కొత్త కోచ్, నూతన కెప్టెన్‌తో బరిలోకి దిగనున్న భారత్.. 8 ఏళ్ల తరువాత అక్కడ అంతర్జాతీయ మ్యాచ్.. ఎప్పుడు, ఎక్కడ, ఎవరితోనో తెలుసా?

|

Nov 07, 2021 | 10:39 PM

Indian Cricket Team: రాజస్థాన్ క్రీడా ప్రేమికుల నిరీక్షణకు ప్రస్తుతం తెరపడనుంది. 8 ఏళ్ల తర్వాత జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ (SMS) స్టేడియంలో నవంబర్ 17న అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నారు.

కొత్త కోచ్, నూతన కెప్టెన్‌తో బరిలోకి దిగనున్న భారత్.. 8 ఏళ్ల తరువాత అక్కడ అంతర్జాతీయ మ్యాచ్.. ఎప్పుడు, ఎక్కడ, ఎవరితోనో తెలుసా?
Rahul Dravid
Follow us on

IND vs NZ: రాజస్థాన్ క్రీడా ప్రేమికుల నిరీక్షణకు ప్రస్తుతం తెరపడనుంది. 8 ఏళ్ల తర్వాత జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ (SMS) స్టేడియంలో నవంబర్ 17న అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నారు. ఇందులో న్యూజిలాండ్ జట్టుతో భారత జట్టు తలపడనుంది. భారత జట్టు కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ తొలిసారిగా మైదానంలోకి రానున్నది ఈ మ్యాచ్‌తోనే. అదే సమయంలో భారత టీ20 జట్టు కూడా కొత్త కెప్టెన్‌తో బరిలోకి దిగనుంది.

తాజాగా భారత క్రికెట్‌ జట్టు కోచ్‌గా మాజీ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ని భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు నియమించింది. ఇలాంటి పరిస్థితుల్లో కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ తొలి పరీక్ష జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరగనుంది. భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్‌తో ఇక్కడ పోటీపడనుంది. విరాట్ కోహ్లి కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత భారత జట్టు కొత్త కెప్టెన్‌తో జైపూర్‌లోని ఎస్‌ఎంఎస్ స్టేడియంలో తొలి మ్యాచ్ ఆడనుంది. ఇప్పటి వరకు భారత జట్టుకు కొత్త కెప్టెన్‌ను ప్రకటించలేదు. అయితే క్రీడా వర్గాల సమాచారం ప్రకారం, రోహిత్ శర్మ పేరు దాదాపుగా ఖరారైందని తెలుస్తోంది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో 8 ఏళ్ల తర్వాత తొలిసారి మ్యాచ్ జరగనుండడంతో చాలా ప్రత్యేకత చోటుచేసుకుంది.

భారత జట్టు కొత్త కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు రాజస్థాన్, జైపూర్‌లతో పాత సంబంధాలు ఉన్నాయి. నిజానికి, రాహుల్ ద్రవిడ్ ఐపీఎల్ (IPL) జట్టు రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్, మెంటార్‌గా ఉన్నారు. ఆటైంలో జైపూర్‌లో ఎక్కువ కాలం ఉండి సాధన చేశారు. ద్రవిడ్‌కి ఎస్‌ఎంఎస్‌ మైదానం, స్టేడియంలోని ప్రతీ అంశం గురించి బాగా తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో ద్రవిడ్ అనుభవంతో టీమ్‌ఇండియా చాలా వరకు లాభపడబోతోందని భావిస్తున్నారు.

చివరి మ్యాచ్ 2013లో జరిగింది..
జైపూర్‌లో 16 అక్టోబర్ 2013న అంతర్జాతీయ మ్యాచ్‌కి ఆతిథ్యం ఇచ్చింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో భారత్ వన్డే మ్యాచ్ ఆడింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 359 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత జట్టు అద్భుత ప్రదర్శనతో ఆస్ట్రేలియాను 9 వికెట్ల తేడాతో ఓడించి 43.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం బ్యాటింగ్ పిచ్‌గా పరిగణించిన సంగతి తెలిసిందే. ఇక్కడ పెద్ద సంఖ్యలో ఐపీఎల్ మ్యాచ్‌లు కూడా జరిగాయి.

Also Read: T20 World Cup 2021, IND vs NAM: కెప్టెన్‌గా కోహ్లీ చివరి టీ20.. హ్యాట్రిక్ విజయంతో ముగించేందుకు ఆరాటం..!

వివాదంలో బాక్సర్ లోవ్లినా.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ఎంపికపై విమర్శలు.. అసలేమైందంటే?