India Vs West Indies: విరాట్ కోహ్లీ(Virat Kohli) కెప్టెన్‌గా ఉన్నప్పుడు, అతని DRS నిర్ణయాలపై తరచుగా ప్రశ్నలు తలెత్తాయి. అయితే కెప్టెన్సీ నుంచి తప్పుకున్న వెంటనే ఈ వెటరన్ ప్లేయర్ డీఆర్ఎస్ కారణంగా టీమ్ ఇండియాకు కీలకమైన వికెట్ అందించాడు. యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) మ్యాచ్ 22వ ఓవర్‌లో షెమారా బ్రూక్స్ వికెట్‌ని పడగొట్టాడు. అయితే ఈ బ్యాట్స్‌మన్‌ను అవుట్ చేయడంలో విరాట్ కోహ్లీ కూడా కీలకపాత్ర పోషించాడు. ఎందుకంటే కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) మాజీ కెప్టెన్ కోహ్లీ ఆదేశానుసారం DRS తీసుకున్నాడు. ఫలితంగా భారత్ డీఆర్‌ఎస్‌లో విజయం సాధించింది. డీఆర్‌ఎస్ కోసం రోహిత్ శర్మను విరాట్ కోహ్లీ ఎలా ఒప్పించాడనే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన వెబ్‌సైట్‌లో కూడా షేర్ చేసింది.
మ్యాచ్ 22వ ఓవర్‌లో యుజ్వేంద్ర చాహల్ తన లెగ్ స్పిన్ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ షెమారా బ్రూక్స్ బంతిని ఫ్రంట్ ఫుట్‌లో ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే ఈ సమయంలో బంతి అతని బ్యాట్ అంచుని తాకి పంత్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో టీమిండియా ఆటగాళ్లు అప్పీల్ చేసినా అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. అయితే, బౌలర్ యుజ్వేంద్ర చాహల్ బంతి బ్యాట్ అంచును తాకిందని భావించాడు. అతను చాలా నమ్మకంగా ఉన్నాడు. అయితే, వికెట్ కీపర్ పంత్ ప్రకారం, బంతి బ్యాట్ అంచుకు చేరుకోలేదు. అయితే విరాట్ కోహ్లి, షార్ట్ కవర్ వద్ద నిలబడి, రోహిత్ శర్మతో డీఆర్‌ఎస్ తీసుకోమ్మని చెప్పాడు. దీంతో రోహిత్ డీఆర్‌ఎస్ తీసుకుని విజయం సాధించాడు.
విరాట్ మాటలను రోహిత్ శర్మ ఓకే చేశాడు..
విరాట్ కోహ్లి మాటలపై చాలా నమ్మకం ఏర్పడింది. అందుకే పంత్ మాట వినకుండా మాజీ కెప్టెన్ మాట విన్నాడు. రోహిత్ శర్మ డీఆర్ఎస్ తీసుకోవడంతో భారత్‌కు వికెట్ దక్కింది. ఆటగాళ్లందరి వాయిస్‌లు స్టంప్ మైక్‌లో రికార్డయ్యాయి. దీని వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పంత్ ప్రకారం, బంతి బ్యాట్‌కు తగలలేదంటే, రోహిత్ శర్మ మాత్రం విరాట్ నిర్ణయంతో డీఆర్‌ఎస్ తీసుకుని విజయం సాధించాడు.
భారత్ అత్యుత్తమ బౌలింగ్..
తొలి వన్డేలో టీమిండియా అద్భుతంగా బౌలింగ్ చేసింది. వెస్టిండీస్ జట్టు 43.5 ఓవర్లలో 176 పరుగులకే కుప్పకూలింది. యుజ్వేంద్ర చాహల్ 4, వాషింగ్టన్ సుందర్ 3 వికెట్లు తీశారు. ప్రసీద్ధ్ కృష్ణ కూడా 2 వికెట్లు తీసుకున్నాడు. సిరాజ్ ఒక వికెట్ తీశాడు. వెస్టిండీస్ కెప్టెన్ పొలార్డ్ తొలి బంతికే ఔటయ్యాడు. అయితే, జాసన్ హోల్డర్ 57 పరుగులు చేసి వెస్టిండీస్‌ను 170 దాటించాడు.
kohliiiiiiiiiiiiii pic.twitter.com/tr7j92R41A
— Aarav (@singlaaarav) February 6, 2022
IND VS WI: చాహల్-సుందర్ దెబ్బకు వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్ విలవిల.. 176 పరుగులకే ఆలౌట్..!