IND vs ZIM 5th T20I: టాస్ ఓడిన భారత్.. ప్లేయింగ్ 11లో రెండు మార్పులు.. ఎవరొచ్చారంటే?

IND vs ZIM 5th T20I: భారత్, జింబాబ్వే మధ్య జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో ఐదో మ్యాచ్ హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరుగుతోంది. జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ జట్టులో రెండు మార్పులు చేశాడు. ముఖేష్ కుమార్, రియాన్ పరాగ్‌లు జట్టులోకి వచ్చారు. ఖలీల్‌ అహ్మద్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌లకు విశ్రాంతి లభించింది.

IND vs ZIM 5th T20I: టాస్ ఓడిన భారత్.. ప్లేయింగ్ 11లో రెండు మార్పులు.. ఎవరొచ్చారంటే?
Ind Vs Zim 5th T20i

Updated on: Jul 14, 2024 | 4:44 PM

భారత్, జింబాబ్వే మధ్య జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో ఐదో మ్యాచ్ హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరుగుతోంది. జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ జట్టులో రెండు మార్పులు చేశాడు. ముఖేష్ కుమార్, రియాన్ పరాగ్‌లు జట్టులోకి వచ్చారు. ఖలీల్‌ అహ్మద్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌లకు విశ్రాంతి లభించింది.

ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో టీమిండియా 3-1తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది.

రెండు జట్లలో ప్లేయింగ్-11..

భారత్: శుభమన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ కుమార్.

జింబాబ్వే: అలెగ్జాండర్ రజా (కెప్టెన్), తాడివనాషే మారుమణి, వెస్లీ మాధవరే, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, జోనాథన్ క్యాంప్‌బెల్, క్లైవ్ మదాండే (వికెట్), ఫరాజ్ అక్రమ్, రిచర్డ్ నగరావా, బ్లెస్సింగ్ ముజారబానీ, బ్రాండన్ మవుతా.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us