AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: మూడో వన్డేలోనూ చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా.. 3-0 తేడాతో సిరీస్ గెలిచిన భారత్

South Africa Women vs India Women: బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మహిళల మధ్య జరిగిన మూడవ, చివరి వన్డేలో ఆతిథ్య టీమిండియా 6 వికెట్ల తేడాతో సులభమైన విజయాన్ని నమోదు చేసింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది.

IND vs SA: మూడో వన్డేలోనూ చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా.. 3-0 తేడాతో సిరీస్ గెలిచిన భారత్
South Africa Women Vs India
Venkata Chari
|

Updated on: Jun 23, 2024 | 9:09 PM

Share

South Africa Women vs India Women: బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో భారత మహిళల జట్టు-దక్షిణాఫ్రికా మహిళల జట్టు మధ్య జరిగిన మూడో, చివరి వన్డేలో ఆతిథ్య టీమిండియా 6 వికెట్ల తేడాతో సులువైన విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆఫ్రికన్ జట్టుపై టీమిండియా విజయం సాధించింది. దీంతో మరో గేమ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకుంది. గత మ్యాచ్‌లో గెలిచిన హర్మన్‌ప్రీత్ సేన.. సిరీస్‌లో దక్షిణాఫ్రికాను వైట్‌వాష్ చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 215 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్ష్యాన్ని ఛేదించిన స్మృతి మంధాన 90 పరుగులు చేయడంతో టీమిండియా మరో 56 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది.

భారత్‌కు సులువైన విజయం..

భారత జట్టు బౌలర్లు తక్కువ మొత్తానికి ఆఫ్రికా జట్టును చిత్తు చేస్తే.. పరుగుల వేటలో భారత జట్టు బ్యాట్స్‌మెన్ అద్భుతంగా ఆడారు. స్మృతి మంధాన, షెఫాలీ వర్మ 61 పరుగులు జోడించారు. అనంతరం షెఫాలీ వర్మ 25 పరుగులు చేసి ఔటైంది. షెఫాలీ వర్మ ఔటైన తర్వాత స్మృతి మంధాన వేగంగా బ్యాటింగ్ కొనసాగించింది. అయితే, 83 బంతుల్లో 90 పరుగులు చేసి సెంచరీ లేకుండానే వెనుదిరింది.

ఈ సిరీస్‌లో స్మృతి మంధాన మూడో సెంచరీ చేసేందుకు మంచి అవకాశం దక్కించుకుంది. కానీ, ఒక్క రాంగ్ షాట్ కారణంగా వికెట్ పడిపోయింది. స్మృతి మంధానతో పాటు, టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా అద్భుతమైన బ్యాటింగ్ చేసి 48 బంతుల్లో 42 పరుగులు చేసింది. 216 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 40.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి సులువుగా గెలిచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇంటర్ అర్హత.. అంగన్‌వాడీల్లో 16 వేల ఉద్యోగాలకు వరుస నోటిఫికేషన్లు
ఇంటర్ అర్హత.. అంగన్‌వాడీల్లో 16 వేల ఉద్యోగాలకు వరుస నోటిఫికేషన్లు
పెద్ది ఇండస్ట్రీకి ఆక్సిజన్‌లాంటి సక్సెస్..
పెద్ది ఇండస్ట్రీకి ఆక్సిజన్‌లాంటి సక్సెస్..
ఒకప్పుడు సమోసాలు అమ్మాడు.. ఇప్పుడు12,490 కోట్ల ఆస్తులున్న హీరో
ఒకప్పుడు సమోసాలు అమ్మాడు.. ఇప్పుడు12,490 కోట్ల ఆస్తులున్న హీరో
భారత్-అమెరికా-మధ్య ఆసియా సహకారానికి కొత్త దారులు.. కీలక భేటీ
భారత్-అమెరికా-మధ్య ఆసియా సహకారానికి కొత్త దారులు.. కీలక భేటీ
విపరీత వేడి వల్ల యూరిన్ రాని వాళ్ళు తినాల్సిన ఆకుల వడలు..
విపరీత వేడి వల్ల యూరిన్ రాని వాళ్ళు తినాల్సిన ఆకుల వడలు..
జూన్ 24 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగంలో శుభవార్తలు!
జూన్ 24 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగంలో శుభవార్తలు!
ఐర్లాండ్ పోరులో ఆ ఇద్దరు యువకులు అరంగేట్రం..!
ఐర్లాండ్ పోరులో ఆ ఇద్దరు యువకులు అరంగేట్రం..!
రీల్స్ పిచ్చి తెచ్చిన ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే ఇద్దరు..!
రీల్స్ పిచ్చి తెచ్చిన ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే ఇద్దరు..!
రామ్ చరణ్‌కు నేషనల్ అవార్డు వచ్చినా రాకపోయినా మీ మనసులు గెలిచాడు
రామ్ చరణ్‌కు నేషనల్ అవార్డు వచ్చినా రాకపోయినా మీ మనసులు గెలిచాడు
పెద్ది విజయానికి కారణం అతడే.. పెద్ది ఈవెంట్‏లో సుకుమార్
పెద్ది విజయానికి కారణం అతడే.. పెద్ది ఈవెంట్‏లో సుకుమార్