ఈ ఐపీఎల్ ఆటగాళ్లు నక్కతోక తొక్కారు.. సరాసరి జాతీయ జట్టులోకి వచ్చేస్తున్నారు.!

డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమితో తర్వాత టీమిండియా ఆడబోయే క్రికెట్ షెడ్యూల్‌ను ప్రకటించింది బీసీసీఐ. జూలై 12 నుంచి వెస్టిండీస్‌లో పర్యటించనున్న భారత్..

ఈ ఐపీఎల్ ఆటగాళ్లు నక్కతోక తొక్కారు.. సరాసరి జాతీయ జట్టులోకి వచ్చేస్తున్నారు.!
Ipl 2023

Updated on: Jun 13, 2023 | 5:22 PM

డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమితో తర్వాత టీమిండియా ఆడబోయే క్రికెట్ షెడ్యూల్‌ను ప్రకటించింది బీసీసీఐ. జూలై 12 నుంచి వెస్టిండీస్‌లో పర్యటించనున్న భారత్.. అక్కడ 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. ఈ సిరీస్ ఆగష్టు వరకు సాగనుంది. ఇంకా ఈ విండీస్ సిరీస్‌కు తుది జట్టును బీసీసీఐ ఎంపిక చేయలేదు. ఇక ఐపీఎల్ 2023లో అదరగొట్టిన పలువురు ప్లేయర్స్.. ఈ సిరీస్‌లో భాగం కానున్నారని తెలుస్తోంది. వారిలో యశస్వి జైస్వాల్, రింకూ సింగ్ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

టీ20 ఫార్మాట్‌కు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. వచ్చే టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి అనుభవజ్ఞులను పక్కనపెట్టి.. ఇకపై ఈ ఫార్మాట్‌లో ఐపీఎల్‌లో సత్తాచాటిన యువ ప్లేయర్స్‌కు చోటు ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోందట. ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్‌లో ఫినిషర్‌గా ఆకట్టుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చెందిన రింకూ సింగ్, పంజాబ్ కింగ్స్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జితేష్ శర్మలకు వెస్టిండీస్‌ సిరీస్‌కు అవకాశం దక్కొచ్చునని తెలుస్తోంది. అలాగే వీరితో పాటు రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు కూడా ఛాన్స్ రావడం ఖాయంలా అనిపిస్తోంది.

8 ఏళ్ల తర్వాత మోహిత్ శర్మ రీ-ఎంట్రీ..

చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కూడా తిరిగి జాతీయ జట్టులోకి రావచ్చు. పటిష్ట బ్యాటింగ్‌తో చెన్నైకి టైటిల్‌ను అందించడంలో రుతురాజ్‌ కీలక పాత్ర పోషించాడు. ఢిల్లీ బౌలర్ ముఖేష్ కుమార్‌ను కూడా టెస్టుల్లోకి తీసుకునే అవకాశం ఉందట. మరోవైపు, ఐపీఎల్ 2023లో అద్భుతంగా పునరాగమనం చేసిన గుజరాత్ టైటాన్స్‌కు చెందిన మీడియం పేసర్ మోహిత్ శర్మ కూడా 8 సంవత్సరాల తర్వాత తిరిగి బ్లూ జెర్సీ ధరించనున్నాడని టాక్. 2015లో టీమిండియా తరఫున మోహిత్ చివరి టీ20 మ్యాచ్ ఆడాడు.