Watch Photo: హెయిర్ స్టైల్ మార్చిన టీమిండియా ఓపెనర్.. ఐపీఎల్‌ కోసమే అంటోన్న ఫ్యాన్స్..

Shikhar Dhawan: శ్రీలంకతో జరిగే టీ20, టెస్టు సిరీస్‌లో శిఖర్ ధావన్ భాగం కావడం లేదు. నేరుగా ఐపీఎల్‌ 2022లో కనిపించనున్నాడు.

Watch Photo: హెయిర్ స్టైల్ మార్చిన టీమిండియా ఓపెనర్.. ఐపీఎల్‌ కోసమే అంటోన్న ఫ్యాన్స్..
Shikhar Dhawan

Updated on: Feb 23, 2022 | 7:12 PM

ఈ ఏడాది జరిగే ఐపీఎల్‌(IPL 2022)లో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్(Shikhar Dhawan) డిఫరెంట్ స్టైల్‌లో కనిపించనున్నాడు. తన లుక్‌లో కాస్త మార్పు చేశాడు. ఈ మార్పుకు సంబంధించిన చిత్రాన్ని ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన ఇన్‌స్టా స్టోరీలో తన కొత్త లుక్‌కి సంబంధించిన ఫోటోను ఉంచాడు. ఈ ఫోటోతో, ‘నా కొత్త హెయిర్‌స్టైల్‌ను నేను ఇష్టపడుతున్నాను’ అనే క్యాప్షన్ అందించాడు. శ్రీలంకతో జరిగే టీ20, టెస్టు సిరీస్‌లకు శిఖర్ ధావన్ దూరమయ్యాడు. దీంతో నేరుగా ఐపీఎల్‌ 2022లో కనిపించనున్నాడు. ఈసారి ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడనున్నాడు. వేలంలో పంజాబ్ ఫ్రాంచైజీ(Punjab Kings) రూ. 8.25 కోట్లకు కొనుగోలు చేసింది. వేలంలో, అతను మొదటి బిడ్ చేసిన మార్క్యూ ప్లేయర్‌ల జాబితాలో చేర్చబడ్డాడు.

పంజాబ్ కెప్టెన్ కావొచ్చు..
ఈ వేలంలో శిఖర్ ధావన్‌పై చాలా ఫ్రాంచైజీలు ఆసక్తి కనబరిచాయి. అయితే చివరిగా పంజాబ్ పందెంలో గెలిచి, తమ జట్టులో చేర్చుకుంది. పంజాబ్ జట్టు తన కెప్టెన్ పేరును ఇంకా ప్రకటించలేదు. ఇటువంటి పరిస్థితిలో, పంజాబ్ ఫ్రాంచైజీ జట్టు కమాండ్‌ను శిఖర్ ధావన్‌కు అప్పగించవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.

శిఖర్ ధావన్ ప్రస్తుతం టీమిండియా వన్డే జట్టులో క్రమం తప్పకుండా భాగమవుతున్నాడు. అయితే శిఖర్ టీ20, టెస్ట్ మ్యాచ్‌ల కోసం జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన టీ20, అంతకుముందు దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో శిఖర్‌కు అవకాశం రాలేదు. కాగా, ఈ రెండు దేశాలతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.

Also Read: IND vs SL: శ్రీలంక టీంకు భారీ ఎదురుదెబ్బ.. కరోనా బారిన కీలక ఆటగాడు.. టీ20 సిరీస్ నుంచి ఔట్..!

India vs Sri Lanka 1st T20: అభిమాన ప్లేయర్ కోసం రోడ్డెక్కిన ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా?