IND vs WI 2nd T20, LIVE Score: శుక్రవారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20 ఇంటర్నేషనల్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచులో టీమిండియా 8 పరుగుల తేడాతో విజయం సాధించి మూడు టీ20ఐ సిరీస్‌లో 2-0 తేడాతో విజయం సాధించింది. 18వ ఓవర్ వేసిన భువనేశ్వర్ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. ఇక చివరి ఓవర్‌లో 24 పరుగులు కావాల్సిన తరుణంలో హర్షల్ పటేల్ కూడా సూపర్బ్‌గా వేయడంలో వెస్టిండీస్ టీం కేవలం 16 పరుగులు మాత్రమే సాధించింది. దీంతో విజాయానికి 7 పరుగులు దూరంలో నిలిచింది. మొత్తంగా విండీస్ 20 ఓవర్లతో 3 వికెట్లు కోల్పోయి 178 పరుగులు మాత్రమే చేసింది. విండీస్ టీంలో పావెల్ 68 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
వెస్ట్ ఇండిస్‌తో జరుగుతోన్న రెండో టీ20 మ్యాచ్‌ను గెలుచుకొని సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా చూస్తోంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండిస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. మరి రెండో టీ20లో కూడా భారత్ విజయ పరంపరను కొనసాగిస్తుందా.? సిరీస్‌ను సొంతం చేసుకుంటుందా.? చూడాలి.
ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో భారత్ మార్పులు లేకుండా బరిలోకి దిగుతుండగా, విండీస్ ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగింది. ఫాబియాన్ అలెన్ స్ధానంలో జాసన్ హోల్డర్ జట్టులోకి వచ్చాడు.
భారత తుది జట్టు: ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, దీపక్ చహర్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్, యజువేంద్ర చహల్
వెస్టిండీస్ తుది జట్టు: బ్రాండన్ కింగ్, కైల్ మేయెర్స్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), పావెల్, కీరన్ పొలార్డ్(కెప్టెన్), రోస్టన్ చేజ్, రొమారియో షెపర్డ్, ఓడియన్ స్మిత్, అకీల్ హొసేన్, షెల్డన్ కాట్రెల్,జాసన్ హోల్డర్
Also Read: రూ.3.5 కోట్లు పెట్టి కోతి బొమ్మ కొన్న వ్యక్తి !! ఎందుకో తెలుసా ?? వీడియో
శుక్రవారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20 ఇంటర్నేషనల్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచులో టీమిండియా 8 పరుగుల తేడాతో విజయం సాధించి మూడు టీ20ఐ సిరీస్‌లో 2-0 తేడాతో విజయం సాధించింది. 18వ ఓవర్ వేసిన భువనేశ్వర్ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. ఇక చివరి ఓవర్‌లో 24 పరుగులు కావాల్సిన తరుణంలో హర్షల్ పటేల్ కూడా సూపర్బ్‌గా వేయడంలో వెస్టిండీస్ టీం కేవలం 16 పరుగులు మాత్రమే సాధించింది. దీంతో విజాయానికి 7 పరుగులు దూరంలో నిలిచింది. మొత్తంగా విండీస్ 20 ఓవర్లతో 3 వికెట్లు కోల్పోయి 178 పరుగులు మాత్రమే చేసింది. విండీస్ టీంలో పావెల్ 68 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
కీలక సమయంలో వెస్టిండీస్ క్రీజులో అర్థసెంచరీతో పాతుకపోయిన పూరన్(62) పెవిలియన్ చేరాడు. దీంతో 100 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. వెస్టిండీస్ విజయానికి మరో 8 బంతుల్లో 27 పరుగులు చేయాల్సి ఉంది.
రెండో టీ20లో టీమిండియా విజయం సాధించే అవకాశాలు పూర్తిగా సన్నగిల్లాయి. ఓవైపు పూరన్, మరోవైపు పావెల్ అద్భుత బ్యాటింగ్ ముందు భారత బౌలర్ల ప్రయత్నాలు ఏమాత్రం పనిచేయడం లేదు. ఈ క్రమంలో పూరన్35 బంతుల్లో 56 పరుగులు పూర్తి చేయగా, పావెల్ కూడా 28 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు. వెస్టిండీస్ వియానికి మరో 13 బంతుల్లో కేవలం 33 పురుగులు మాత్రమే కావాల్సి ఉంది.
రెండో టీ20లో టీమిండియా విజయం సాధించే అవకాశాలు పూర్తిగా సన్నగిల్లాయి. ఓవైపు పూరన్, మరోవైపు పావెల్ అద్భుత బ్యాటింగ్ ముందు భారత బౌలర్ల ప్రయత్నాలు ఏమాత్రం పనిచేయడం లేదు. ఈ క్రమంలో పూరన్35 బంతుల్లో 56 పరుగులు పూర్తి చేశాడు. వెస్టిండీస్ వియానికి మరో 17 బంతుల్లో కేవలం 36 పురుగులు మాత్రమే కావాల్సి ఉంది.
వెస్టిండిస్ బ్యాట్స్‌మెన్ దూకుడుగా ఆడుతున్నారు. టీమిండియా లక్ష్యాన్ని చేధించే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఫోర్లు, సిక్సర్లతో స్కోర్ దూసుకుపోతోంది. ప్రస్తుతం 12 ఓవర్లు ముగిసే సమయానికి వెస్టిండిస్ స్కోర్ 91 పరగుల వద్ద కొనసాగుతోంది.
టీమిండియా ఇచ్చిన 187 పరగుల భారీ లక్ష్యంతో రంగంలోకి దిగిన వెస్టిండిస్ లక్ష్యం దిశగా ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో 10 ఓవర్లు ముగిసే సమయానికి వెస్టిండిస్ సోర్ 2 వికెట్ల నష్టానికి 73 పరుగుల వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం క్రీజులో పావెల్ (5), పూరన్ (29) పరుగుల వద్ద కొనసాగుతున్నారు.
వెస్టిండిస్ రెండో వికెట్‌ను కోల్పోయింది. బ్రాండన్ కింగ్ 22 పరుగల వద్ద అవుట్ అయ్యాడు. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి బ్రాండన్ కింగ్ సుర్యకుమార్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు.
భారత లక్ష్యాన్ని చేధించే క్రమంలో వెస్టిండిస్ బ్యాట్స్‌మెన్ దూసుకుపోతున్నారు. వరుస బౌండరీలతో జట్టు స్కోరును పెంచుతున్నారు. ఈ క్రమంలోనే వెస్టిండిస్ 50 పరుగుల మార్క్‌ను దాటేసింది. ప్రస్తుతం ఏడు ఓవర్లు ముగిసే సమయానికి వెస్టిండిస్ స్కోర్ 1 వికెట్ నష్టానికి 54 పరుగుల వద్ద కొనసాగుతోంది. క్రీజులో నికోలస్ పూరన్ (18), బ్రాండన్ కింగ్ (20) పరుగుల వద్ద కొనసాగుతున్నారు.
వెస్టిండిస్ తొలి వికెట్‌ను కోల్పోయింది. చాహల్ వేసిన బంతిలో అతనికే క్యాచ్ ఇచ్చి కైల్ మేయెర్స్ 9 పరుగుల వద్ద వెనుతిరిగాడు. ప్రస్తుతం వెస్టిండిస్ స్కోర్ 38 పరుగుల వద్ద కొనసాగుతోంది.
టీమిండియా ఇచ్చిన 187 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన వెస్టిండిస్ తొలి నుంచి ఆచితూచి ఆడుతోంది. వికెట్ల కోల్పోకుండా బ్యాట్స్‌మెన్ స్టాండింగ్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే నాలుగు ఓవర్లు ముగిసే సమయానికి వెస్టిండిస్ 28 పరుగుల వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం క్రీజులో కైల్ మేయెర్స్ (8), బ్రాండన్ కింగ్ (13) పరుగులతో కొనసాగుతున్నారు.
వెస్టిండిస్‌తో జరుగుతోన్న రెండో టీ20లో టీమిండియా బ్యాట్స్‌మెన్ చెలరేగి ఆడారు. బ్యాట్స్‌మెన్ రాణించడంతో టీమిండియా 186 పరుగులు చేయగలిగింది. విరాట్ కోహ్లీ 52 పరుగులు, రిషబ్ పంత్ 52 పరుగులతో టీమిండియా స్కోర్ పెరగడంలో కీలక పాత్ర పోషించారు. ఇక రోహిత్ శర్మ (19), వెంకటేష్ అయ్యర్ (33) పరుగులు సాధించారు.
జట్టు స్కోర్ పెంచే క్రమంలో పంత్ దూకుడుగా ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో చెలరేగాడు పంత్. ప్రస్తుతం టీమిండియా స్కోర్ 5 వికెట్ల నష్టానికి 185 పరుగుల వద్ద కొనసాగుతోంది.
టీమిండియా భారీ స్కోర్ సాధించే దిశగా దూసుకుపోతోంది. క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మెన్ బ్యాట్‌కు పనిచెప్పడంతో జట్టు స్కోరు పెరుగుతోంది. రిషబ్ పంత్, వెంకటేష్ అయ్యర్ వరుసగా బౌండరీలను బాదుతున్నారు. టీమిండియా ప్రస్తుతం 4 వికెట్ల నష్టానికి 170 పరుగుల వద్ద కొనసాగుతోంది.
వెస్టిండిస్‌తో జరుగుతోన్న రెండో టీ20లో భారత్ మంచి స్కోరు దిశగా దూసుకుపోతోంది. బ్యాట్స్‌మెన్ రాణిస్తుండడంతో టీమిండియా స్కోరు దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే 17 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా 4 వికెట్ల నష్టానికి 152 పరుగుల వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం క్రీజులో వెంకటేష్ అయర్(23), రిషాబ్ పంత్ (26) పరుగుల వద్ద కొనసాగుతున్నారు.