రాహుల్ ద్రావిడ్‌ పదవీ కాలం రెండేళ్లు..! అయితే శిష్యుడి విజయంపై గురువు నమ్మకంగా ఉన్నాడు..

|

Nov 17, 2021 | 5:56 AM

John Wright Comments: నవంబర్ 17 బుధవారం నుంచి భారత క్రికెట్ జట్టులో కొత్త శకం ప్రారంభం కానుంది. అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కాలం.

రాహుల్ ద్రావిడ్‌ పదవీ కాలం రెండేళ్లు..! అయితే శిష్యుడి విజయంపై గురువు నమ్మకంగా ఉన్నాడు..
Rahul Dravid
Follow us on

John Wright Comments: నవంబర్ 17 బుధవారం నుంచి భారత క్రికెట్ జట్టులో కొత్త శకం ప్రారంభం కానుంది. అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కాలం. భారత మాజీ గ్రేట్ బ్యాట్స్‌మెన్ రాహుల్ ద్రవిడ్ మరోసారి సీనియర్ జట్టులోకి వచ్చారు. జట్టును ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి అతని పాత్ర గైడ్ అంటే కోచ్. ఇటీవలే రవిశాస్త్రి వారసుడిగా టీమిండియా ప్రధాన కోచ్‌గా నియమితులైన రాహుల్ ద్రవిడ్.. న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌తో తన ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నారు.

‘ద్రావిడ్ శకం’ ప్రారంభానికి ముందు, న్యూజిలాండ్‌కు చెందిన మాజీ అనుభవజ్ఞుడు, ద్రవిడ్ మాజీ గురువు, శిష్యుడు విజయం సాధించాలని ఆకాంక్షించారు. 2000ల ప్రారంభంలో టీమ్ ఇండియాకు కోచ్‌గా పనిచేసిన కివీస్‌ లెజెండ్ జాన్ రైట్‌.. టీమ్ ఇండియా బాధ్యతలు తీసుకున్న ద్రావిడ్‌ పై ప్రశంసల వర్షం కురిపించారు. 2000 నుంచి 2005 మధ్యకాలంలో టీమిండియా కోచ్‌గా పనిచేసిన రైట్.. రాహుల్ ద్రవిడ్‌తో కలిసి 5 ఏళ్లపాటు తీవ్రంగా పనిచేశారు. అందుకే రాహుల్ ద్రవిడ్ సామర్థ్యం గురించి రైట్‌కు బాగా తెలుసు. ద్రావిడ్‌పై నమ్మకంగా ఉండటానికి ఇదే కారణం. భారత మాజీ కెప్టెన్‌కు కోచింగ్‌ అనుభవం ఉందని తనంతట తానుగా పని చేయగలడని చెప్పారు.

ద్రవిడ్‌కు ఆటపై అద్భుతమైన అవగాహన ఉంది
న్యూజిలాండ్ సిరీస్ ప్రారంభానికి ముందు జాన్ రైట్ ఒక ఇంటర్వ్యూలో భారత కొత్త కోచ్‌పై తన అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఆంగ్ల వార్తాపత్రిక హిందూస్తాన్ టైమ్స్‌తో రైట్ మాట్లాడుతూ “ఇది అద్భుతమైన నియామకం. అతను భారతదేశం కోసం అద్భుతమైన పని చేస్తాడు. అతను చాలా తెలివైనవాడు. ఆటపై మంచి అవగాహన ఉంది. ఐపీఎల్, అండర్-19, ఇండియా-ఎకు కోచర్‌గా వ్యవహరించడం వల్ల చాలా అనుభవం సంపాదించాడు. అతనికి చాలా జ్ఞానం ఉందని ” చెప్పారు.

ద్రావిడ్ పదవీ కాలపు ప్రధాన లక్ష్యాలు
రెండేళ్ల కాంట్రాక్ట్‌పై రాహుల్ ద్రవిడ్‌ను టీమిండియా కోచ్‌గా నియమించారు. అతని పదవీకాలంలో టీమ్ ఇండియా అతిపెద్ద లక్ష్యం ICC ట్రోఫీని గెలవడమే. భారతదేశం 2013 నుంచి ఖాళీగా ఉంది. ద్రవిడ్ హయాంలో వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే T20 ప్రపంచకప్‌ను, ఆపై 2023లో ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, ODI ప్రపంచకప్‌ను భారత్ ఎదుర్కొంటుంది. ప్రస్తుత జట్టు ఈ మూడు టైటిళ్లను గెలుచుకునే సత్తాను కలిగి ఉంది.

Viral Photos: భూమిపై ఉన్న అందమైన భవంతి ఈ హోటల్‌.. 6000 అడుగుల ఎత్తులో నిర్మించారు..

AP IAS Officers Transfer: ఏపీలో పలువురు ఐఏఎస్‌ అధికారుల బదిలీ.. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారంటే..?

పెద్దవారిలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..! అయితే కచ్చితంగా ఆ వ్యాధే..?