IND vs SA: మళ్లీ విఫలమైన పుజారా రహానె.. వారికిదే చివరి ఛాన్స్ అన్న గవాస్కర్..

| Edited By: Ravi Kiran

Jan 04, 2022 | 7:38 AM

ఛతేశ్వర్ పుజారా, అజింక్యా రహానె ఒకప్పుడు టెస్ట్ క్రికెట్‌లో టీమ్ ఇండియాకు బలమైన ఆటగాళ్లుగా ఉన్నారు. కానీ..

IND vs SA: మళ్లీ విఫలమైన పుజారా రహానె.. వారికిదే చివరి ఛాన్స్ అన్న గవాస్కర్..
Pujara, Rahane
Follow us on

ఛతేశ్వర్ పుజారా, అజింక్యా రహానె ఒకప్పుడు టెస్ట్ క్రికెట్‌లో టీమ్ ఇండియాకు బలమైన ఆటగాళ్లుగా ఉన్నారు. కానీ వాళ్లు ఇప్పుడు ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నారు. వారు గత రెండేళ్లుగా అత్యంత పేలవమైన ఫామ్‌లో కొనసాగుతున్న పుజారా, రహానేల ఫ్లాప్ షో దక్షిణాఫ్రికాలో కూడా కొనసాగుతోంది. వారు ఫామ్‎లో లేకున్నా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ తొలి టెస్టులో సెంచూరియన్ టెస్టులో ఇద్దరికీ అవకాశం కల్పించాడు. పుజారా, రహానే ఇద్దరూ బ్యాట్‌తో పెద్దగా రాణించలేదు. అయినప్పటికీ జోహన్నెస్‌బర్గ్ టెస్ట్‌లో వారిద్దరికీ అవకాశం ఇచ్చారు. కానీ పుజారా-రహానే మళ్లీ విఫలమయ్యారు.

జోహన్నెస్‌బర్గ్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పుజారా 3 పరుగులకే ఔటయ్యాడు. అదే సమయంలో అజింక్య రహానె తొలి బంతికే పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో జట్టులో వీరిద్దరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీనిపై మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఈ ప్రశ్నకు సైగలలో సమాధానమిచ్చాడు. ఇప్పుడు ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్‌లను ప్రయత్నించే అవకాశం వచ్చిందని సునీల్ గవాస్కర్ అన్నాడు.

“ఈ రెండు వికెట్ల తర్వాత, పుజారా-రహానే తన టెస్ట్ కెరీర్‌ను కాపాడుకోవడానికి బహుశా తదుపరి ఇన్నింగ్స్‌లు చివరి అవకాశం అని చెప్పవచ్చు. వీరిద్దరి టెస్ట్ టీమ్‌లో ప్లేస్‌పై ఇప్పటికే క్వశ్చన్ మార్కులు ఉన్నాయి, ఇప్పుడు ఈ ఫ్లాప్ షో తర్వాత, వారికి చివరి అవకాశం మాత్రమే మిగిలి ఉందని తెలుస్తోంది.” అని గవాస్కర్ అన్నాడు.

2020-21 సీజన్‌లోనే రహానే గణాంకాలు చాలా దారుణంగా ఉన్నాయి. 2020-21లో, రహానే 8 టెస్టుల్లో 29.23 సగటుతో 380 పరుగులు చేశాడు. 2021లో, రహానే 5 టెస్టుల్లో కేవలం 19.22 సగటుతో 173 పరుగులు చేశాడు. ఇప్పుడు ప్రస్తుత సీజన్‌లో రహానే 21.40 సగటుతో 107 పరుగులు చేశాడు.

2020-21 సీజన్‌లో పుజారా బ్యాటింగ్ సగటు 28.85గా ఉంది. 2021లో, పుజారా 27.77 సగటుతో స్కోర్ చేశాడు మరియు ఇప్పుడు అతను 4 టెస్టుల్లో 7 ఇన్నింగ్స్‌లలో సగటు 16.28 మాత్రమే. ఇలాంటి గణాంకాల తర్వాత రహానే-పుజారా జట్టులో నిలవడం నిజంగా కష్టమే. జట్టులో శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, ప్రియాంక్ పంచల్ వంటి బ్యాట్స్‌మెన్ ఉన్నారు, వారి ఫామ్ బాగుంది. మూడో టెస్టులో పుజారా, రహానేలలో ఒకరు బయట కూర్చునే అవకాశం ఉంది.

Read Also.. IND vs SA: తొలిరోజు ముగిసిన ఆట.. సౌతాఫ్రికా ఒక వికెట్ నష్టానికి 35 పరుగులు..