
India vs Australia Live Score, Womens World Cup Semi Final: గురువారం జరిగిన మహిళల వన్డే ప్రపంచ కప్‌లో ఏడుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియాను ఐదు వికెట్ల తేడాతో ఓడించి భారత్ ఫైనల్‌లోకి ప్రవేశించింది. డివై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 48.3 ఓవర్లలో 5 వికెట్లకు 339 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. జెమిమా రోడ్రిగ్స్ 127 పరుగులతో, అమన్‌జోత్ కౌర్ 15 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
భారత మహిళలు (ప్లేయింగ్ XI): షఫాలీ వర్మ, స్మృతి మంధాన, అమంజోత్ కౌర్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (కీపర్), రాధా యాదవ్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్.
ఆస్ట్రేలియా మహిళలు (ప్లేయింగ్ XI): ఫోబ్ లిచ్‌ఫీల్డ్, అలిస్సా హీలీ (కీపర్, కెప్టెన్), ఎల్లీస్ పెర్రీ, బెత్ మూనీ, అన్నాబెల్ సదర్లాండ్, ఆష్లీ గార్డనర్, తహ్లియా మెక్‌గ్రాత్, సోఫీ మోలినెక్స్, అలానా కింగ్, కిమ్ గార్త్, మేగాన్ షుట్.
గురువారం జరిగిన మహిళల వన్డే ప్రపంచ కప్‌లో ఏడుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియాను ఐదు వికెట్ల తేడాతో ఓడించి భారత్ ఫైనల్‌లోకి ప్రవేశించింది.
డివై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 48.3 ఓవర్లలో 5 వికెట్లకు 339 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. జెమిమా రోడ్రిగ్స్ 127 పరుగులతో, అమన్‌జోత్ కౌర్ 15 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
భారత్ 43 ఓవర్లలో 4 వికెట్లకు 284 పరుగులు చేసింది. జెమిమా రోడ్రిగ్జ్, రిచా ఘోష్ క్రీజులో ఉన్నారు. రోడ్రిగ్జ్ ఇప్పటికే సెంచరీ సాధించింది.
దీప్తి శర్మ 24 పరుగుల వద్ద రనౌట్ అయింది. దీంతో భారత్ విజయానికి మరో 75 పరుగుల దూరంలో నిలిచింది.
భారత జట్టు 40 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 257 పరుగులు చేసింది. జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ క్రీజులో ఉన్నారు. రోడ్రిగ్స్ సెంచరీకి దగ్గరగా ఉంది.
భారత మహిళలు 32వ ఓవర్లో 200 పరుగులకు చేరుకున్నారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, జెమిమా రోడ్రిగ్జ్ మైదానంలో ఉన్నారు. 59 పరుగుల వద్ద రెండవ వికెట్ కోల్పోయిన సమయం నుంచి వీరిద్దరు ధాటిగా ఆడుతూ.. సెంచరీ భాగస్వామ్యాన్ని జోడించారు.
భారతదేశం 23 ఓవర్లలో రెండు వికెట్లకు 138 పరుగులు చేసింది. జెమిమా రోడ్రిగ్జ్, హర్మన్‌ప్రీత్ కౌర్ క్రీజులో ఉన్నారు.
భారత్ 15 ఓవర్లలో రెండు వికెట్లకు 88 పరుగులు చేసింది. జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ క్రీజులో ఉన్నారు. స్మృతి మంధాన 24 పరుగులకు, షఫాలి వర్మ 10 పరుగులకు ఔట్ అయ్యారు.
59 పరుగుల వద్ద భారత జట్టు లేడీ కోహ్లీ మంథాన వికెట్‌ను కోల్పోయింది.
ఆరు ఓవర్లు ముగిసేసరికి భారత్ 1 వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది. స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్జ్ క్రీజులో ఉన్నారు. షఫాలి వర్మ 10 పరుగులు చేసిన తర్వాత అవుట్ అయింది.
మహిళల వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా భారత్ ముందు 339 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 49.5 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌట్ అయింది. ఫోబ్ లిచ్‌ఫీల్డ్ 119, ఎల్లీస్ పెర్రీ 77, ఆష్లీ గార్డనర్ 63 పరుగులు చేశారు.
ఆస్ట్రేలియా 42 ఓవర్లలో 6 వికెట్లకు 270 పరుగులు చేసింది.
రాధా యాదవ్ బౌలింగ్‌లో ఫెర్రీ 77 పరుగులు చేసి పెవిలియన్ చేరింది. దీంతో ఆస్ట్రేలియా జట్టు 5 వికెట్లు కోల్పోయి 243 పరుగులు చేసింది.
36వ ఓవర్లో ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. అన్నాబెల్ సదర్లాండ్ 3 పరుగులకే ఔటైంది. దీంతో శ్రీ చరణి ఖాతాలో రెండో వికెట్ చేరింది.
34వ ఓవర్లో ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. బెత్ మూనీ 24 పరుగుల వద్ద అవుట్ అయింది. శ్రీ చరణి బౌలింగ్‌లో జెమిమా రోడ్రిగ్స్ కు క్యాచ్ ఇచ్చింది.
ఆస్ట్రేలియా 27 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 178 పరుగులు చేసింది. ఫోబ్ లిచ్‌ఫీల్డ్, ఎల్లీస్ పెర్రీ క్రీజులో ఉన్నారు. అమన్ జోత్ కౌర్ బౌలింగ్‌లో లిచ్ ఫీల్డ్ (119) పెవిలియన్ చేరింది. దీంతో ఆస్ట్రేలియా జట్టు సెంచరీ భాగస్వామ్యానికి బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం ఆసీస్ జట్టు 28 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది.
23వ ఓవర్లో ఆస్ట్రేలియా స్కోరు 150 పరుగుల మార్కును దాటింది. రాధా యాదవ్ వేసిన రెండో బంతికి ఫోబ్ లిచ్‌ఫీల్డ్ సింగిల్ తీసి జట్టు 150వ పరుగును పూర్తి చేసింది.
25 పరుగులకే జట్టు తొలి వికెట్ కోల్పోయిన తర్వాత 20వ ఓవర్లో ఫోబ్ లిచ్‌ఫీల్డ్, అలిస్సా పెర్రీ రెండో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యంతో దూసుకెళ్తున్నారు.
16వ ఓవర్ మూడో బంతికి ఆస్ట్రేలియా 100 పరుగుల మార్కును చేరుకుంది. శ్రీ చరణి ఓవర్ రెండో బంతికి లిచ్‌ఫీల్డ్ తన జట్టు తరపున 100వ పరుగును సాధించింది. చివరి బంతికి రివ్యూలో లిచ్‌ఫీల్డ్ అవుట్ అవ్వకుండా సేవ్ అయింది.
పవర్ ప్లే ముగిసే సరికి ఆస్ట్రేలియా జట్టు 1 వికెట్ కోల్పోయి 72 పరుగులు చేసింది. లిచ్ఫీల్డ్, పెర్రీ పరుగుల వర్షం కురిపిస్తున్నాడు.
భారత జట్టు ఫీల్డింగ్ తప్పిదాలతో ఆస్ట్రేలియా జట్టు పరుగుల వర్షం కురిపిస్తోంది. 8 ఓవర్లలోపే 50 పరుగులు దాటేసింది.
మ్యాచ్ 6వ ఓవర్లో ఆస్ట్రేలియా కెప్టెన్ హీలీ(5)ని క్రాంతి గౌడ్ పెవిలియన్ చేర్చింది. దీంతో ఆస్ట్రేలియా జట్టు 5.1 ఓవర్లో 1 వికెట్ల కోల్పోయి 25 పరుగులు చేసింది.
మ్యాచ్ మూడో ఓవర్ రెండో బంతికి ఆస్ట్రేలియా కెప్టెన్ అలిస్సా హీలీ ఇచ్చిన సింగపుల్ క్యాచ్‌ను హర్మన్‌ప్రీత్ కౌర్ మిస్ చేసింది. ఆ సమయంలో హీలీ కేవలం 2 పరుగులు మాత్రమే చేసింది.
ఆస్ట్రేలియా ఆడిన గత 21 పూర్తి వన్డేల్లో ఎదుర్కొన్న ఏకైక ఓటమి గత నెలలో భారత్ చేతిలోనే. ఆ మ్యాచ్‌లో 102 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇది ఈ ఫార్మాట్‌లోనే అతిపెద్ద ఓటమి.
నాలుగేళ్ల క్రితం మాకేలో (Mackay), వన్డేల్లో ఆస్ట్రేలియాకు ఉన్న 26 మ్యాచ్‌ల వరుస విజయాల రికార్డును (మార్చి 2018 – సెప్టెంబర్ 2021) భారత్ మాత్రమే బ్రేక్ చేసింది.
ఆస్ట్రేలియా మహిళల వన్డే ప్రపంచకప్‌లో వరుసగా 15 మ్యాచ్‌లను గెలిచి రికార్డు సృష్టించింది. ఆ జట్టు చివరిసారిగా 2017 సెమీ-ఫైనల్‌లో భారత్ చేతిలో ఓడిపోచింది.
9 – ENG-W (ఇంగ్లాండ్) 1982లో
8 – IND-W (భారతదేశం) 1982లో
7 – SL-W (శ్రీలంక) 2000లో
7 – SA-W (సౌత్ ఆఫ్రికా) 2025లో
7 – IND-W (భారతదేశం) 2025లో
భారత మహిళలు (ప్లేయింగ్ XI): షఫాలీ వర్మ, స్మృతి మంధాన, అమంజోత్ కౌర్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (కీపర్), రాధా యాదవ్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్.
ఆస్ట్రేలియా మహిళలు (ప్లేయింగ్ XI): ఫోబ్ లిచ్‌ఫీల్డ్, అలిస్సా హీలీ (కీపర్, కెప్టెన్), ఎల్లీస్ పెర్రీ, బెత్ మూనీ, అన్నాబెల్ సదర్లాండ్, ఆష్లీ గార్డనర్, తహ్లియా మెక్‌గ్రాత్, సోఫీ మోలినెక్స్, అలానా కింగ్, కిమ్ గార్త్, మేగాన్ షుట్.
కీలక మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి, ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.
మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భారత్, ఆస్ట్రేలియా 14 సార్లు తలపడగా, భారత్ మూడుసార్లు గెలిచింది. ఆస్ట్రేలియా 11 సార్లు గెలిచింది.
భారత్, ఆస్ట్రేలియా ఇప్పటివరకు 60 వన్డేలు ఆడగా, భారత జట్టు 11 గెలిచి 49 ఓడిపోయింది. భారత గడ్డపై ఆడిన 28 వన్డేల్లో ఆస్ట్రేలియా 23 గెలిచింది.