
Hardik Pandya-Rahul Dravid: వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లోనూ భారత క్రికెట్ జట్టు ఓటమి చవిచూసింది. ఈ ఓటమి తర్వాత ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను హార్దిక్ పాండ్యా సారథ్యంలోని జట్టు గెలవడం కష్టతరంగా మారింది. సిరీస్ గెలవాలంటే వరుసగా మూడు మ్యాచ్‌లు గెలవాల్సి ఉంటుంది. ప్రస్తుతం మూడో మ్యాచ్ హార్దిక్ సేనకు డూ ఆర్ డై పరిస్థితి నెలకొంది. ఈ మ్యాచ్ పోతే సిరీస్ కూడా చేజారిపోతుంది. రెండో మ్యాచ్‌లో ఓడిపోయిన టీమిండియాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత మాజీ బ్యాట్స్‌మెన్ పార్థివ్ పటేల్ జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను టార్గెట్ చేశాడు. కోచ్ ద్రవిడ్ నుంచి పాండ్యాకు అవసరమైన సహకారం అందడం లేదని పార్థివ్ చెప్పుకొచ్చాడు.
బలహీనంగా ఉన్న వెస్టిండీస్‌తో భారత జట్టు వరుసగా రెండు టీ20 మ్యాచ్‌లు ఓడిపోయి సిరీస్‌ను చేజార్చుకునే దశలో నిలుస్తుందని ఎవరూ ఊహించలేదు . ఈ రెండు పరాజయాలు పాండ్యా కెప్టెన్సీపై ప్రశ్నలు లేవనెత్తాయి. రెండో మ్యాచ్‌లో లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు కోటాలో పూర్తి నాలుగు ఓవర్లు ఇవ్వకపోవడంపైనా అతని నిర్ణయం ప్రశ్నార్థకంగా మారింది.
టీ20 ప్రపంచకప్-2021 తర్వాత ద్రవిడ్ జట్టు బాధ్యతలు స్వీకరించాడు. అతని రాక తర్వాత జట్టులో మార్పు వస్తుందని, ఐసీసీ ట్రోఫీని గెలవాలన్న జట్టు కరువు తీరుతుందని అంతా భావించారు. అయితే గతేడాది టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత పాండ్యా కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. పాండ్యా కెప్టెన్సీలో IPL మొదటి సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌కు టైటిల్‌ను అందించాడు. తన జట్టును IPL-2023లో ఫైనల్స్‌కు తీసుకెళ్లాడు. ఆశిష్ నెహ్రా గుజరాత్ ప్రధాన కోచ్‌గా ఉన్న విషయం తెలిసిందే. గుజరాత్‌లో నెహ్రా నుంచి పాండ్యాకు లభిస్తున్న మద్దతును ద్రవిడ్ అందించలేకపోతున్నాడని పార్థివ్ చెప్పుకొచ్చాడు.
Cracking start with the ball from #TeamIndia! 🙌 🙌
Captain Hardik Pandya & Arshdeep Singh have struck early. 👌 👌
Special mention: That catch from Suryakumar Yadav! 👍 👍
West Indies 33/3 after 4 overs.
Follow the match ▶️ https://t.co/9ozoVN9VIf #WIvIND pic.twitter.com/GXPwbA7QCb
— BCCI (@BCCI) August 6, 2023
గుజరాత్‌కు పాండ్యా గొప్ప కెప్టెన్సీ చేశాడని, అక్కడ అతనికి నెహ్రా మద్దతు లభిస్తోందని పార్థివ్ క్రిక్‌బజ్‌లో పేర్కొన్నాడు. టీ20 ఫార్మాట్‌లో ద్రవిడ్ లాంటి కోచ్ అవసరమా అని పార్థివ్ ప్రశ్నించాడు. ద్రవిడ్ టీ20 ఫార్మాట్ కోచ్ అని తాను అనుకోవడం లేదని పార్థివ్ అన్నాడు. పాండ్యాకు ఆ సత్తా ఉన్నందున జట్టుకు చురుగ్గా ఉండే కోచ్ అవసరమని, అయితే ద్రవిడ్ నుంచి అతనికి మద్దతు అవసరమని, అది అతనికి లభించడం లేదంటూ చెప్పుకొచ్చాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..