగతం పలికింది. దగ్గరుండి స్వామి వారి దర్శనం చేయించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. ఇందులో క్రికెటర్లందరూ సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు టీమిండియా క్రికెటర్లతో ఫొటోలు దిగుతూ కనిపించారు. కాగా తిరువనంతపురంలోని అనంత పద్మనాభస్వామి ఆలయానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. అలాగే ఇక్కడ మకర సంక్రాంతి వేడుకలు అట్టహాసంగా జరుగుతాయి.

కాగా ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను వైట్‌వాష్‌ చేయాలని భారత జట్టు భావిస్తోంది. అదే సమయంలో కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని లంక జట్టు కోరుకుంటోంది. ఇక తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ మైదానంలో ఇప్పటివరకు ఒకే ఒక్క వన్డే మ్యాచ్ జరిగింది. వెస్టిండీస్- టీమిండియా మధ్య జరిగిన ఆ మ్యాచ్ లో విండీస్ పై భారత్ విజయం సాధించింది. ఆ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 104 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత భారత్ ఒకే ఒక వికెట్ కోల్పోయి 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

ఇవి కూడా చదవండి


మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..