IND vs UAE: 27 బంతుల్లోనే భారత్ విజయం.. 5 సిక్స్‌లు, 4 ఫోర్లతో బీభత్సం భయ్యో..

India vs United Arab Emirates, 2nd Match, Group A: 2025 ఆసియా కప్‌లో భారత్ గొప్ప ఆరంభం చేసింది. యుఎఇపై 58 పరుగుల లక్ష్యాన్ని జట్టు కేవలం 27 బంతుల్లోనే ఛేదించింది. అభిషేక్ శర్మ 30 పరుగులు చేసి ఔటయ్యాడు. శుభ్‌మాన్ గిల్ 20 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

IND vs UAE: 27 బంతుల్లోనే భారత్ విజయం.. 5 సిక్స్‌లు, 4 ఫోర్లతో బీభత్సం భయ్యో..
Ind Vs Uae Match Result

Updated on: Sep 10, 2025 | 10:09 PM

India vs United Arab Emirates, 2nd Match, Group A: 2025 ఆసియా కప్‌లో భారత్ గొప్ప ఆరంభం చేసింది. యుఎఇపై 58 పరుగుల లక్ష్యాన్ని జట్టు కేవలం 27 బంతుల్లోనే ఛేదించింది. అభిషేక్ శర్మ 30 పరుగులు చేసి ఔటయ్యాడు. శుభ్‌మాన్ గిల్ 20 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

బుధవారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది భారత్. యుఏఈ 13.1 ఓవర్లలో 57 పరుగులకే ఆలౌట్ అయింది. చివరి 8 వికెట్లను 28 పరుగులకే కోల్పోయింది. ఓపెనర్ అలీషాన్ షరాఫు 22 పరుగులు, కెప్టెన్ మహ్మద్ వసీం 19 పరుగులు చేశారు. భారత్ తరపున కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు పడగొట్టాడు. శివమ్ దుబే 3 వికెట్లు పడగొట్టాడు. భారత జట్టు తరఫున అభిషేక్ శర్మ 30 పరుగులకు అవుటయ్యాడు.

భారత్ అతిపెద్ద విజయం..

ఇన్నింగ్స్‌లో బంతులు మిగిలి ఉండగానే భారత్ సాధించిన అతిపెద్ద విజయం ఇది. దుబాయ్‌లో యుఎఇపై టీమ్ ఇండియా కేవలం 27 బంతుల్లో (4.3 ఓవర్లు), అంటే 93 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది.

ఇవి కూడా చదవండి

2021లో దుబాయ్‌లో స్కాట్లాండ్‌పై భారత్ ఇంకా 81 బంతులు మిగిలి ఉండగానే గెలిచింది. టెస్ట్ ఆడే దేశాలలో ఇంకా బంతులు మిగిలి ఉండగానే ఇది రెండవ అతిపెద్ద విజయం.

2024 T20 ప్రపంచ కప్‌లో, ఆంటిగ్వాలో ఇంగ్లాండ్ కేవలం 19 బంతుల్లో ఒమన్‌ను ఓడించింది. అప్పుడు 101 బంతులు మిగిలి ఉన్నాయి. 2014లో చట్టోగ్రామ్‌లో నెదర్లాండ్స్‌ను ఓడించిన శ్రీలంక ఈ రికార్డులో మూడవ స్థానంలో ఉంది, ఇది 90 బంతులు మిగిలి ఉండగానే.

రెండు జట్ల ప్లేయింగ్-11..

భారత్- అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్) , తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.

యూఏఈ- మహ్మద్ వసీం (కెప్టెన్) , అలీషాన్ షరాఫు, రాహుల్ చోప్రా, ఆసిఫ్ ఖాన్, ధ్రువ్ పరాశర్, హర్షిత్ కౌశిక్, మహ్మద్ జోహెబ్, హైదర్ అలీ, జునైద్ సిద్ధిఖీ, మహ్మద్ రోహిద్, సిమర్జిత్ సింగ్.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..