IND vs BAN Match Result: బంగ్లాపై ఘన విజయం.. ఆసియా కప్ ఫైనల్ చేరిన భారత్..

India vs Bangladesh: ఆసియా కప్‌లో భాగంగా జరుగుతున్న నాల్గవ సూపర్ ఫోర్ మ్యాచ్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో భారత్ తమ జైత్రయాత్రను కొనసాగించింది. బంగ్లాదేశ్ జట్టుపై ఘన విజయం సాధించింది. దీంతో ఆసియా కప్ 2025లో ఫైనల్ చేరిన తొలి జట్టుగా భారత్ నిలిచింది.

IND vs BAN Match Result: బంగ్లాపై ఘన విజయం.. ఆసియా కప్ ఫైనల్ చేరిన భారత్..
Team India

Updated on: Sep 24, 2025 | 11:37 PM

IND vs BAN Match Result: ఆసియా కప్‌లో టీం ఇండియా ఫైనల్‌కు చేరుకుంది. బుధవారం జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో భారత్ బంగ్లాదేశ్‌ను 41 పరుగుల తేడాతో ఓడించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో 169 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ జట్టు 19.2 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. ఓపెనర్ సైఫ్ హసన్ 69 పరుగులు చేశాడు. 9 మంది బ్యాటర్స్ రెండంకెల స్కోరును చేరుకోలేకపోయారు. కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టాడు. జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి చెరో 2 వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టాడు.

అంతకుముందు, టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 168 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 75 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా 38 పరుగులు, శుభ్మాన్ గిల్ 29 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ తరఫున రిషద్ హుస్సేన్ 2 వికెట్లు పడగొట్టగా, ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఒక వికెట్ పడగొట్టాడు.

భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్(కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.

బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI): సైఫ్ హసన్, తాంజిద్ హసన్ తమీమ్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, తౌహిద్ హృదయ్, షమీమ్ హొస్సేన్, జాకర్ అలీ(కీపర్/కెప్టెన్), మహ్మద్ సైఫుద్దీన్, రిషాద్ హుస్సేన్, తంజిమ్ హసన్ సకీబ్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రాహ్.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..