Indian Cricket Team: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన టీమిండియా పాస్ట్ బౌలర్.. వారి కోసమే అంటూ ప్రకటన..

|

Mar 09, 2022 | 8:36 PM

కేరళ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ 2005లో టీమిండియా తరపున అరంగేట్రం చేశాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 90 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు.

Indian Cricket Team: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన టీమిండియా పాస్ట్ బౌలర్.. వారి కోసమే అంటూ ప్రకటన..
Shantakumaran Sreesanth
Follow us on

భారత (Indian Cricket Team) మాజీ ఫాస్ట్ బౌలర్ శాంతకుమారన్ శ్రీశాంత్ (S Sreesanth Retires) అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. 2005లో భారత క్రికెట్‌లో తన స్థానాన్ని సంపాదించుకున్న కేరళ పేసర్, ఇటీవలే రంజీ ట్రోఫీ(Ranji Trophy 2022) 2022 లో తన చివరి మ్యాచ్ ఆడాడు. 39 ఏళ్ల శ్రీశాంత్ తన నిర్ణయాన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రకటించాడు. ఈమేరకు ఇది తనకు చాలా కష్టమైన నిర్ణయమని, తనకు చాలా సంతోషాన్ని కలిగించనప్పటికీ, రాబోయే తరం కోసం ఈ చర్య తీసుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నాడు. తన ఫాస్ట్ పేస్, బౌన్సీ బంతులతో వివాదాల్లో చిక్కుకున్న శ్రీశాంత్, 2005లో భారత్ తరఫున అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించి.. 5 ఏళ్ల పాటు టీమ్ ఇండియాలో భాగమయ్యాడు. ఈ సమయంలో, అతను మూడు ఫార్మాట్లలో 90 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. దీంతో పాటు ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ టీంలోనూ కీలక పాత్ర పోషించాడు.

ఎల్లప్పుడూ విజయం సాధించేందుకు ప్రయత్నించాను..

శ్రీశాంత్ ఇటీవల కేరళ క్రికెట్ జట్టులో భాగమయ్యాడు. అతను జట్టు తరపున ఒక మ్యాచ్ కూడా ఆడాడు. అందులో 2 వికెట్లు కూడా తీశాడు. అయితే, కేరళ జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. ఇటువంటి పరిస్థితిలో శ్రీశాంత్ రిటైర్మెంట్ ప్రకటించాడు. తన ట్విట్టర్ ఖాతాలో ఈ సమాచారాన్ని ఇచ్చాడు. “ఈ రోజు నాకు కష్టమైన రోజు. కేరళ స్టేట్ క్రికెట్ అసోసియేషన్, BCCI, వార్విక్‌షైర్ క్రికెట్ కౌంటీ, ఇండియన్ ఎయిర్‌లైన్స్ క్రికెట్ టీమ్, ICC కోసం వివిధ క్రికెట్ లీగ్‌లు, టోర్నమెంట్‌లు, ఎర్నాకులం డిస్ట్రిక్ట్ తరపున ఆడడం గౌరవంగా ఉంది. నా 25 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో, నేను ఎల్లప్పుడూ విజయం సాధించడానికి, మ్యాచ్‌లను గెలవడానికి ప్రయత్నించాను. అదే సమయంలో శిక్షణ, అత్యున్నత ప్రమాణాలకు సిద్ధమవుతున్నాను’ అని పేర్కొన్నాడు.

“నా కుటుంబం, తోటి క్రీడాకారులు, భారతీయ ప్రజలకు ప్రాతినిధ్యం వహించడం నాకు గౌరవంగా ఉంది. చాలా బాధగా ఉంది. కానీ, ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా, భారమైన హృదయంతో చెబుతున్నాను – నేను భారత అన్ని ఫార్మాట్‌ల నుంచి రిటైర్ అవుతున్నాను” అని తెలిపాడు.

తదుపరి తరం కోసం తీసుకున్న నిర్ణయం..

రాబోయే తరం కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు శ్రీశాంత్ తెలిపాడు. తదుపరి తరం క్రికెటర్ల కోసం నా కెరీర్‌ను ముగించాలని నిర్ణయించుకున్నాను. ఇది నా నిర్ణయం మాత్రమే. ఇది నాకు సంతోషాన్ని కలిగించదని నాకు తెలిసినప్పటికీ, ఇది నా జీవితంలోని ఈ దశలో సరైన, గౌరవప్రదమైన నిర్ణయం. నేను ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను” అంటూ ముగించాడు.

Also Read: India vs Pakistan: ఆస్ట్రేలియాలో భారత్-పాక్ వన్డే సిరీస్ జరగనుందా? క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ కీలక ప్రకటన..

Watch Video: ఒంటి చేత్తో భారీ సిక్స్ బాదిన చెన్నై సారథి ధోని.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో