IND Vs NZ, WTC Final 2021 Day 6th : ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ విజేతగా న్యూజిలాండ్

|

Jun 24, 2021 | 12:27 AM

India vs New Zealand Live Score: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌ ఛాంపియన్‌గా నిలిచింది. టీమిండియా  విసిరిన  139 పరుగుల టార్గెట్‌ను కేన్ మామ జట్టు 45.5 ఓవర్లలో ఛేదించింది.

IND Vs NZ, WTC Final 2021 Day 6th : ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ విజేతగా న్యూజిలాండ్
Kane Williamson And His Cha

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌ విజేతగా నిలిచింది. ఐసీసీ తొలిసారి నిర్వహిస్తున్న ఈ మెగా ట్రోఫీని కివీస్ జట్టు కైవసం చేసుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా విసిరిన 139 పరుగుల టార్గెట్‌ను ఆ జట్టు 45.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయినా కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (52/ 89 బంతుల్లో 8×4), రాస్‌టేలర్‌ (47/ 100 బంతుల్లో 6×4) బాధ్యతగా ఆడి కివీస్‌కు అపురూప విజయాన్ని అందించారు. అంతకుముందు కివీస్ ఓపెనర్లు టామ్‌ లాథమ్‌(9/41 బంతుల్లో), డెవాన్‌ కాన్వే(19/ 47 బంతుల్లో 4×4)ను అశ్విన్ ఔట్‌ చేసి టీమిండియాకు మంచి శుభారంభాన్ని ఇచ్చారు. దీంతో ఆ జట్టుపై ఒత్తిడి పెంచే అవకాశం దక్కినా టీమిండియా సరిగ్గా వినియోగించుకోలేక పోయింది. ఈ క్రమంలోనే ఓటమిపాలై ఐసీసీ ట్రోర్నోల్లో మరోసారి భంగపాటుకు గురైంది.

కాగా, టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 170 పరుగులకు ఆలౌటైంది. రిషభ్‌ పంత్‌(41/ 88 బంతుల్లో 4×4) పెద్ద నెంబర్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. కివీస్‌ పేసర్లు టిమ్‌సౌథీ 4/48, బౌల్ట్‌ 3/39 అద్భుతమైన బౌలింగ్‌తో టీమిండియా బ్యాటింగ్‌ ఆర్డర్‌ను కుప్పకూల్చారు. ఈ క్రమంలోనే తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 32 పరుగులు కలుపుకొని న్యూజిలాండ్‌ ఫైనల్ టార్గెట్ ఛేదించింది. అంతకుముందు 64/2 ఓవర్‌నైట్ స్కోరుతో ఆరోరోజు రిజర్వ్‌డే ఆట కొనసాగించిన కెప్టెన్‌ విరాట్‌ (13/ 29 బంతుల్లో), చెతేశ్వర్‌ పుజారా (15/ 80 బంతుల్లో 2×4) నిరాశపరిచారు. ఆట ప్రారంభమైన అరగంటకే ఒక్క పరుగు తేడాతో ఇద్దరూ పెవిలియన్‌ దారి పట్టారు. ఇక జేమీసన్‌ వరుస ఓవర్లలో వీరిని ఔట్‌చేశాడు.

ఆ తర్వాత రహానె (15/40 బంతుల్లో 1×4) సైతం పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. కాసేపు వికెట్‌ కాపాడుకునే ప్రయత్నం చేసినా చివరికి బౌల్ట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. లెగ్‌సైడ్‌ వెళ్లే బంతిని ఆడి వికెట్‌ సమర్పించుకున్నాడు. ఆపై పంత్‌, జడేజా(16/ 49 బంతుల్లో 2×4) జాగ్రత్తగా ఆడుతూ స్కోరు బోర్డును మెల్లిగా ముందుకు తీసుకెళ్లారు. వారిద్దరూ ఆరో వికెట్‌కు 33 పరుగులు జోడించారు. ఈ నేపథ్యంలోనే స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. తొలుత జడ్డూ వాగ్నర్‌ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్‌ ఇవ్వగా కాసేపటికే పంత్.. బౌల్ట్‌ బౌలింగ్‌లో నికోల్స్‌ చేతికి చిక్కాడు. అప్పటికి టీమ్‌ఇండియా స్కోర్‌ 156/7గా నమోదైంది. ఇక టెయిలెండర్లు అశ్విన్‌(7), షమి(13), బుమ్రా(0) కూడా పెద్దగా రాణించకపోవడంతో భారత్‌ 170 పరుగులకే పరిమితమైంది.

ఐసీసీ టోర్నమెంట్‌లో మరోసారి న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓడిపోయింది. కేన్ విలియమ్సన్ జట్టు 2019 సెమీ ఫైనల్స్‌లో ఓడిపోయిన తరువాత వరుసగా రెండోసారి టీమిండియాను ఓడించింది. 2003 ప్రపంచ కప్‌లో సూపర్ సిక్స్ మినహా ఇప్పటి వరకు ఐసిసి టోర్నమెంట్‌లో భారత్ ఒక్కసారి కూడా న్యూజిలాండ్‌ను ఓడించలేదు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 23 Jun 2021 11:31 PM (IST)

    స్టేడియంలో న్యూజిలాండ్ అభిమానుల సంబరాలు..

    సౌథాంప్టన్ స్టేడియం న్యూజిల్యాండ్ అభిమానుల సంబరాలతో సందడిగా మారింది. కివి క్రికెట్‌కు గొప్ప రోజు అని చెప్పవచ్చు.. అంతే కాదు ఈ అద్భుతమైన దృశ్యం కనిపించింది.

  • 23 Jun 2021 11:25 PM (IST)

    ఐసిసి టోర్నమెంట్‌లో భారత్ మళ్లీ న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది

    ఐసీసీ టోర్నమెంట్‌లో మరోసారి న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓడిపోయింది. కేన్ విలియమ్సన్ జట్టు 2019 సెమీ ఫైనల్స్‌లో ఓడిపోయిన తరువాత వరుసగా రెండోసారి టీమిండియాను ఓడించింది. 2003 ప్రపంచ కప్‌లో సూపర్ సిక్స్ మినహా ఇప్పటి వరకు ఐసిసి టోర్నమెంట్‌లో భారత్ ఒక్కసారి కూడా న్యూజిలాండ్‌ను ఓడించలేదు.

  • 23 Jun 2021 11:08 PM (IST)

    ఛాంపియన్‌‌గా కివీస్..

    ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌ ఛాంపియన్‌గా అవతరించింది. భారత్‌ నిర్దేశించిన 139 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 45.5 ఓవర్లలో ఛేదించింది. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌(52/89 బంతుల్లో 8×4), రాస్‌టేలర్‌(47/ 100 బంతుల్లో 6×4) చివరి వరకూ క్రీజులో నిలబడి జట్టును విజయతీరాలకు చేర్చారు.

  • 23 Jun 2021 10:44 PM (IST)

    విజయానికి మరింత చేరువలో..

    కివీస్ విజయానికి మరింత చేరువైంది. కేన్‌ విలియమ్సన్‌(32), రాస్‌టేలర్‌(38) నిలకడగా ఆడుతున్నారు. ఈ క్రమంలోనే 41 ఓవర్లలో ఆ జట్టు 111/2తో నిలిచింది. విజయానికి ఇంకా 28 పరుగుల దూరంలో కొనసాగుతోంది.

  • 23 Jun 2021 10:04 PM (IST)

    జడేజా మైడెన్ ఓవర్

    జడేజా టైట్ ఓవర్ వేశాడు. ఈసారి టేలర్‌పై ఎల్‌బిడబ్ల్యు అప్పీల్ ఉంది, కానీ అంపైర్ నాటౌట్ ఇవ్వలేదు. బంతి స్టంప్ రేఖకు వెలుపల ఉందని స్పష్టమైనందున భారత్ కూడా సమీక్ష తీసుకోలేదు.

    మైడెన్ ఓవర్, న్యూజిలాండ్ – 85/2

  • 23 Jun 2021 10:02 PM (IST)

    జడేజా బౌలింగ్‌…

    ఈ ఇన్నింగ్స్‌లో తొలిసారిగా జడేజా బౌలింగ్‌కు వచ్చాడు. అశ్విన్ చివర నుంచి ఎడమచేతి వాటం స్పిన్నర్ జడేజా.. . బ్యాట్స్ మెన్ ఇద్దరూ కుడిచేతి వాటం ఆటగాళ్లు. అశ్విన్ లాగా జడేజా కొంత ప్రభావం చూపగలడా అనేది చూడాలి. జడేజా టేలర్‌ను ఒక అందమైన బంతితో కొట్టాడు. పంత్ దాన్ని వికెట్ వెనుక నుండి వేగంగా స్టంప్ చేశాడు, కాని టేలర్ అప్పటికే క్రీజులో ఉన్నాడు. కాబట్టి ఇది ఒక్క థ్రిల్ మాత్రమే.

  • 23 Jun 2021 09:59 PM (IST)

    విలియమ్సన్ బౌండరీ

    విలియమ్సన్ గొప్ప ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఈసారి కివి కెప్టెన్ బ్యాక్ ఫుట్ మీదకు వెళ్లి జడేజా బంతికి 4 పరుగులు చేశాడు. ఈ ఓవర్ న్యూజిలాండ్‌కు కూడా బాగానే సాగింది.

  • 23 Jun 2021 09:48 PM (IST)

    వరుస ఫోర్లు.. విజయానికి ఇంకా 79 పరుగులు అవసరం

    కివీస్ ఆటగాళ్లు కొద్దిగా పుంజుకున్నారు. అశ్విన్‌ వేసిన 24వ ఓవర్‌లో రాస్‌టేలర్‌(8) రెండు ఫోర్లు కొట్టాడు. దాంతో ఈ ఓవర్‌లో 8 పరుగులొచ్చాయి. మరోవైపు విలియమ్సన్‌(13) పట్టుదలతో బ్యాటింగ్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే న్యూజిలాండ్‌ 24 ఓవర్లకు 60/2 స్కోర్‌తో నిలిచి విజయంవైపు వడివడిగా అడుగులేస్తోంది.

  • 23 Jun 2021 09:20 PM (IST)

    డ్రింక్స్‌ సమయానికి…

    మూడో సెషన్‌లో డ్రింక్స్‌ సమయానికి కివీస్‌ 22 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 46 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో విలియమ్సన్‌(8), రాస్‌టేలర్‌ ఉన్నారు. వీరిద్దరూ నిలకడగా ఆడుతూ వికెట్లు కాపాడుకుంటున్నారు. న్యూజిలాండ్‌ విజయానికి ఇంకా 31 ఓవర్లలో 93 పరుగులు చేయాలి.

  • 23 Jun 2021 09:01 PM (IST)

    కాన్వే ఔట్

    అశ్విన్ ఖాతాలో మరో వికెట్ పడింది. అశ్విన్ వేసిన బౌలింగ్‌లో కాన్వే ఔటయ్యాడు. డెవాన్‌ కాన్వే(19/ 47 బంతుల్లో 4×4) LBWగా వెనుదిరిగాడు. దాంతో న్యూజిలాండ్‌ 44 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. మరోవైపు విలియమ్సన్‌(6) పరుగులతో కొనసాగుతుండగా రాస్‌ టేలర్‌ క్రీజులోకి వచ్చాడు. 18 ఓవర్లకు కివీస్‌ 44/2తో నిలిచింది.

  • 23 Jun 2021 08:43 PM (IST)

    తొలి వికెట్ పడింది

    న్యూజిల్యాండ్ తొలి వికెట్ కోల్పోయింది. అశ్విన్‌ వేసిన 13.3 ఓవర్‌కు ఓపెనర్‌ టామ్‌ లాథమ్‌(9/ 41 బంతుల్లో) క్రీజు వదిలి ముందుకు రావడంతో పంత్‌ బంతిని అందుకొని స్టంపౌట్‌ చేశాడు. దాంతో న్యూజిలాండ్‌ 33 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. మరోవైపు కాన్వే(14) నిలకడగా ఆడుతున్నాడు.

  • 23 Jun 2021 08:33 PM (IST)

    మొదలైన ఆఖరి సెషన్‌

    ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ తుది అంకానికి చేరింది. రిజర్వ్‌డే రోజు ఆఖరి సెషన్‌ ప్రారంభమైంది. ఈరోజు ఇంకా 45 ఓవర్లు మిగిలి ఉండగా న్యూజిలాండ్‌ 120 పరుగులు సాధిస్తే విజయం సాధిస్తుంది. ప్రస్తుతం ఓపెనర్లు టామ్‌ లాథమ్‌(5), కాన్వే(9) జాగ్రత్తగా ఆడుతున్నారు. జట్టు స్కోర్‌ 19/0గా నమోదైంది.

  • 23 Jun 2021 08:05 PM (IST)

    139 పరుగుల టార్గెట్‌ ఛేదనలో.. టీ బ్రేక్‌ వరకు 19/0

    139 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన కివీస్  ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. ఎలాంటి దొందరాపాటు షాట్స్ కోసం ప్రయత్నించడం లేదు. అవసరమైనప్పుడే రన్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. టీ బ్రేక్‌ సమయానికి ఆ జట్టు వికెట్‌ కోల్పోకుండా 19 పరుగులు చేసింది. కాన్వే (9), లాథమ్‌ (5) క్రీజులో ఉన్నారు. న్యూజిలాండ్‌ విజయం సాధించాలంటే 45 ఓవర్లలో 120 పరుగులు చేయాల్సి ఉంటుంది.

  • 23 Jun 2021 07:16 PM (IST)

    మహ్మద్‌ షమి ఔట్

    టీమిండియా తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. మహ్మద్‌ షమి(13) ఔటయ్యాడు. సౌథీ వేసిన 72.2 ఓవర్‌కు భారీ షాట్‌ ఆడబోయి లాథమ్‌ చేతికి చిక్కాడు. దాంతో భారత్‌ 170 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. క్రీజులో ఇషాంత్‌, బుమ్రా ఉన్నారు.

  • 23 Jun 2021 07:14 PM (IST)

    కివీస్ టార్గెట్ 139 పరుగులు

    టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 170 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్  తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 32 పరుగులు కలుపుకొని లక్ష్యం 139 పరుగులుగా నమోదైంది.  రిషభ్‌ పంత్‌(41/ 88 బంతుల్లో 4×4) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. కివీస్‌ పేసర్లలో సౌథీ 4/48, బౌల్ట్‌ 3/39  మెరుగైన ప్రదర్శన చేశారు.

  • 23 Jun 2021 07:00 PM (IST)

    అశ్విన్ ఔట్

    అశ్విన్ పెవిలియన్ దారి పట్టడం ఇక టీమిండియా150 పరుగుల లీడ్ లభించదని అంతా ఫిక్స్ అయ్యారు.  పంత్ వికెట్ పడటంతో అశ్విన్  దిగాడు. బౌల్ట్ బంతిని ఆఫ్-స్టంప్ వెలుపల ఉంచడం ద్వారా అతనిని డ్రైవ్ కోసం ప్రలోభపెట్టాడు. అశ్విన్ కూడా తనను తాను ఆపలేకపోయాడు మరియు ఫస్ట్ స్లిప్‌లో స్ట్రెయిట్ క్యాచ్ ఇచ్చాడు.

  • 23 Jun 2021 06:53 PM (IST)

    పంత్ క్యాచౌట్

    టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. దూకుడుగా ఆడుతున్న రిషబ్ పంత్  పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. పంత్ చాలాసేపు ఓపికగా ఆడుతున్నాడు.  ట్రెంట్ బౌల్ట్‌ బౌలింగ్‌ కూడా భారీ షాట్లు ఆడాడు. కానీ బంతి భారీ షాట్ కోసం ప్రయత్నించి  పాయింట్ ఫీల్డర్ హెన్రీ నికోల్స్ వెనుకకు పరిగెడుతు అద్భుతమైన క్యాచ్ పట్టుకున్నాడు. 

  • 23 Jun 2021 06:44 PM (IST)

    150 క్రాస్…

    టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 150 పరుగులు దాటింది. రిషభ్‌ పంత్(39), అశ్విన్‌(7) క్రీజులో కొనసాగుతున్నారు. మరోవైపు కివీస్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తూ ఇబ్బందులు పేట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే వాగ్నర్‌ వేసిన 67వ ఓవర్‌లో ఏడు పరుగులు సాధించి జట్టు స్కోరును 153/6కి తీసుకెళ్లారు. ఎలాగైన పరుగుల కంటే సమయాన్ని డ్రాగ్ చేయాలే ప్లాన్‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది.

  • 23 Jun 2021 06:21 PM (IST)

    రవీంద్ర జడేజా ఔట్

    నీల్ వాగ్నెర్ మరో దెబ్బ కొట్టాడు. లంచ్ విరామం తర్వాత ఆరో వికెట్ పడింది. రవీంద్ర జడేజా ఔటయ్యాడు. చాలా సేపు ఓపికతో ఆడిన జడేజా(16/49 బంతుల్లో 2×4) చివరికి వాగ్నర్‌ బౌలింగ్‌లో కీపర్‌కు చిక్కాడు. దాంతో 142 పరుగుల వద్ద భారత్‌ ఆరో వికెట్‌ నష్టపోయింది.  ప్రస్తుతం క్రీజులో పంత్‌(34), అశ్విన్‌ ఉండగా 63 ఓవర్లకు జట్టు స్కోర్‌ 142/6గా నమోదైంది.

  • 23 Jun 2021 05:55 PM (IST)

    100 పరుగుల లీడ్..

    రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 100 పరుగుల లీడ్‌‌ను దాటింది. 58 ఓవర్లకు జట్టు స్కోర్‌ 134/5గా నమోదు కాగా, ఆధిక్యం 102 పరుగులు సాధించింది. మరోవైపు పంత్‌(32), జడేజా(12) పరుగులతో బ్యాటింగ్‌ చేస్తున్నారు. పేసర్లను అడ్డుకోవడంలో వీరు కొంత సక్సెస్ అవుతున్నారు.

  • 23 Jun 2021 05:45 PM (IST)

    మొదటి సెషన్ ముగిసింది.. ఇబ్బందుల్లో టీమిండియా

    రిజర్వ్‌డే రోజు టీమిండియా రెండో సెషన్‌ ప్రారంభించింది. పంత్‌(29), జడేజా(12) క్రీజ్‌లో ఉన్నారు. ఈ క్రమంలోనే జేమీసన్‌ వేసిన 56వ ఓవర్‌లో ఒక పరుగు తీశారు. దాంతో భారత్‌ ప్రస్తుతం 131/5తో నిలిచింది. 99 పరుగుల ఆధిక్యంతో కొనసాగుతోంది.

  • 23 Jun 2021 05:22 PM (IST)

    లాంచ్ బ్రేక్..

    ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్‌లో కొద్దిగా తడబడుతోంది. న్యూజిలాండ్‌ పేసర్లు కైల్‌ జేమీసన్‌, ట్రెంట్‌బౌల్ట్‌ వేగానికి ఫస్ట్ సెషన్‌లో వరుస వికెట్లను కోల్పోయింది టీమిండియా. మూడు వికెట్లు వెంటది వెంటనే పడ్డాయి. ఈ క్రమంలోనే భోజన విరామ సమయానికి భారత్‌ 55 ఓవర్లలో 130/5తో నిలిచింది. ప్రస్తుతం రిషభ్‌ పంత్‌(28/48 బంతుల్లో 4×4), రవీంద్ర జడేజా(12/ 20 బంతుల్లో 2×4) క్రీజులో ఉన్నారు.

  • 23 Jun 2021 04:49 PM (IST)

    DRS తీసుకున్న కివీస్..

    రిషబ్ పంత్‌పై ఎల్‌బిడబ్ల్యు విజ్ఞప్తిని అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. దీంతో న్యూజిలాండ్ DRSను తీసుకుంది. లెగ్-స్టంప్ వైపు వెళుతున్న బంతి పంత్ ఆడటానికి ప్రయత్నించాడు. కాని బంతి ప్యాడ్‌ను తాకింది. రీప్లేలు బ్యాట్ కొట్టలేదని తిలిసింది. ఇది పంత్‌కు పెద్ద లైఫ్ లభించింది.

  • 23 Jun 2021 04:37 PM (IST)

    రహానే ఔట్

    రహానే వికెట్ పడింది. బౌల్డ్ వేసిన బౌలింగ్‌లో దొరికి పోయాడు. బౌల్డ్ వేసిన బంతిని బౌండరీ కొట్టిన రహానే.. ఆ తర్వాత వేసిన బంతిని లెగ్ స్టంప్ మీదుగా కొట్టేందుకు ప్రయత్నించడంతో దొరికి పోయాడు. బ్యాట్ ఎడ్జ్‌లో బాల్ తగలడంతో అది వికెట్ కీపర్ చేతిలో పడింది.

  • 23 Jun 2021 04:20 PM (IST)

    పంత్- వాగ్నెర్ మధ్య అద్భుతమైన సీన్

    పంత్- వాగ్నెర్ మధ్య కోల్డ్ వార్ కనిపిస్తోంది. చివరి ఓవర్లో పంత్ బౌండరీ కొట్టడంతో వాగ్నెర్ ఫీల్ అయ్యాడు. ప్రతి డెలివరీ తర్వాత ఫాలో-త్రూలో అతనిని తిరిగి చూస్తున్నాడు. పంత్ కూడా దాన్ని ఆస్వాదిస్తూ నవ్వుతూ ముఖం తిప్పుతున్నాడు. వాగ్నెర్ ఈ ఓవర్లో పంత్ కొన్ని మంచి డిఫెన్సివ్ ఆటలను చూపించాడు.

  • 23 Jun 2021 04:02 PM (IST)

    రిషబ్ పంత్ ఖాతాలో మరో బౌండరీ..

    రిషబ్ పంత్ ఇప్పుడు కాస్త నియంత్రణలో ఆడుతున్నాడు. సౌతీపై మంచి షాట్ సాధించిన తరువాత అతనికి బౌండరీ కూడా వచ్చింది.  డ్రింక్స్ సమయం.

  • 23 Jun 2021 03:44 PM (IST)

    రిషబ్ పంత్ మొదటి బౌండరీ

    రిషబ్ పంత్ క్రీజుకు వచ్చాడు. ఇవాళ మొదటి బౌండరీ  వచ్చింది. టిమ్ సౌతీ ఓవర్  మొదటి బంతిని పంత్  4 పరుగుల లభించాయి. పంత్ మరోసారి సిడ్నీ, బ్రిస్బేన్ వంటి ఇన్నింగ్స్ ఆడవలసి ఉంటుంది. దీనితో పాటు  వైస్ కెప్టెన్ అజింక్య రహానె కూడా తన పోరాట రూపాన్ని చూపించాల్సి ఉంటుంది.

  • 23 Jun 2021 03:37 PM (IST)

    పుజారా ఔట్

    టీమిండియా మరో కీలక వికెట్‌ కోల్పోయింది. నయావాల్‌ చెతేశ్వర్‌ పుజారా (15/ 80 బంతుల్లో 2×4) ఔటయ్యాడు. 37.3వ బంతిని జేమీసన్‌ ఆఫ్‌స్టంప్‌ మీదుగా వేశాడు. ఆ బంతిని పుజారా డిఫెండ్‌ చేసే క్రమంలో స్లిప్‌లో రాస్ టేలర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. రిషభ్ పంత్‌ క్రీజులోకి వచ్చాడు. వరుస ఓవర్లలో కోహ్లీ, పుజారాను జేమీసన్‌ ఔట్‌ చేయడం గమనార్హం.

  • 23 Jun 2021 03:29 PM (IST)

    జెమీసన్‌కే మ‌ళ్లీ చిక్కిన కోహ్లీ

    టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ (13/ 29 బంతుల్లో) ఇన్నింగ్స్‌ ముగిసింది. కివీస్‌ పొడగరి పేసర్‌ కైల్‌ జేమీసన్‌ అతడిని పెవిలియన్‌ పంపించాడు. తనకు దూరంగా వెళ్తున్న 35.5వ బంతిని కోహ్లీ సందిగ్ధంతో టచ్ చేశాడు. వాట్లింగ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. 36 ఓవర్లు భారత్‌ 71/3. అజింక్య రహానె (0) క్రీజులోకి వచ్చాడు. పుజారా (14) నిలకడగా ఆడుతున్నాడు.

Follow us on