IND vs SCO Highlights, T20 World Cup 2021: 8 వికెట్ల తేడాతో కోహ్లీసేన ఘన విజయం.. ఇక ఆశలన్నీ కివీస్, ఆఫ్ఘన్ మ్యాచ్‌పైనే..!

|

Nov 05, 2021 | 10:10 PM

IND vs SSCO Highlights in Telugu: స్కాట్లాండ్ టీం విధించిన టార్గెట్‌ను కేవలం 6.3 ఓవర్లలో సాధించి ఘన విజయం అందుకుంది.

IND vs SCO Highlights, T20 World Cup 2021: 8 వికెట్ల తేడాతో కోహ్లీసేన ఘన విజయం.. ఇక ఆశలన్నీ కివీస్, ఆఫ్ఘన్ మ్యాచ్‌పైనే..!
T20 World Cup 2021, Ind Vs Sco

IND vs SCO Highlights, T20 World Cup 2021: స్కాట్లాండ్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 85 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో కోహ్లీసేన ముందు 86 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. దీంతో ఛేజింగ్ చేసిన భారత్ కేవలం 6.3 ఓవర్లలో టార్గెట్‌ను పూర్తి చేసింది. సూపర్ 12లో గ్రూపు2 డబుల్ హెడర్ మ్యాచుల్లో భాగంగా రెండో గేమ్‌లో భారత్ వర్సెస్ స్కాట్లాండ్ టీంలు తలపడుతున్నాయి. అయితే కీలక మ్యాచులో భారీ విజయం సాధించాల్సిన మ్యాచులో టాస్ గెలిచిన భారత్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో స్కాట్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. స్కాట్లాండ్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 85 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో కోహ్లీసేన ముందు 86 పరుగుల లక్ష్యం ఉంది.

టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు చేరే అవకాశాలను ఏదో విధంగా కాపాడుకుంటూ వస్తున్న టీమ్‌ ఇండియాకు శుక్రవారం చాలా ముఖ్యమైన రోజు. సూపర్ 12లో గ్రూపు2 డబుల్ హెడర్ మ్యాచుల్లో భాగంగా రెండో గేమ్‌లో భారత్ వర్సెస్ స్కాట్లాండ్ టీంలు తలపడనున్నాయి. సెమీఫైనల్‌లో ఇతర జట్ల ప్రదర్శనపైనే ఆధారపడిన కోహ్లీ సేన ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలుపొందాలనే ఉద్దేశంతో స్కాట్లాండ్‌తో మ్యాచ్‌కు సిద్ధమైంది. అఫ్గానిస్థాన్‌పై 66 పరుగుల తేడాతో విజయం సాధించిన తర్వాత ఆ జోరును కొనసాగించడంపైనే భారత్ దృష్టి సారించింది. భారత్ విజయాన్ని నమోదు చేసుకోవడమే కాకుండా రన్ రేట్‌ను మెరుగుపరుచుకోవడానికి భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది.

పిచ్: టాస్ మరోసారి కీలక పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉంది. దుబాయ్ పిచ్ ఎక్కువగా ఛేజింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది.

ప్లేయింగ్ XI :

స్కాట్లాండ్ (ప్లేయింగ్ XI): జార్జ్ మున్సే, కైల్ కోయెట్జర్(కెప్టెన్), మాథ్యూ క్రాస్(కీపర్), రిచీ బెరింగ్టన్, కాలమ్ మాక్లియోడ్, మైకేల్ లీస్క్, క్రిస్ గ్రీవ్స్, మార్క్ వాట్, సఫ్యాన్ షరీఫ్, అలస్డైర్ ఎవాన్స్, బ్రాడ్లీ వీల్

భారత్ (ప్లేయింగ్ XI): కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 05 Nov 2021 09:54 PM (IST)

    టీమిండియా ఘన విజయం

    స్కాట్లాండ్ టీం విధించిన టార్గెట్‌ను కేవలం 6.3 ఓవర్లలో సాధించి ఘన విజయం అందుకుంది.

  • 05 Nov 2021 09:47 PM (IST)

    6 ఓవర్లకు 82/2

    6 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 82 పరుగులు సాధించింది. క్రీజులో కోహ్లీ 1, సూర్య కుమార్ యాదవ్ 0 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. 6వ ఓవర్‌లో మొత్తం 12 పరుగులు వచ్చాయి.


  • 05 Nov 2021 09:42 PM (IST)

    5 ఓవర్లకు 70/1

    5 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా ఒక వికెట్ కోల్పోయి 70 పరుగులు సాధించింది. క్రీజులో కేఎల్ రాహుల్ 39, కోహ్లీ 0 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. 5వ ఓవర్‌లో మొత్తం 17 పరుగులు వచ్చాయి. ఇప్పటి వరకు 10 ఫోర్లు, 2 సిక్సులు వచ్చాయి.

  • 05 Nov 2021 09:35 PM (IST)

    4 ఓవర్లకు 53/0

    4 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 53 పరుగులు సాధించింది. క్రీజులో రోహిత్ 26, కేఎల్ రాహుల్ 26 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. 4వ ఓవర్‌లో మొత్తం 14 పరుగులు వచ్చాయి. ఇప్పటి వరకు 8 ఫోర్లు, 2 సిక్సులు వచ్చాయి.

  • 05 Nov 2021 09:29 PM (IST)

    మూడు ఓవర్లకు 39/0

    మూడు ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 39 పరుగులు సాధించింది. క్రీజులో రోహిత్ 12, కేఎల్ రాహుల్ 26 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. రెండో ఓవర్‌లో మొత్తం 16 పరుగులు వచ్చాయి.

  • 05 Nov 2021 09:24 PM (IST)

    రెండు ఓవర్లకు 23/0

    రెండు ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 23 పరుగులు సాధించింది. క్రీజులో రోహిత్ 7, కేఎల్ రాహుల్ 15 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. రెండో ఓవర్‌లో మొత్తం 15 పరుగులు వచ్చాయి.

  • 05 Nov 2021 09:18 PM (IST)

    తొలి ఓవర్‌కు 8/0

    తొలి ఓవర్ ముగిసే సరికి టీమిండియా 8 పరుగులు సాధించింది. క్రీజులో రోహిత్ 6, కేఎల్ రాహుల్ 2 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 05 Nov 2021 09:08 PM (IST)

    భారత్ ఛేజ్ సమీకరణాలు:

    నెట్ రన్ రేట్ +1.000కి చేరుకోవాలంటే 11.2 ఓవర్లలో ఛేజ్ చేయాలి.

    న్యూజిలాండ్ నెట్ రన్ రేట్‌ను దాటాలంటే మాత్రం 8.5 ఓవర్లలో ఛేజ్ చేయాలి.

    ఆఫ్ఘనిస్తాన్ నెట్ రన్ రేట్ దాటాలంటే మాత్రం 7.1 ఓవర్లలో ఛేజ్ చేయాలి.

  • 05 Nov 2021 09:06 PM (IST)

    కోహ్లసేన టార్గెట్ 86

    స్కాట్లాండ్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 85 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో కోహ్లీసేన ముందు 86 పరుగుల లక్ష్యం ఉంది.

  • 05 Nov 2021 08:50 PM (IST)

    తొమ్మిదో వికెట్ డౌన్

    స్కాట్లాండ్ టీం 81 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్‌ను కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో ఇవాన్స్ (0) బౌల్డ్ అయ్యాడు. దీంతో వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లను కోల్పోయింది.

  • 05 Nov 2021 08:49 PM (IST)

    ఎనిమిదో వికెట్ డౌన్

    స్కాట్లాండ్ టీం 81 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్‌ను కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో షరీఫ్ షామీ (0)ని కిషన్ రనౌట్ చేశాడు.

  • 05 Nov 2021 08:47 PM (IST)

    ఏడో వికెట్ డౌన్

    స్కాట్లాండ్ టీం 81 పరుగుల వద్ద ఏడో వికెట్‌ను కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో మెక్లియోడ్ (16) బౌల్డయ్యాడు.

  • 05 Nov 2021 08:40 PM (IST)

    15 ఓవర్లకు 70/6

    15 ఓవర్లకు స్కాట్లాండ్ టీం 6 వికెట్లు నష్టపోయి 70 పరుగులు సాధించింది. క్రీజులో కాలమ్ మాక్లియోడ్ 14, మార్క్ వాట్ 5 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 05 Nov 2021 08:36 PM (IST)

    ఆరో వికెట్ డౌన్

    స్కాట్లాండ్ టీం 63 పరుగుల వద్ద ఆరో వికెట్‌ను కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్‌లో క్రిస్ గ్రీవ్స్(1) హార్దిక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

  • 05 Nov 2021 08:33 PM (IST)

    స్పిన్‌కు వ్యతిరేకంగా 14 వికెట్లు కోల్పోయిన స్కాట్లాండ్

    స్కాట్లాండ్ సూపర్ 12 దశలో స్పిన్‌కు వ్యతిరేకంగా 14 వికెట్లు కోల్పోయింది. ఒక జట్టుకు ఇదే అత్యధికం. మొత్తం 14 మంది బౌల్డ్ లేదా ఎల్‌బీడబ్ల్యూ అయ్యారు.

  • 05 Nov 2021 08:25 PM (IST)

    ఐదో వికెట్ డౌన్

    స్కాట్లాండ్ టీం 58 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో లీస్క్(21 పరుగులు, 12 బంతులు, 2 ఫోర్లు, 1సిక్స్) ఎల్బీగా వెనుదిరిగాడు.

  • 05 Nov 2021 08:22 PM (IST)

    11 ఓవర్లకు 57/4

    11 ఓవర్లకు స్కాట్లాండ్ టీం 4 వికెట్లు నష్టపోయి 57 పరుగులు సాధించింది. క్రీజులో కాలమ్ మాక్లియోడ్ 8, మైఖేల్ లీస్క్ 21 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 05 Nov 2021 08:05 PM (IST)

    నాలుగో వికెట్ డౌన్

    స్కాట్లాండ్ టీం 29 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ను కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో మాథ్యూ క్రాస్ ఎల్బీగా వెనుదిరిగాడు.

  • 05 Nov 2021 08:02 PM (IST)

    మూడో వికెట్ డౌన్

    స్కాట్లాండ్ టీం 28 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో రిచీ బెరింగ్టన్ బౌల్డయ్యాడు.

  • 05 Nov 2021 07:58 PM (IST)

    T20 WC 2021లో స్కాట్లాండ్ ఓపెనర్ మున్సే బ్యాటింగ్

    29 v BAN
    15 v PNG
    20 v OMAN
    25 v AFG
    0 v NAM
    22 v NZ
    24 v IND

  • 05 Nov 2021 07:56 PM (IST)

    రెండో వికెట్ డౌన్

    స్కాట్లాండ్ టీం 27 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. షమీ వేసిన బంతిని మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించి మున్సీ.. హార్దిక్ పాండ్యా చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు.

  • 05 Nov 2021 07:50 PM (IST)

    4 ఓవర్లకు 25/1

    4 ఓవర్లకు స్కాట్లాండ్ టీం వికెట్ నష్టపోయి 25 పరుగులు సాధించింది. క్రీజులో జార్జ్ మున్సే 23, క్రాస్ 0 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. తొలి ఓవర్ వేసిన అశ్విన్ మొత్తం మూడు ఫోర్లతో 12 పరుగులు ఇచ్చాడు.

  • 05 Nov 2021 07:44 PM (IST)

    తొలి వికెట్ డౌన్

    స్కాట్లాండ్ టీం 13 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. బుమ్రా వేసిన బంతిని తప్పుగా అంచనా వేసిన కోయోట్టర్ బౌల్డయ్యాడు.

  • 05 Nov 2021 07:39 PM (IST)

    2 ఓవర్లకు 13/0

    రెండు ఓవర్లకు స్కాట్లాండ్ టీం వికెట్ నష్టపోకుండా 13 పరుగులు సాధించింది. క్రీజులో కైల్ కోయెట్జర్ 1, జార్జ్ మున్సే 11 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 05 Nov 2021 07:31 PM (IST)

    IND vs SCO Live: 50వ మ్యాచ్ ఆడుతోన్న జార్జ్ మున్సీ

    50వ టీ20 ఆడుతున్న జార్జ్ మున్సీకి స్కాట్లాండ్ ప్రత్యేక క్యాప్ అందజేసింది. అతని సహచరులందరూ చిరునవ్వులు చిందిస్తూ మున్సీకి అభినందనలు తెలిపారు.

  • 05 Nov 2021 07:25 PM (IST)

    IND vs SCO Live: భారత్ ముందున్న సమీకరణాలు

    స్కాట్లాండ్ స్కోరు 160 చేస్తే, భారత్ తమ నెట్ రన్ రేట్‌ను +1.000కి చేరుకోవడానికి 11.3 ఓవర్లలో ఛేదించాలి. అదే ఆఫ్ఘనిస్తాన్ నెట్ రన్ రేట్‌ను దాటాలంటే మాత్రం ఈ స్కోర్‌ను కేవలం 7.4 ఓవర్లలో ఛేజ్ చేయాలి.

  • 05 Nov 2021 07:22 PM (IST)

    IND vs SCO Live: ప్లేయింగ్ XI

    స్కాట్లాండ్ (ప్లేయింగ్ XI): జార్జ్ మున్సే, కైల్ కోయెట్జర్(కెప్టెన్), మాథ్యూ క్రాస్(కీపర్), రిచీ బెరింగ్టన్, కాలమ్ మాక్లియోడ్, మైకేల్ లీస్క్, క్రిస్ గ్రీవ్స్, మార్క్ వాట్, సఫ్యాన్ షరీఫ్, అలస్డైర్ ఎవాన్స్, బ్రాడ్లీ వీల్

    భారత్ (ప్లేయింగ్ XI): కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా

  • 05 Nov 2021 07:00 PM (IST)

    IND vs SCO LIVE: కివీస్ విజయంతో మారిన లెక్కలు

    న్యూజిలాండ్ వర్సెస్ నమీబియా మ్యాచులో కివీస్ విజయం సాధించడంతో.. టీమిండియా ముందు భారీ లక్ష్యాలు ఉన్నాయి. వాటిలో భారత్ ఆడబోయే రెండు మ్యాచుల్లో భారీ విజయం సాధించాల్సి ఉంటుంది. వీటితో పాటు న్యూజిలాండ్‌తో ఆడబోయే మ్యాచులో ఆఫ్ఘనిస్తాన్ టీం విజయం సాధించాల్సి ఉంటుంది. వీటిలో ఏది లెక్క తప్పినా.. కోహ్లీసేన ఇంటిదారి పట్టడం ఖాయం.

  • 05 Nov 2021 06:55 PM (IST)

    NZ vs NAM: న్యూజిలాండ్ ఘన విజయం

    న్యూజిలాండ్ వర్సెస్ నమీబియా టీంల మధ్య జరిగిన మ్యాచులో విలియమ్సన్ సేన 52 పరుగుల తేడాతో విజయం సాధిచింది. దీంతో మొత్తం 4 మ్యాచుల్లో 3 విజయాలు సాధించి 6 పాయింట్లతో సెమీ ఫైనల్ పోటీదారుల్లో రెండో స్థానంలో  నిలిచింది. దీంతో న్యూజిలాండ్ ప్రస్తుతం +1.277 రన్ రేట్‌తో నిలిచింది.

  • 05 Nov 2021 06:49 PM (IST)

    IND vs SCO Live: కీలక మ్యాచ్‌కు రంగం సిద్ధం

    20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు చేరే అవకాశాలను ఏదో విధంగా కాపాడుకుంటూ వస్తున్న టీమ్‌ ఇండియాకు శుక్రవారం చాలా ముఖ్యమైన రోజు. సూపర్ 12లో గ్రూపు2 డబుల్ హెడర్ మ్యాచుల్లో భాగంగా రెండో గేమ్‌లో భారత్ వర్సెస్ స్కాట్లాండ్ టీంలు తలపడనున్నాయి.

Follow us on