శ్రీలంక(India vs sri lanka)తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్(Rishbah Pant) రికార్డు స్థాయిలో హాఫ్ సెంచరీ సాధించాడు. భారత్ తరపున టెస్టు ఫార్మాట్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా పంత్ నిలిచాడు. కపిల్ దేవ్ 40 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. రిషబ్ పంత్(50) హాఫ్ సెంచరీ చేశాక పెవిలియన్ చేరాడు. అయితే ఈ క్రమంలో టెస్టుల్లో కపిల్ దేవ్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని బ్రేక్ చేశాడు.
కపిల్ దేవ్(Kapil Dev) 30 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా, రిషబ్ పంత్ మాత్రం కేవలం 28 బంతుల్లోనే పూర్తి చేసి భారత ఆటగాళ్లలో అగ్రస్థానంలో నిలిచాడు. రిషబ్ పంత్ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. అలాగే 161 స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించాడు.
టెస్ట్ క్రికెట్‌లో భారతదేశం తరపున అత్యంత వేగంగా నమోదైన హాఫ్ సెంచరీలు..
28 రిషబ్ పంత్ vs SL బెంగళూరు 2022 *
30 కపిల్ దేవ్ vs పాక్ కరాచీ 1982
31 శార్దూల్ ఠాకూర్ vs ఇంగ్లండ్ ఓవల్ 2021
32 V సెహ్వాగ్ vs చెన్నై 200
టెస్టుల్లో భారత్‌లో అత్యంత వేగంగా నమోదైన హాఫ్ సెంచరీ (ఎదుర్కొన్న బంతులు)
26 షాహిద్ అఫ్రిది vs భారత్, బెంగళూరు 2005
28 ఇయాన్ బోథమ్ vs భారత్ 1981
28 రిషబ్ పంత్ vs ఎస్‌ఎల్ బెంగళూరు 2022 *
31 ఏ రణతుంగ vs భారత్ 1986
రిషబ్ పంత్ వర్సెస్ శ్రీలంక 2వ టెస్ట్..
మొదటి ఇన్నింగ్స్: 39 పరుగులు, 26 బంతులు (స్ట్రైక్ రేట్ 150.00)
2వ ఇన్నింగ్స్: 50 పరగులు 31 బంతులు (SR SR 161.29)
ఒక టెస్ట్‌లోని ప్రతి ఇన్నింగ్స్‌లో 150+ స్ట్రైక్ రేట్‌తో 30+ పరుగులు చేసిన మొదటి ఆటగాడిగా రిషబ్ పంత్ మరో రికార్డు నెలకొల్పాడు.
ICC Womens World Cup: అగ్రస్థానం కోల్పోయిన టీమిండియా.. పాయింట్ల పట్టికలో ఏటీం ప్లేస్ ఎక్కడ ఉందంటే?