అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు.. ప్రపంచంలోని ఏ బ్యాట్స్‌మెన్‌కు సాధ్యంకాని ఈ రికార్డును టీమిండియా దిగ్గజ ప్లేయర్, క్రికెట్ గాడ్‌గా పిలిచే సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar 100th century) మాత్రం పూర్తి చేశాడు. 100 సెంచరీలు బాదేశాడు. 2012లో ఇదే రోజున సచిన్ ఈ స్పెషల్ రికార్డును సాధించాడు. 2012 లో బంగ్లాదేశ్‌తో జరిగిన ఆసియా కప్(Asia Cup 2012) లో సచిన్ మిర్పూర్ గడ్డపై చరిత్ర సృష్టించాడు. 100 సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో మొదటి అంతర్జాతీయ సెంచరీని కేవలం 17 సంవత్సరాల వయస్సులోనే బాదేశాడు. తరువాతి రెండు దశాబ్దాలలో అతను 100 సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. మిర్పూర్‌లో సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) 147 బంతుల్లో 114 పరుగులు చేశాడు. సెంచరీ కోసం సచిన్ 138 బంతులు ఆడాడు.
సచిన్ టెండూల్కర్ శతకాల సెంచరీ కొట్టి చరిత్ర సృష్టించిన ఆ మ్యాచులో.. టీమిండియా ఓడిపోయింది. అయితే, దీనికి సచిన్ స్లో ఇన్నింగ్స్ కారణమని పలువురు విమర్శకులు పేర్కొన్నారు. ఆ మ్యాచ్‌లో భారత్ 50 ఓవర్లలో 289 పరుగులు చేయగా, బంగ్లాదేశ్ చివరి ఓవర్‌లో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది.
సచిన్ సెంచరీపై విమర్శలు గుప్పించిన వకార్ యూనిస్..
ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోవడంతో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వకార్ యూనిస్ సచిన్‌పై స్టేట్‌మెంట్ ఇచ్చాడు. వకార్ యూనిస్ మాట్లాడుతూ, ‘చాలా మందికి ఈ విషయం నచ్చదు. కానీ, సచిన్ సెంచరీ కారణంగా, టీమిండియా మ్యాచ్‌లో ఓడిపోయింది. భారత్ 300 కంటే ఎక్కువ పరుగులు చేయాల్సి ఉంది. కానీ, అలా జరగకపోవడం వల్లే మ్యాచులో ఓడిపోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
సచిన్ రికార్డును బ్రేక్ చేసేవారున్నారా?
సచిన్ టెండూల్కర్‌పై విమర్శలు వచ్చినా 100 సెంచరీలకు ప్రపంచం కూడా సలాం చేసింది. సచిన్ రికార్డును బద్దలు కొట్టడం చాలా కష్టమని అందరికి తెలసిందే. సచిన్ తర్వాత పాంటింగ్ 71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు. కోహ్లీ కూడా 70 సెంచరీలు సాధించాడు. అతను సచిన్ రికార్డును బద్దలు కొట్టగలడని నమ్ముతున్నారు. అయితే గత రెండున్నరేళ్లుగా విరాట్ కోహ్లీ సెంచరీ చేయలేక పోవడంతో ఇప్పుడు ఈ విషయంపై అందరిలోనూ అనుమానం మొదలైంది.
#OnThisDay in 2012 ?️
The legendary @sachin_rt scripted history when he became the only batter in the history of cricket to score ? international hundreds. ? ?#TeamIndia pic.twitter.com/O736mqwV7m
— BCCI (@BCCI) March 16, 2022
Also Read: IPL 2022: కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగే జట్లు ఇవే.. తొలిసారిగా బాధ్యతలు చేపట్టనున్న ఆ ఇద్దరు..
IPL 2022: రాజస్థాన్ రాయల్స్ కొత్త జెర్సీ వచ్చేసింది.. ఇన్ని స్టంట్స్ ఎందుకో బ్రో అంటోన్న ఫ్యాన్స్..