IND vs SL T20 Highlights: ఉత్కంఠ పోరులో శ్రీలంక ఘన విజయం.. టీమిండియా ఫైనల్‌ ఆశలు గల్లంతు

IND vs SL T20 Highlights: తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యే సరికి 8 వికెట్లు కోల్పొయి 173 పరుగులు సాధించింది. దీంతో శ్రీలంక ముందు 174 పరుగుల టార్గెట్ ను ఉంచింది.

IND vs SL T20 Highlights: ఉత్కంఠ పోరులో శ్రీలంక ఘన విజయం.. టీమిండియా ఫైనల్‌ ఆశలు గల్లంతు
Srilanka Won The Match

Updated on: Sep 06, 2022 | 11:42 PM

India vs Sri Lanka Dubai Asia Cup 2022 Highlights:  తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా ప్లేయర్స్‌ చేతులెత్తేశారు. బౌలింగ్‌లో పేలవ ప్రదర్శన చేయడంతో రోహిత్ సేన భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. దీంతో సూపర్‌ 4లో భారత్‌ వరుసగా రెండు పరాజాయాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఆరు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. శ్రీలంక బ్యాట్స్‌మెన్‌లో కుసల్‌ మెండిస్‌ 57 పరుగులు, పాతుమ్‌ నిస్సాంక (52) పరుగులు సాధించి మ్యాచ్‌ విజయంలో కీలకపాత్ర పోషించారు.

భారత్‌ ఇచ్చిన 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక తొలి నుంచి దూకుడుగా ఆడింది. ఓపెనర్లు దూకుడుగా ఆడుతూ జట్టు స్కోర్‌ను పరుగులు పెట్టించారు. అయితే పాతుమ్ నిస్సాంక అవుట్‌ అయిన తర్వాత శ్రీలం వరుస వికెట్లను కోల్పోయింది. నాలుగు వికెట్లు కోల్పోవడంతో టీమిండియా విజయం ఖరారు అనుకుంటున్న తరుణంలో క్రీజులోకి వచ్చి రాజపక్సా (25), దసున్‌ షనక (33) సమిష్టిగా ఆడడంతో శ్రీలంక విజయాన్ని అందుకుంది.

ఇక అంతకు ముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 173 పరుగులు సాధించింది. రోహిత్‌ శర్మ 72 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. అనంతరం సూర్యకుమార్‌ యాదవ్‌ 34 పరుగులు చేశాడు. మిగతా ప్లేయర్స్‌ మాత్రం 20 పరుగుల మార్క్‌ను దాటలేదు.

ఇరుజట్ల ప్లేయింగ్ XI –

భారత్ (ప్లేయింగ్ XI): KL రాహుల్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(కీపర్), దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్

శ్రీలంక (ప్లేయింగ్ XI): పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(కీపర్), చరిత్ అసలంక, దనుష్క గుణతిలక, భానుక రాజపక్స, దసున్ షనక(కెప్టెన్), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, అసిత ఫెర్నాండో, దిల్షన్ మధుశంక

Key Events

టీ20ల్లో పై చేయి ఎవరిదంటే?

భారత్-శ్రీలంక మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌ల రికార్డును పరిశీలిస్తే.. భారత్ 17 మ్యాచ్‌లు గెలిచింది. కాగా 7 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.

సూపర్ ఫోర్ పాయింట్ల పట్టిక..

ఆసియా కప్ 2022 సూపర్ ఫోర్ పాయింట్ల పట్టికను పరిశీలిస్తే, ప్రస్తుతం శ్రీలంక అగ్రస్థానంలో ఉంది. టీమ్ ఇండియా మూడో స్థానంలో ఉంది.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 06 Sep 2022 11:19 PM (IST)

    ఉత్కంఠ పోరులో శ్రీలంక ఘన విజయం..

    ఇండియాపై శ్రీలంక ఘన విజయాన్ని సాధించింది. టీమిండియా ఇచ్చిన 173 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక చివరి వరకు పోరాడి చేధించింది. ఆరు వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో ఆసియా కప్‌ నుంచి భారత్‌ దాదాపు నిష్క్రమించినట్లే. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా చేతులెత్తేసింది.

  • 06 Sep 2022 11:09 PM (IST)

    చివరి ఓవర్‌..

    ఇండియా శ్రీలంక మ్యాచ్‌ చివరి అంకానికి చేరుకుంది. శ్రీలంక విజయాన్ని అందుకోవాలంటే చివరి ఓవర్‌లో7 పరుగులు చేయాల్సి ఉంది. దసున్‌ షనక, రాజపక్స దూకుడుగా ఆడుతుండడంతో శ్రీలంక విజయ తీరాలకు చేరుకుంటోంది.


  • 06 Sep 2022 10:56 PM (IST)

    మళ్లీ పుంజుకుంటోన్న స్కోర్ బోర్డ్‌..

    వరుస వికెట్లు కోల్పోతూ కష్టాల్లోకి కూరుకుపోతున్న శ్రీలంక మళ్లీ పుంజుకుంటోంది. క్రీజులో రాజపక్సా, దసున్ షనక నిలకడగా ఆడుతుండడంతో లంక స్కోర్‌ మళ్లీ పరుగులు పెడుతోంది. లంక గెలవడానికి ఇంకా 19 బంతుల్లో 33 పరుగులు చేయాల్సి ఉంది.

  • 06 Sep 2022 10:44 PM (IST)

    కష్టాల్లోకి శ్రీలంక..

    శ్రీలంక వరుస వికెట్లను కోల్పోతూ కష్టాల్లోకి కూరుకుపోతోంది. మొదట్లో విజయం పక్కా అనుకుంటున్న సమయంలో భారత బౌలర్లు చెలరేగారు. వరుసగా శ్రీలంక వికెట్లను కోల్పోతోంది. నాలుగో వికెట్ సైతం కోల్పోయింది. కుసల్ మెండిస్ రూపంలో శ్రీలంకకు భారీ దెబ్బ పడింది.

  • 06 Sep 2022 10:40 PM (IST)

    మూడో వికెట్ గాన్‌..

    టీమిండియా నెమ్మదిగా మ్యాచ్‌ను గ్రిప్‌లోకి తీసుకుంటోంది. ఈ క్రమంలోనే మూడో వికెట్‌ను పడగొట్టింది. అశ్విన్‌ స్పిన్‌ మ్యాజిక్‌తో దనుష్క గుణతిలక పెవిలియన్‌ అవుట్‌ అయ్యాడు. భారీ షాట్‌కు ప్రయత్నించి రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం శ్రీలంక విజయానికి ఇంకా 37 బంతుల్లో 64 పరుగులు చేయాల్సి ఉంది.

  • 06 Sep 2022 10:30 PM (IST)

    టీమిండియాకు టర్నింగ్ పాయింట్‌..

    శ్రీలంక వరుసగా రెండో వికెట్ కోల్పోయింది. చరిత్ అసలంక పెవిలియన్‌ బాట పట్టాడు. చాహల్‌ బౌలింగ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు.

  • 06 Sep 2022 10:27 PM (IST)

    ఎట్టకేలకు తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక..

    టీమిండియా బౌలర్ల కృషి ఫలించింది, శ్రీలంక ఎట్టకేలకు తొలి వికెట్‌ను కోల్పోయింది. పాతుమ్ నిస్సాంక (52) అవుట్‌ అయ్యాడు. చాహల్‌ బౌలింగ్‌లో రోహిత్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ బాటపట్టాడు.

  • 06 Sep 2022 10:21 PM (IST)

    వికెట్‌ కీలకం..

    శ్రీలంక ఓపెనర్లు చెలరేగి ఆడుతున్నారు. టీమిండియా ఇచ్చిన 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక ప్లేయర్స్‌కు మంచి ఆరంభం లభించింది. ఒక్క వికెట్ కూడా నష్ట పోకుండా 89 పరగులు సాధించింది. ప్రస్తుతం శ్రీలంక విజయానికి 60 బంతుల్లో 85 పరుగులు చేయాల్సి ఉంది. అయితే టీమిండియా చేతుల్లోకి మ్యాచ్‌ రావాలంటే కచ్చితంగా వికెట్‌ కావాల్సి ఉంది.

  • 06 Sep 2022 10:18 PM (IST)

    నిస్సాంక హాఫ్ సెంచరీ పూర్తి..

    శ్రీలంక ఓపెనర్ నిస్సాకం కేవలం 33 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి, భారత బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటున్నాడు. అలాగే మరోవైపు మెండీస్ కూడా తనదైన ఆటతో 39 పరుగులతో ఆడుతున్నాడు. దీంతో 10 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 89 పరుగులు సాధించింది.

  • 06 Sep 2022 10:12 PM (IST)

    8 ఓవర్లకు లంక స్కోర్ 74/0

    8 ఓవర్లు పూర్తయ్యే సరికి శ్రీలంక టీం వికెట్ నష్టపోకుండా 74 పరుగులు పూర్తి చేసింది. నిస్సాంక 39, కుశాల్ 35 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇద్దరి మధ్య 74 పరుగుల భాగస్వామ్యం కూడా ఏర్పడింది. మరోవైపు వికెట్ల కోసం టీమిండియా బౌలర్లు ఎంతగానో కష్టపడుతున్నారు.

  • 06 Sep 2022 09:59 PM (IST)

    5 ఓవర్లకు లంక స్కోర్ 45/0

    5 ఓవర్లు పూర్తయ్యే సరికి శ్రీలంక టీం వికెట్ నష్టపోకుండా 45 పరుగులు పూర్తి చేసింది. నిస్సాంక 28, కుశాల్ 17 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 06 Sep 2022 09:29 PM (IST)

    లంక టార్గెట్ 174

    తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యే సరికి 8 వికెట్లు కోల్పొయి 173 పరుగులు సాధించింది. దీంతో శ్రీలంక ముందు 174 పరుగుల టార్గెట్ ను ఉంచింది.

  • 06 Sep 2022 09:18 PM (IST)

    పవిలియన్ చేరిన పంత్..

    రిషబ్ పంత్ 17 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియా 158 పరుగుల వద్ద భారీ షాట్ ఆడబోయి వికెట్ కోల్పోయాడు. దీంతో టీమిండియా భారీ స్కోర్ చేయడంలో విఫలమైంది.

  • 06 Sep 2022 09:16 PM (IST)

    ఆరో వికెట్ డౌన్..

    టీమిండిమా దీపక్ హుడా (3) రూపంలో ఆరో వికెట్ ను కోల్పోయింది. దీంతో 157 పరుగుల వద్ద దీపక్ పెవిలియన్ చేరాడు.

  • 06 Sep 2022 09:08 PM (IST)

    ఐదో వికెట్ డౌన్..

    టీమిండియా హార్దిక్ 17 పరుగులు(13 బంతులు, 1 సిక్స్) రూపంలో ఐదో వికెట్ ను కోల్పోయింది. దీంతో 149 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది.

  • 06 Sep 2022 08:44 PM (IST)

    హాఫ్ సెంచరీ హీరో రోహిత్ ఔట్..

    టీమిండియా సారధి రోహిత్ శర్మ 72 పరుగులు(41 బంతులు, 5 ఫోర్లు, 4సిక్సులు) పూర్తి చేశాక, ఓ భారీ షాట్ ఆడబోయి మూడో వికెట్ గా పెవిలియన్ చేరుకున్నాడు. దీంతో 110 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ ను కోల్పోయింది.

  • 06 Sep 2022 08:28 PM (IST)

    హిట్ మ్యాన్ హాఫ్ సెంచరీ..

    రోహిత్ శర్మ కేవలం 32 బంతుల్లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇందులో 4 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. మొత్తంగా 10 ఓవర్లు పూర్తయ్యే సరికి టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 79 పరుగులు పూర్తి చేసింది. వీరిద్దరి మధ్య కేవలం 43 బంతుల్లో 66 పరుగుల భాగస్వామ్యం నెలకొంది.

  • 06 Sep 2022 08:10 PM (IST)

    పవర్ ప్లేలో టీమిండియా 44/2

    6 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది. రోహిత్ 29, సూర్య 6 పరుగులతో క్రీజులో నిలిచారు.

  • 06 Sep 2022 07:53 PM (IST)

    IND vs SL T20 Live: విరాాట్ కోహ్లీ ఔట్..

    టీమిండియాకు వరుసగా ఎదురుదెబ్బలు తలుగుతున్నాయి. మొదట కేఎల్ రాహుల్(6), ఇప్పుడు విరాట్(0) వికెట్లను వెంట వెంటనే కోల్పోయింది. దీంతో టీమిండియా కష్టాల్లో కూరుకపోయింది. 13 పరుగుల వద్ద రెండు వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది.

  • 06 Sep 2022 07:47 PM (IST)

    IND vs SL T20 Live: తొలి వికెట్ డౌన్..

    ఆదిలోనే టీమిండియా తొలి వికెట్ ను కోల్పోయింది. కేఎల్ రాహుల్ (6) రూపంలో తొలి దెబ్బ తగిలింది. దీంతో టీమిండియా 11 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ పెవిలియన్ చేరాడు.

  • 06 Sep 2022 07:36 PM (IST)

    IND vs SL T20 Live: బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియా..

    కీలక మ్యాచ్ లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేస్తోంది. ఈ క్రమంలో ఓపెనర్లుగా రోహిత్, కేఎల్ రాహుల్ బరిలోకి దిగారు.

  • 06 Sep 2022 07:06 PM (IST)

    IND vs SL T20 Live: భారత్ ప్లేయింగ్ ఎలెవన్..

    భారత్ (ప్లేయింగ్ XI): KL రాహుల్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(కీపర్), దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్

  • 06 Sep 2022 07:05 PM (IST)

    IND vs SL T20 Live: శ్రీలంక ప్లేయింగ్ ఎలెవన్..

    శ్రీలంక (ప్లేయింగ్ XI): పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(కీపర్), చరిత్ అసలంక, దనుష్క గుణతిలక, భానుక రాజపక్స, దసున్ షనక(కెప్టెన్), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, అసిత ఫెర్నాండో, దిల్షన్ మధుశంక

  • 06 Sep 2022 07:02 PM (IST)

    IND vs SL T20 Live: టాస్ గెలిచిన శ్రీలంక

    కీలక మ్యాచ్ లో శ్రీలంక టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది.