Team India: అగ్రస్థానంలో టీమిండియా.. పాక్ ప్లేస్ చూస్తే పాపం అనాల్సిందే.. ఆ స్పెషల్ రికార్డ్ ఏంటంటే?

|

Jan 01, 2023 | 3:02 PM

Team India Record 2022: 2022లో భారత క్రికెట్ జట్టు అత్యధిక సిక్సర్లు కొట్టే విషయంలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ విషయంలో ఇంగ్లండ్ రెండో స్థానంలో ఉంది.

Team India: అగ్రస్థానంలో టీమిండియా.. పాక్ ప్లేస్ చూస్తే పాపం అనాల్సిందే.. ఆ స్పెషల్ రికార్డ్ ఏంటంటే?
Team India
Follow us on

Team India Records: 2022 సంవత్సరం భారత క్రికెట్ జట్టుకు అంతగా కలసి రాలేదు. టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఆసియా కప్‌లోనూ భారత జట్టు ఓడిపోయింది. ఐసీసీ టోర్నీలను వదిలేస్తే, టీమ్ ఇండియా చాలా సిరీస్‌లలో మంచి ప్రదర్శన చేసింది. ఈ కారణంగా, భారత జట్టు పేరు మీద ప్రత్యేక రికార్డు నమోదైంది. 2022లో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్టుగా భారత్ నిలిచింది.

ఈ ఏడాది టీమిండియా ఆటగాళ్లు మొత్తం 466 సిక్సర్లు కొట్టారు. ఇందులో సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ సహా ఆటగాళ్లంతా కీలక పాత్ర పోషించారు. ఈ విషయంలో ఇంగ్లండ్ రెండో స్థానంలో నిలిచింది. ఇంగ్లీష్ జట్టు ఆటగాళ్లు 328 సిక్సర్లు కొట్టారు. భారత్, ఇంగ్లండ్ ఆటగాళ్లు కొట్టిన సిక్సర్ల సంఖ్యకు చాలా తేడా ఉంది. ఈ విషయంలో వెస్టిండీస్ మూడో స్థానంలో కొనసాగుతోంది. విండీస్ ఆటగాళ్లు 322 సిక్సర్లు కొట్టారు.

అత్యధిక సిక్సర్లు బాదిన జట్లలో పాకిస్థాన్ క్రికెట్ ఆరో స్థానంలో నిలిచింది. మొత్తం 206 సిక్సర్లు ఆ జట్టు పేరుతో ఉన్నాయి. కాగా, శ్రీలంక ఆటగాళ్లు 181 సిక్సర్లు కొట్టారు. దక్షిణాఫ్రికా జట్టు పేరుతో 173 సిక్సర్లు ఉన్నాయి. ఇక న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు తర్వాత స్థానాల్లో నిలిచాయి. న్యూజిలాండ్ ఆటగాళ్లు 268 సిక్సర్లు కొట్టగా, ఆస్ట్రేలియా ఆటగాళ్లు 216 సిక్సర్లు కొట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..