IND vs NZ: రెండో మ్యాచ్‌లోనూ ఉతికారేసిన ఇండియా.. న్యూజిలాండ్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం..

|

Nov 19, 2021 | 11:01 PM

IND vs NZ: టీ20 ప్రపంచ కప్ 2021 ముగిసిన తర్వాత భారత్‌, న్యూజిలాండ్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రాంచీలోని జేఎస్‌సీఏ

IND vs NZ: రెండో మ్యాచ్‌లోనూ ఉతికారేసిన ఇండియా.. న్యూజిలాండ్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం..
Ind Vs Nz 2nd T20
Follow us on

IND vs NZ: టీ20 ప్రపంచ కప్ 2021 ముగిసిన తర్వాత భారత్‌, న్యూజిలాండ్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రాంచీలోని జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన రెండో టీ 20 మ్యాచ్‌లో భారత్‌ విజయకేతనం ఎగరేసింది. భారత్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కివీస్ విధించిన 153 పరుగుల టార్గెట్‌‌ను సునాయసనంగా చేధించింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన కేఎల్‌ రాహుల్, రోహిత్‌ శర్మ మంచి శుభారంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా కేఎల్‌ రాహుల్‌ 49 బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లతో 65 పరుగులు చేశాడు. మరోవైపు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 36 బంతుల్లో 1 ఫోర్లు 5 సిక్సర్ల సాయంతో 55 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. కివీస్‌ బౌలర్లలో టిమ్‌ సౌథీ 3 వికెట్లు సాధించాడు. మిగతా వారు ఎవ్వరూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.

అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టీం 6 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. దీంతో టీమిండియా ముందు 154 పరుగుల టార్గెట్‌‌ను ఉంచగలిగింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన మార్టిన్ గప్టిల్ 31 (15 బంతులు, 3 ఫోర్లు, 2 సిక్సులు), డారెల్ మిచెల్ 31(28 బంతులు, 3 ఫోర్లు ) మంచి శుభారంబాన్నిచ్చారు. అనంతరం గ్లెన్‌ ఫిలిప్స్‌ 21 బంతుల్లో 34 పరుగులు చేశాడు. చాప్‌మన్‌ 21 పరుగులు మినహాయించి పెద్దగా ఎవ్వరూ రాణించలేదు. దీంతో కివీస్‌ కనీసం పోరాడే స్కోర్‌ను సాధించింది. ఇక టీమిండియా బౌలర్లలో హర్షల్ పటేల్‌ 2 వికెట్లు, భువనేశ్వర్, అశ్విన్, చాహర్, అక్సర్ పటేల్‌ తలా ఒక వికెట్ పడగొట్టారు.

Fiber Foods: బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారా? అయితే, ఈ 5 ఫైబర్ ఫుడ్స్‌కి దూరంగా ఉండండి..

Anasuya Bharadwaj: చీర కట్టుతో ఫాన్స్ మనసులను దోచుకుంటున్న అను లేటెస్ట్ ఫొటోస్..

Omega-3 Rich Foods: ఒమేగా-3 అధికంగా ఉన్న టాప్ 5 వెజిటేబుల్స్ ఇవే.. ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం..