IND vs WI: రెండో వన్డేలో బెడిసికొట్టిన టీమిండియా ప్రయోగం.. అదేంటంటే?

|

Feb 09, 2022 | 2:59 PM

Rohit Sharma-Rishabh Pant: భారత్ వర్సెస్ వెస్టిండీస్(IND vs WI) వన్డే సిరీస్‌లో భాగంగా నేడు రెండో వన్డేలో రోహిత్ శర్మ(Rohit Sharma)తో కలిసి రిషబ్ పంత్(Rishabh Pant) ఓపెనింగ్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.

IND vs WI: రెండో వన్డేలో బెడిసికొట్టిన టీమిండియా ప్రయోగం.. అదేంటంటే?
India Vs West Indies 2nd Odi Rohit And Pant
Follow us on

India vs West Indies 2nd ODI: భారత్ వర్సెస్ వెస్టిండీస్ వన్డే సిరీస్‌లో భాగంగా నేడు రెండో వన్డేలో రోహిత్ శర్మతో కలిసి రిషబ్ పంత్ ఓపెనింగ్ చేశాడు. దీంతో టీమిండియా ఫ్యాన్స్‌తో పాటు మాజీలు కూడా ఆశ్చర్యపోయారు. భారత్ వర్సెస్ వెస్టిండీస్(IND vs WI) వన్డే సిరీస్‌లో భాగంగా నేడు రెండో వన్డేలో రోహిత్ శర్మ(Rohit Sharma)తో కలిసి రిషబ్ పంత్(Rishabh Pant) ఓపెనింగ్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ ఓపెనింగ్ జోడీని చూసి అంతా ఆశ్చర్యపోయారు. రెండో వన్డేలో టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్‌లో విండీస్ రెగ్యులర్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ మిస్సయ్యాడు. పొలార్డ్ గాయంతో నికోలస్ పూరన్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. పొలార్డ్ స్థానంలో ఓడియన్ స్మిత్ ప్లేయింగ్ XIలోకి వచ్చాడు. మరోవైపు, ఇషాన్ కిషన్‌కు బదులుగా కేఎల్ రాహుల్ రూపంలో ఒక మార్పుతో భారత్ రెండో వన్డేలో బరిలోకి దిగింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత ఓపెనింగ్ జోడీని చూసి అంతా ఆశ్యర్యపోయారు. రోహిత్‌తో పాటు కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌కు వస్తాడని అంతా అనుకున్నారు. కానీ, రిషబ్ పంత్ ఓపెనింగ్ బరిలో దిగాడు. అయితే ఈ మార్పు టీమిండియాకు అంతగా కలిసిరాలేదు. అయితే రోహిత్‌తో కలిసి పంత్ ఓపెనింగ్ చేయడం వెనుక కారణం కూడా బయటకు వచ్చింది. వచ్చే ప్రపంచకప్‌కు ముందు టీమిండియా కొన్ని ప్రయోగాలు చేస్తుంది. ఇందులో భాగంగానే ఓపెనింగ్ జోడీలో పలు మార్పులు చేసేందుకు రాహుల్ ద్రవిడ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రెగ్యులర్ ఓపెనర్ శిఖర్ ధావన్ గైర్హాజరీలో రిషబ్ పంత్ 2వ వన్డేలో ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. కేఎల్ రాహుల్ గత రెండేళ్లలో వన్డేలలో మిడిల్ ఆర్డర్‌లో భారత్‌కు బాగా రాణిస్తున్నాడు. దీంతోనే రోహిత్ శర్మతో కలిసి రిషబ్ పంత్ ఓపెనింగ్ చేశాడు.

Also Read: IPL 2022: జట్టు పేరు ప్రకటించిన అహ్మదాబాద్.. హార్దిక్ పాండ్యా టీం ఏ పేరుతో బరిలోకి దిగనుందంటే?

IPL 2022: ధోని అతడి కోసం 9.25 కోట్లు వెచ్చించాడు.. కానీ ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు..?