IND vs NZ: చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో రోహిత్.. ఏ భారత బ్యాట్స్‌మెన్‌కు సాధ్యం కాలే.. ఆ రికార్డు ఏంటంటే?

|

Nov 19, 2021 | 2:47 PM

Rohit Sharma: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20 ఇంటర్నేషనల్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సిక్సర్ బాదితే..

IND vs NZ: చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో రోహిత్.. ఏ భారత బ్యాట్స్‌మెన్‌కు సాధ్యం కాలే.. ఆ రికార్డు ఏంటంటే?
Rohit Sharma
Follow us on

Rohit Sharma: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20 ఇంటర్నేషనల్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సిక్సర్ బాదితే.. అంతర్జాతీయ క్రికెట్‌లో 450 సిక్సర్లు పూర్తయినట్లే. ఈ ఘనత సాధించిన మూడో బ్యాట్స్‌మెన్‌గా రికార్డు నెలకొల్పనున్నాడు. అతని కంటే ముందు షాహిద్ అఫ్రిది, క్రిస్ గేల్ ఈ ఘనత సాధించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటి వరకు ఏ భారత ఆటగాడు 450 సిక్సర్లు కొట్టలేకపోయాడు.

అదే సమయంలో రోహిత్ బ్యాట్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఎనిమిది సిక్సర్లు బాదితే టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 150 సిక్సర్లు బాదినట్టే. ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలవనున్నాడు. అతని కంటే ముందు, మార్టిన్ గప్టిల్ మాత్రమే పొట్టి ఫార్మాట్‌లో 150 సిక్సర్లు కొట్టాడు.

చాహల్‌కు తొలి మ్యాచులో అవకాశం లభించలేదు. అయితే నేటి రెండో టీ20లో అవకాశం లభిస్తే మాత్రం ఓ రికార్డు నెలకొల్పే అవకాశం ఉంది. టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో యుజ్వేంద్ర చాహల్‌కు చోటు దక్కలేదు. ఈ ఆటగాడు మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ అవకాశం దక్కించుకుంటే ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకోవచ్చు.

కివీస్‌పై చాహల్ 4 వికెట్లు తీస్తే, టీ20 ఇంటర్నేషనల్స్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చాహల్ నిలవనున్నాడు. అదే సమయంలో మిగిలిన రెండు మ్యాచ్‌లలో 8 వికెట్లు సాధిస్తే టీ20 క్రికెట్‌లో (దేశీయ, అంతర్జాతీయ) 250 వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నివనున్నాడు.

Also Read: IND VS NZ: రెండో టీ20లో కీలక మార్పులు.. 30 బౌండరీలతో 142 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌కు అవకాశం.. సిరాజ్, రాహుల్‌కి రెస్ట్?

AB de Villiers: క్రికెట్‌ ఫ్యాన్స్‌కు షాక్‌.. అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన ఏబీ డివిలియర్స్‌..