INDW vs ENGW: బ్రిస్టల్ లో జరుగుతోన్న ఏకైక టెస్టులో భారత్ పోరాడుతోంది. ఓటమిని తప్పించుకునేందుకు డ్రా కోసం క్రీజులో నిలిచేందుకు కష్టపడుతోంది. వరుణుడు కూడా కాస్త తోడుగా నిలవనుండడంతో.. మరి నాలుగో రోజు భారత మహిళలు డ్రా దిశగా పోరాడతారా? లేదా వికెట్లు సమర్పించుకుని ఇంగ్లండ్ కు దాసోహమంటారా చూడాలి. తొలి ఇన్నింగ్స్‌లో 231 పరుగులకే చాపచుట్టేసి, ఫాలోఆన్ గండంలో చిక్కుకుంది భారత్ టీం. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత మహిళలకు ఆదిలోనే ఓపెనర్ స్మృతి మంధాన (8) పెవిలియన్ చేరడంతో… కష్టాల్లో కూరుకపోయారు. ఈ దశలో మరో ఓపెనర్ షెఫాలి వర్మ (55*; 68 బంతుల్లో 11×4), దీప్తి శర్మ (18 *)తో కలిసి జట్టు స్కోరును పెంచుతూ నిలకడగా ఆడుతోంది. కాగా, మొదటి ఇన్నింగ్స్‌లో 96 పరుగులు చేసిన షెఫాలి.. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆ జోరును కొనసాగిస్తోంది. అరంగేట్ర టెస్టులో అద్భుతమైన ఆటతో ఆకట్టుకొంటోంది షెఫాలి వర్మ. ఇక మూడో రోజు వరుణుడి రాకతో ఆట నిలిచిపోయే సమయానికి భారత్ ఒక వికెట్ నష్టానికి 83 పరుగులు చేసింది.
భారత మహిళలు ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవాలంటే ఇంకా 82 పరుగులు చేయాలి. వర్షంతో ఆటకు చాలాసార్లు ఆటంకి ఏర్పడింది. మూడో రోజు ఆటలో సగం ఓవర్లు కూడా పడలేదు. దీంతో భారత్ ఓటమి నాలుగో రోజుకు చేరింది. చివరి రోజు భారత మహిళలు ఎంతసేపు ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కొంటారో చూడాలి. తొలి ఇన్నింగ్స్‌లో నిరాశపరిచిన మిథాలీ.. రెండో ఇన్నింగ్స్‌లోనైనా తన సత్తా చూపాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చివరి దాకా నిలబడితేనే మ్యాచ్‌ను డ్రా చేసుకోగలరు. లేదంటే భారత్ కు ఓటమి తప్పదు. అంతకుముందు మూడో రోజు 187/5తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించింది భారత్. అనంతరం 231 పరుగులకు ఆలౌటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో సోఫీ ఎకిల్‌స్టోన్ 4, హెదర్ నైట్ 2 వికెట్లు తీసి భారత్‌ను దెబ్బ కొట్టారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ జట్టు 396/9 వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే.
షెఫాలి వర్మ.. అదే దూకుడు..
షెఫాలి వర్మ.. దూకుడులో వీరేంద్ర సెహ్వాగ్ శైలిని పోలి ఉంటోంది. ఫార్మాట్ ఏదైనా బాదుడే తన పని. ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చెండాడమే పనిగా బరిలోకి దిగుతోంది. ఇప్పటికే మహిళల క్రికెట్లో షెఫాలి వర్మ పేరు మార్మోగిపోతోంది. టీ20లు, వన్డేల్లో దూకుడైన ఆటతో తన సత్తా చాటి, ప్రస్తుతం టెస్టు క్రికెట్‌లోకి అడుగుపెట్టింది. తొలి మ్యాచ్‌లోనే బౌలర్లను ఏకిపారేసింది షెఫాలి వర్మ. ఓవైపు వికెట్టు పడుతున్నా.. తన అద్భుత ఆట తీరుతో ఆకట్టుకుంటూ స్కోర్ బోర్డును పరుగెత్తించింది. టీమిండియా ఆమాత్రమైన స్కోర్ చేసిందంటే షెఫాలి వర్మే కారణం. తొలి ఇన్నింగ్స్‌లోనే సెంచరీ సాధిస్తుందనుకున్నా.. కొద్దిలో ఆ ఛాన్స్ మిస్ చేసుకుంది. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ నిలకడగా ఆడుతూ.. స్కోర్ బోర్డును పరుగులు పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. 68 బంతుల్లోనే 55 పరుగులతో నిలిచింది. ఇదే జోరు కొనసాగించి, జట్టును ఓటమి నుంచి బయటపడేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. అలాగే షెఫాలి వర్మ రెండు ఇన్నింగ్స్‌ల్లో నూ అర్థసెంచరీలు సాధించి, ఓ రికార్డును నెలకొల్పింది. ఒకే ఇన్నింగ్స్‌లో రెండు అర్థసెంచరీలు చేసిన యంగెస్ట్ ప్లేయర్‌గా రికార్డు క్రియోట్ చేసింది.
సంక్షిప్తంగా స్కోర్లు:
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 396/9 డిక్లేర్డ్
భారత్ తొలి ఇన్నింగ్స్: 231
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్: 83/1 (షెఫాలి 55 *, దీప్తి శర్మ 18*, స్మృతి 8)
Rain has forced an early end to Day 3️⃣ in Bristol ?️#TeamIndia 83/1 in the 2nd Innings with @TheShafaliVerma on 5️⃣5️⃣* and @Deepti_Sharma06 on 1️⃣8️⃣*
?? trail by 8️⃣2️⃣ runs #ENGvIND
Scorecard ? https://t.co/Em31vo4nWB
Photo courtesy: Getty Images pic.twitter.com/C4xx1M18xN
— BCCI Women (@BCCIWomen) June 18, 2021
Also Read: