India Vs New Zealand: జైపూర్‌లో గెలిచిన తర్వాత, ఇప్పుడు టీం ఇండియా రాంచీలో జరిగే రెండవ zw20 (India Vs New Zealand, 2nd T20)లో న్యూజిలాండ్‌తో తలపడుతుంది. రాంచీలోనే సిరీస్‌ను కైవసం చేసుకోవడమే టీమ్‌ఇండియా లక్ష్యం కాగా, ఇందుకోసం రోహిత్ శర్మ జట్టు అద్భుతమైన ఆటతీరు కనబరచాల్సి ఉంటుంది. తొలి టీ20లో ఆఖరి ఓవర్‌లో విజయం సాధించిన భారత్‌కు న్యూజిలాండ్ గట్టిపోటీనిచ్చింది. అయితే చివరికి రోహిత్ అండ్ కో విజయం సాధించింది. గెలిచిన తర్వాత ప్రతి కెప్టెన్ తన ప్లేయింగ్ ఎలెవన్‌ను మార్చుకోకపోయినా, రెండో టీ20లో మాత్రం టీమ్ ఇండియా కొన్ని మార్పులతో మైదానంలోకి దిగవచ్చు. 30 బంతుల్లో 142 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌కు రోహిత్ శర్మ తన ప్లేయింగ్ ఎలెవన్‌లో కూడా అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఈ ఆటగాడు మరెవరో కాదు ఇషాన్ కిషన్. విజయ్ హజారే ట్రోఫీలో మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ 11 సిక్సర్లు, 19 ఫోర్లతో 174 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్‌లో 30 బౌండరీలు ఉన్నాయి. అతను సిక్సర్లు, ఫోర్లతో 142 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ సొంత మైదానం రాంచీ కావడంతో అతను ప్లేయింగ్ XIలో ఉండే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
కేఎల్ రాహుల్‌కు రెస్ట్ ఇస్తారా..?
రెండో టీ20 మ్యాచ్‌లో కేఎల్ రాహుల్‌కు విశ్రాంతి ఇవ్వవచ్చు. రాహుల్ ఐపీఎల్ నుంచి నిరంతరం క్రికెట్ ఆడుతున్నందున టెస్టు సిరీస్‌కు ముందు అతనికి విశ్రాంతి ఇవ్వవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ రాంచీ టీ20లో ఓపెనింగ్‌కు వెళ్లవచ్చు. రాహుల్‌తో పాటు బౌలింగ్‌లో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంది. మహ్మద్ సిరాజ్ స్థానంలో హర్షల్ పటేల్ లేదా అవేశ్ ఖాన్‌కు అవకాశం కల్పించవచ్చు. తొలి టీ20లో సిరాజ్ వేలికి గాయమైందని, అలాంటి పరిస్థితుల్లో టీమ్ మేనేజ్‌మెంట్ అతడికి విశ్రాంతి ఇవ్వవొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. మహ్మద్ సిరాజ్ కూడా న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడవలసి ఉంది. కాబట్టి అతను ఫిట్‌గా ఉండటం చాలా ముఖ్యం. మొదటి టీ20లో దీపక్ చాహర్ ప్రదర్శన కూడా పేలవంగా ఉంది. కానీ, రెండో టీ20లోనూ అతనికి అవకాశం ఇవ్వవచ్చు.
రాంచీ టీ20లో భారత ప్రాబబుల్ ప్లేయింగ్ XI- రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, వెంకటేష్ అయ్యర్, అక్షర్ పటేల్, ఆర్ అశ్విన్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్/అవేష్ ఖాన్, భువనేశ్వర్ కుమార్.
Harbhajan Singh: వికెట్ కీపర్‌గా మారిన భజ్జీ.. వైరలవుతోన్న హర్భజన్ గల్లీ క్రికెట్ వీడియో..