
టీమిండియా నాయకత్వంలో మరోసారి ఊహించని మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. శుభ్‌మాన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ వంటి కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా దూరమవడంతో సౌతాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. ఈ సిరీస్‌ల కోసం జట్టును ఆదివారం ప్రకటించే అవకాశం ఉంది. మూడు వన్డేల సిరీస్‌కు ప్రస్తుత కెప్టెన్ గిల్ దూరం కానున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్ట్ 2వ రోజున గిల్ మెడకు గాయమైంది. అలాగే భారత వన్డే వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో గాయపడ్డాడు.
గిల్, అయ్యర్ అందుబాటులో లేకపోవడంతో సౌతాఫ్రికాతో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు భారత సెలెక్టర్లు రోహిత్ శర్మ వైపు చూస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డే కెప్టెన్సీ నుండి రోహిత్‌ను తొలగించడం జరిగింది. అయితే గిల్, అయ్యర్ గాయాల కారణంగా సెలెక్టర్లు మళ్లీ అతడికే జట్టు పగ్గాలు అప్పగించాలని యోచిస్తున్నారు. ఒకవేళ రోహిత్ అందుబాటులో లేకపోవడం లేదా వద్దు అనుకుంటే కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, అక్షర్ పటేల్ వంటి వారికి కెప్ట్ అవకాశం దక్కనుంది. మరోవైపు హార్దిక్ పాండ్యా కూడా ఇంకా పూర్తిగా కోలుకోలేడని తెలుస్తోంది. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా వన్డేకు దూరమయ్యే అవకాశం ఉంది.
శుభ్‌మాన్ గిల్ మెడ గాయం కారణంగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు కూడా దూరమయ్యే అవకాశం ఉంది. గిల్ పూర్తిగా కోలుకోకపోతే యశస్వి జైస్వాల్, భారత కెప్టెన్‌గా ఎంపిక కానున్నారు. అలాగే ఇటీవల దక్షిణాఫ్రికా A తో జరిగిన అనధికారిక వన్డేలలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్‌ను బ్యాకప్ ఓపెనర్‌గా జట్టులోకి చేర్చాలని సెలక్టర్లు భావిస్తున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..