India vs Sri Lanka T20 Series: భారత్-శ్రీలంక టీ20 సిరీస్‌లో మూడో, నిర్ణయాత్మక మ్యాచ్ రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియంలో ఈరోజు సాయంత్రం 7:00 గంటల నుంచి జరగనుంది. ఈ మ్యాచ్ ఫలితం సిరీస్ ఫలితాన్ని నిర్ణయిస్తుంది. ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమమైంది. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా తొలిసారి శ్రీలంక చేతిలో స్వదేశంలో సిరీస్ కోల్పోయే ప్రమాదంలో పడింది. 4 సంవత్సరాల క్రితం 2019లో స్వదేశంలో భారత్ ద్వైపాక్షిక సిరీస్‌ను కోల్పోయింది. ఆస్ట్రేలియా చేతిలో 2-0 తేడాతో ఓడింది. అప్పటి నుంచి భారత్ స్వదేశంలో వరుసగా 11 సిరీస్‌లను గెలుచుకుంది.
ఈ మ్యాచ్‌లో భారత జట్టు గెలిస్తే శ్రీలంకతో వరుసగా 5వ టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. హార్దిక్ సారథ్యంలోని భారత జట్టు ఓడిపోతే తొలిసారి సిరీస్‌ను చేజార్చుకుంది. భారత్‌లో ఇరు జట్లు ఇప్పటి వరకు ఐదు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడాయి. భారత్ 4 గెలిచింది. ఒక సిరీస్‌లో ఇరు జట్లు సమానంగా నిలిచాయి.
టీమిండియా రెండో మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ, రాజ్‌కోట్ మైదానం రికార్డు భారత్‌కు అనుకూలంగా ఉంది. గత 6 ఏళ్లుగా ఈ గడ్డపై భారత జట్టు ఓడిపోలేదు. ఇక్కడ మొత్తం 4 మ్యాచ్‌లు ఆడిన భారత్.. ఇందులో ముడు మ్యాచ్‌ల్లో గెలుపొందగా, ఒక దాంట్లో ఓడిపోయింది. 2017లో న్యూజిలాండ్‌తో భారత్ 40 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ఈ మైదానంలో భారత్-శ్రీలంక మధ్య తొలి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ జరుగుతోంది. ఇరు జట్లు ఇక్కడ వన్డే మ్యాచ్‌లు ఆడాయి.
భారత్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, శివమ్ మావి, యుజ్వేంద్ర చాహల్, ఉమ్రాన్ మాలిక్.
శ్రీలంక: దసున్ షనక (కెప్టెన్), కుసల్ మెండిస్ (కీపర్), పాతుమ్ నిస్సంక, చరిత్ అస్లంక, భానుక రాజపక్స/సదీర సమరవిక్రమ, ధనంజయ్ డి సిల్వా, వనిందు హసరంగ, చమిక కరుణరత్నే, కసున్ రజిత, దిల్షన్ మదుశంక, మహిష్ తీక్షణ.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..