India Vs South Africa 2021: భారత్‌తో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు ముందు దక్షిణాఫ్రికాకు బ్యాడ్ న్యూస్ ఎదురైంది. ఫాస్ట్ బౌలర్ ఎన్రిక్ నార్కియా టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. గాయాలతో భారత్, దక్షిణాఫ్రికా సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని క్రికెట్ సౌతాఫ్రికా ట్వీట్ ద్వారా తెలియజేసింది. చాలా కాలంగా కొనసాగుతున్న గాయం కారణంగా ఎన్రిక్ నార్కియా మూడు టెస్టుల సిరీస్‌లో ఆడలేడని పేర్కొంది. అతని స్థానంలో మరో ప్లేయర్‌ని తీసుకోలేదు. నిపుణుల నుంచి సలహాలు తీసుకుంటూ రికవరీపై దృష్టి సారించాలని చూస్తున్నాడు. డిసెంబర్ 26న భారత్-దక్షిణాఫ్రికా మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.
నార్కియా తప్పుకోవడంతో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలింగ్ ధాటికి గట్టి దెబ్బ తగలనుంది. అతను గత కొంతకాలంగా జట్టులోని ప్రధాన ఆటగాళ్లలో ఒకడు. కగిసో రబడా, లుంగీ ఎన్‌గిడితో కలిసి ప్రోటీస్ జట్టు పేస్ అటాక్‌ను ధీటుగా ఎదుర్కొన్నాడు. గంటకు 150 కిలోమీటర్లకు పైగా బంతిని నిలకడగా విసిరే సామర్థ్యం నార్కియాకు ఉంది. దీంతో భారత బ్యాట్స్‌మెన్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికాలో బౌన్సీ బంతుల ముందు బోల్తా కొట్టిన చరిత్ర భారత్‌కు ఉంది. నార్కియా ఇప్పటి వరకు 12 టెస్టులు, 12 వన్డేలు, 16 టీ20లు ఆడాడు.
నార్కియా టెస్టు కెరీర్..
2021లో నార్కియా మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది ఐదు టెస్టుల్లో 20.76 సగటుతో 25 వికెట్లు తీశాడు. ఈ సమయంలో అతని స్ట్రైక్ రేట్ 37.6గా ఉంది. అతను రెండుసార్లు ఐదు వికెట్లు తీసుకున్నాడు. 56 పరుగులకు ఆరు వికెట్లు అతని అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. 28 ఏళ్ల ఈ ఆటగాడు ఇప్పటివరకు 12 టెస్టులు ఆడాడు. ఇందులో 47 వికెట్లు తీశాడు. 2019లో భారత్‌తో పూణె టెస్టులో అరంగేట్రం చేశాడు. అతను ఇప్పటివరకు దక్షిణాఫ్రికాలో భారత్‌తో ఏ టెస్టు ఆడలేదు. ప్రస్తుత సిరీస్‌లో ఆడాల్సి వస్తే అతడి ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి.
నార్కియా ఇటీవల ఐపీఎల్ 2021లో ఆడిన సంగతి తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్‌లో భాగంగా ఉన్నాడు. ఈ జట్టు తరపున అద్భుతంగా రాణించాడు. దీంతో ఐపీఎల్ 2022కి ముందు ఢిల్లీ అతడిని రిటైన్ చేసుకుంది.
#Proteas Squad update ?
Anrich Nortje has been ruled out of the 3-match #BetwayTestSeries due to a persistent injury ?
No replacement will be brought in#SAvIND #FreedomSeries #BePartOfIt pic.twitter.com/5R8gnwdcpF
— Cricket South Africa (@OfficialCSA) December 21, 2021