Video: మ్యాచ్‌ తర్వాత ఒమన్‌ క్రికెటర్లతో సూర్యకుమార్‌ యాదవ్‌ ఏం మాట్లాడాడో తెలుసా?

ఆసియా కప్ 2025లో భాగంగా జరిగిన భారత్-ఒమన్ మ్యాచ్ తర్వాత, సూర్యకుమార్ యాదవ్ ఒమన్ జట్టు ఆటగాళ్లతో మాట్లాడి వారి పోరాటాన్ని ప్రశంసించాడు. ఒమన్ కెప్టెన్ జతీందర్ సింగ్, సూర్యకుమార్ యాదవ్ టీ20 క్రికెట్ గురించి, మ్యాచ్ గురించి సూచనలు, ప్రశంసలు అందించాడని తెలిపాడు.

Video: మ్యాచ్‌ తర్వాత ఒమన్‌ క్రికెటర్లతో సూర్యకుమార్‌ యాదవ్‌ ఏం మాట్లాడాడో తెలుసా?
Surya With Oman Team

Updated on: Sep 20, 2025 | 6:58 PM

ఆసియా కప్‌ 2025లో భాగంగా శుక్రవారం ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ తర్వాత టీమిండియా కెప్టెన్‌ ఒమన్‌ జట్టు ఆటగాళ్లతో సరదాగా మాట్లాడాడు. సూర్య ఏదో చెబుతుంటే ఒమన్‌ జట్టు ఆటగాళ్లంతా చుట్టూ చేరి ఎంతో శ్రద్ధగా విన్నారు. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. అయితే ఇంతకీ ఒమన్‌ క్రికెటర్లతో సూర్య ఏం మాట్లాడాడు అని చాలా మంది క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.

అయితే ఒమన్ కెప్టెన్ జతీందర్ సింగ్, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తమ జట్టుతో ఏం మాట్లాడాడో వివరించాడు.
మ్యాచ్ తర్వాత ప్రెజెంటేషన్ ఇచ్చే ముందు సూర్యకుమార్ ఒమన్ జట్టుతో ఇంటరాక్ట్‌ అయ్యాడు. ఫలితంతో సంబంధం లేకుండా ఒమన్‌ చూపించిన పోరాట పటిమను సూర్య ప్రశంసించాడు. అయితే సూర్య సరదా చిట్‌చాట్‌పై ఒమన్‌ కెప్టెన్‌ స్పందిస్తూ.. “అతను(సూర్యకుమార్‌ యాదవ్‌) వచ్చి అబ్బాయిల(ఒమన్‌ క్రికెటర్లు)తో మాట్లాడినందుకు కృతజ్ఞతలు. అతను ఆట గురించి, టీ20 క్రికెట్‌ ఎలా ఆడాలి అనే దాని గురించి మాట్లాడాడు. అలాగే తమ జట్టును చాలా ప్రశంసిస్తున్నాడు. తమ ఆటగాళ్లు అడిగిన పలు ప్రశ్నలుకు సూర్య బదులిచ్చాడు” అని మ్యాచ్ తర్వాత విలేకరుల సమావేశంలో జతీందర్ తెలిపాడు.

ఇక శుక్రవారం ఒమన్‌ వర్సెస్‌ భారత్‌ మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. సంజు శాంసన్‌ హాఫ్‌ సెంచరీతో రాణించాడు. ఇక ఛేజింగ్‌కు దిగిన ఒమన్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసి 21 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అయితే ఒమన్‌ వంటి పసికూన జట్టు భారత్‌ లాంటి వరల్డ్‌ ఛాంపియన్‌ టీమ్‌పై 167 పరుగులు చేయడం క్రికెట్‌ అభిమానులను ఆకట్టుకుంది. ఒమన్‌ మ్యాచ్‌ ఓడినా హృదయాలు గెలుసుకుందని క్రికెట్‌ అభిమానులు పేర్కొన్నారు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి