Dhruv Jurel: టీమిండియాకు అదృష్టంగా మారిన ఈ వికెట్ కీపర్.. ఆడిన అన్నింటిలో భారత్ గెలుపు

ధృవ్ జురెల్ టీమిండియాకు అదృష్టంగా మారాడు. ఎందుకంటే అతడు ఆడిన టెస్ట్ మ్యాచుల్లో భారత్ విజయం సాధించింది. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా 5 మ్యాచ్‌లను గెలిచిన అతను వెస్టిండీస్ మాజీ ఆటగాడు ఆల్డిన్ బాప్టిస్ట్ రికార్డును సమం చేయడానికి దగ్గరగా ఉన్నాడు.

Dhruv Jurel: టీమిండియాకు అదృష్టంగా మారిన ఈ వికెట్ కీపర్.. ఆడిన అన్నింటిలో భారత్ గెలుపు
Dhruv Jurel

Updated on: Aug 07, 2025 | 6:01 AM

యువ జట్టుతో ఇంగ్లాండ్‌లో పర్యటించిన టీమిండియా సిరీస్‌ను గెలవలేకపోయింది. కానీ వారి స్వంత గడ్డపై 2 మ్యాచ్‌ల్లో ఇంగ్లీష్‌ జట్టును ఓడించగలిగింది. శుభ్‌మాన్ గిల్ కెప్టెన్సీలో యువ భారత జట్టు ఇంగ్లాండ్‌పై అద్భుతమైన ప్రదర్శన చేసింది. సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఈ సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో ఓ ప్లేయర్‌కు ఆడే అవకాశం లభించడం టీమిండియా అదృష్టమని మరోసారి నిరూపితమైంది.

టీమిండియా యొక్క ఆ అదృష్ట ఆటగాడి పేరు ధృవ్ జురెల్. తన వికెట్ కీపింగ్, బ్యాటింగ్‌తో టీమిండియాలో స్థానం సంపాదించడానికి ప్రయత్నిస్తున్న ధృవ్, టీమ్‌కే అదృష్టవంతుడిగా మారుతున్నాడు. జురెల్ తన టెస్ట్ కెరీర్‌లో ఇప్పటివరకు ఐదు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. ఆశ్చర్యకరంగా.. భారత్ ఈ మ్యాచ్‌లన్నింటినీ గెలుచుకుంది. అంటే, ధ్రువ్ జురెల్ తన టెస్ట్ కెరీర్‌లో ఇంకా ఒక్క ఓటమి కూడా చవిచూడలేదు.

నిజానికి.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో, ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అత్యధిక టెస్ట్ మ్యాచ్‌లను గెలిచిన రికార్డు వెస్టిండీస్ మాజీ ఆల్ రౌండర్ ఆల్డిన్ బాప్టిస్ట్ పేరు మీద ఉంది. బాప్టిస్ట్ తన టెస్ట్ కెరీర్‌లో వరుసగా 10 టెస్ట్ మ్యాచ్‌లు ఆడితే అన్నింటిలో టీమ్ గెలిపొందింది. అతను తన కెరీర్ చివరి వరకు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఓడిపోలేదు.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ యువ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ 2024లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ కెరీర్‌లో అరంగేట్రం చేశాడు. మొదటి టెస్ట్‌లోనే అతను తన బ్యాటింగ్, వికెట్ కీపింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. జురెల్ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 36.42 సగటుతో 255 పరుగులు చేశాడు. ఇందులో 1 హాఫ్ సెంచరీ కూడా ఉంది. అదే సమయంలో వికెట్ కీపర్‌గా అతను 9 క్యాచ్‌లు, 2 స్టంపింగ్‌లు ఉన్నాయి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..