IND vs WI: భారత్ ధాటికి విండీస్ విలవిల.. సిరీస్ సొంతం చేసుకున్న టీమిండియా..

|

Feb 10, 2022 | 4:16 AM

India vs West Indies 2nd ODI Highlights: అహ్మదాబాద్ వేదికగా వెస్టిండిస్‌తో జరుతున్న రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. కరేబీయన్ జట్టుపై రోహిత్ సేన

IND vs WI: భారత్ ధాటికి విండీస్ విలవిల.. సిరీస్ సొంతం చేసుకున్న టీమిండియా..
Ind Vs Wi
Follow us on

India vs West Indies 2nd ODI Highlights: అహ్మదాబాద్ వేదికగా వెస్టిండిస్‌తో జరుతున్న రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. కరేబీయన్ జట్టుపై రోహిత్ సేన 44 పరుగుల తేడాతో విజయఢంకా మోగించి మూడు వన్డేల సిరీస్‌ను (IND vs WI) 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 9 వికెట్ల 237 పరుగులు చేసింది. అనంతరం 238 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్.. భారత (India vs West Indies) బౌలర్ల ధాటికి 46 ఓవర్లలో కేవలం 193 పరుగులకే ఆలౌటైంది. భారత్ విజయంలో బౌలర్ ప్రసిద్ధ్‌ కృష్ణ (4/12) కీలకపాత్ర పోషించాడు. వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్లలో షమ్ బ్రూక్స్‌ (44) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అకీల్‌ హోసెయిన్‌ (34), షాయ్‌ హోప్‌ (27) రాణించారు. టీమిండియా బౌలర్లలో ప్రసిద్ధ్‌ కృష్ణ 4 వికెట్లు, శార్దూల్ ఠాకూర్‌ 2, యుజ్వేంద్ర చాహల్‌, దీపక్‌ హుడా, మహమ్మద్‌ సిరాజ్‌, వాషింగ్టన్‌ సుందర్‌ తలో వికెట్ పడగొట్టారు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇరుజట్ల మధ్య నామమాత్రపు మూడో వన్డే ఫిబ్రవరి 11న (శుక్రవారం) జరగనుంది.

అంతకు ముందు బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (64) అర్ధసెంచరీతో అదరగొట్టగా.. వైస్‌ కెప్టెన్‌ కేఎల్ రాహుల్‌ (49) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో దీపక్‌ హుడా (29) వాషింగ్టన్‌ సుందర్‌ (24) రాణించడంతో టీమిండియా గౌరవప్రదమైన స్కోర్ సాధించగలిగింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (5) విరాట్‌ కోహ్లీ (18), తక్కువ పరుగలకే పెవిలియన్ చేరారు. వెస్టిండీస్‌ బౌలర్లలో స్మిత్‌, అల్జారీ జోసెఫ్‌ రెండేసి, కీమర్‌ రోచ్‌, ఫేబియన్‌ అలెన్‌, అకీల్ హోసెయిన్, జేసన్‌ హోల్డర్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

Also Read:

Helping Hands: పాపం పసివాడు.. దిక్కుతోచని స్థితిలో తల్లిదండ్రులు.. దాతలకై ఎదురుచూపులు..

Viral: జన్‌ధన్ ఖాతాలో రూ.15 లక్షలు.. ఉబ్బితబ్బిబై రూ.9 లక్షలతో ఇల్లు కట్టేశాడు.. చివర్లో దిమ్మతిరిగే షాక్!

IND vs WI: రెండో వన్డేలో తడబడిన టీమిండియా.. విండీస్ టార్గెట్ 238