WI vs IND, 5th T20I: టాస్ గెలిచిన టీమిండియా.. కెప్టెన్సీలో మార్పు.. ప్లేయింగ్ XIలోనూ..

|

Aug 07, 2022 | 7:52 PM

ఇప్పటికే 3-1తో సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియంలో భారత జట్టు వెస్టిండీస్‌తో 5 మ్యాచ్‌లు ఆడింది. వీటిలో మూడింటిలో భారత్‌ విజయం సాధించింది.

WI vs IND, 5th T20I: టాస్ గెలిచిన టీమిండియా.. కెప్టెన్సీలో మార్పు.. ప్లేయింగ్ XIలోనూ..
West Indies Vs India, 5th T20i
Follow us on

భారత్, వెస్టిండీస్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్ నేడు ఫ్లోరిడాలోని లాడర్‌హిల్‌లో జరుగుతోంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన టీమిండియా, తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ప్లేయింగ్ XIలో కీలక మార్పులు చేశారు. కెప్టె్న్‌గా హార్దిక్ పాండ్యా కనిపించనుండగా, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్ రీఎంట్రీ ఇచ్చారు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతిని ఇచ్చారు. ఇప్పటికే 3-1తో సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియంలో భారత జట్టు వెస్టిండీస్‌తో 5 మ్యాచ్‌లు ఆడింది. వీటిలో మూడింటిలో భారత్‌ విజయం సాధించింది. అదే సమయంలో ఒక మ్యాచ్‌లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. కాగా ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.

వెస్టిండీస్‌లోని సెయింట్ కిట్స్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను భారత్ విజయంతో ప్రారంభించింది. కానీ, రెండో మ్యాచ్‌లో ఆతిథ్య విండీస్ విజయం సాధించి సిరీస్‌ను సమం చేసింది. భారత్ మూడో మ్యాచ్ గెలిచి 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే నాల్గవ T20Iలో వెస్టిండీస్‌ను 59 పరుగుల తేడాతో ఓడించిన తర్వాత, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 3-1తో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించి, సిరీస్‌ను సొంతం చేసుకుంది.

ఇవి కూడా చదవండి

ఇరు జట్లు..

భారత్ (ప్లేయింగ్ XI): ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), దీపక్ హుడా, దినేష్ కార్తీక్(కీపర్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్

వెస్టిండీస్ (ప్లేయింగ్ XI): షమర్ బ్రూక్స్, షిమ్రాన్ హెట్మెయర్, నికోలస్ పూరన్(కెప్టెన్), డెవాన్ థామస్(కీపర్), జాసన్ హోల్డర్, ఓడియన్ స్మిత్, కీమో పాల్, డొమినిక్ డ్రేక్స్, ఒబెడ్ మెక్‌కాయ్, హేడెన్ వాల్ష్, రోవ్‌మన్ పావెల్