IND vs PAK: మరో భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు రంగం సిద్ధం! హ్యాండ్‌షేక్‌పై టీమిండియాకు బీసీసీఐ ఆదేశాలు..

మహిళా ప్రపంచ కప్ 2025లో భారత్, పాకిస్థాన్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. శ్రీలంకను ఓడించిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన పాక్‌పై గెలుపును లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య హ్యాండ్‌షేక్‌లు ఉండవని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది.

IND vs PAK: మరో భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు రంగం సిద్ధం! హ్యాండ్‌షేక్‌పై టీమిండియాకు బీసీసీఐ ఆదేశాలు..
Ind Vs Pak

Updated on: Oct 05, 2025 | 9:00 AM

ఇటీవలె ఆసియా కప్‌ 2025లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను ముచ్చటగా మూడు సార్లు టీమిండియా ఓడించిన విషయం తెలిసిందే. పురుషుల వంతు అయిపోయింది.. ఇక ఇప్పుడు మా వంతు అంటున్నార మహిళా క్రికెటర్లు. పాకిస్థాన్తో తలపేందుకు ఉమెన్ఇన్బ్లూ టీమ్సిద్ధమైంది. ఉమెన్స్వరల్డ్కప్‌ 2025లో భాగంగా రోజు(ఆదివారం) భారత్‌, పాకిస్థాన్మ్యాచ్జరగనుంది.

వరల్డ్కప్లో తొలి మ్యాచ్లో శ్రీలంకను ఓడించిన హర్మన్ప్రీత్కౌర్సేన.. ఇప్పుడు పాక్పని పట్టేందుకు రెడీ అయింది. ఎలాగైనా మ్యాచ్గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది. అయితే భారత్‌, పాక్ఆటగాళ్ల మధ్య ఆసియా కప్లో మాదిరిగానే ఇక్కడ కూడా హ్యాండ్షేక్లు జరగకపోవచ్చు. ఎందుకంటే.. విషయంలో బీసీసీఐ క్లియర్గా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. పాక్ఆటగాళ్లతో షేక్హ్యాండ్లు ఉండవని స్పష్టం చేసింది.

అయితే గతంలో భారత్‌, పాకిస్తాన్ ఆటగాళ్ళు మైదానంలో స్నేహపూర్వకంగా ఉండేవారు. అప్పటి పాకిస్తాన్ కెప్టెన్ బిస్మా మరూఫ్ తన ఆరు నెలల కుమార్తె ఫాతిమాతో ఆడుకుంటున్నప్పుడు భారత ఆటగాళ్ల బృందం చుట్టూ ఉన్న వీడియోను ఎవరు మర్చిపోగలరు? అయితే, రెండు జట్ల చుట్టూ ఉన్న పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆట ప్రారంభమైన తర్వాత మైదానంలో స్నేహపూర్వక లేదా స్నేహపూర్వక ప్రవర్తనను ఆశించలేం. ఏడాది ఏప్రిల్లో పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన సంఘటన కారణంగా భారత ఆటగాళ్ల పాక్ఆటగాళ్లతో షేక్హ్యాండ్చేయడం లేదు.

వరల్డ్కప్మ్యాచ్‌.. స్క్వాడ్‌లు:

భారత్: హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), స్మృతి మంధాన (విసి), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, యాస్తికా భాటియా, రేణుకా సింగ్ ఠాకూర్, దీప్తి శర్మ, స్నేహ రాణా, శ్రీ చరణి, రాధా యాదవ్, అమంజోత్ కౌర్, అరుంధతి రెడ్డి.

పాకిస్థాన్: ఫాతిమా సనా (సి), మునీబా అలీ సిద్ధిఖీ (విసి), అలియా రియాజ్, డయానా బేగ్, ఇమాన్ ఫాతిమా, నష్రా సుంధు, నటాలియా పర్వైజ్, ఒమైమా సొహైల్, రమీన్ షమీ, సదాఫ్ షమాస్, సాదియా ఇక్బాల్, షావాల్ జుల్ఫికర్, సిద్రా నజ్యోబ్, సిద్రాయా అమీన్, సిద్రాయా అమీన్. రిజర్వ్‌లు: గుల్ ఫిరోజా, నజిహా అల్వీ, తుబా హసన్, ఉమ్-ఎ-హని, వహీదా అక్తర్

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి