
భారత్-ఐర్లాండ్ మధ్య నేటి సాయంత్రం బెల్ఫాస్ట్ వేదికగా జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌కు ముందు టీమిండియా ప్రాక్టీస్ సెషన్‌లో జరిగిన ఓ సరదా సంఘటన జరిగింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అంతర్జాతీయ అరంగేట్రానికి సిద్ధమవుతున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ, భారత ఓపెనర్ అభిషేక్ శర్మ మధ్య నెట్స్‌లో జరిగిన ఫన్నీ వాగ్వాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీ20 సిరీస్‌కు ముందు నిర్వహించిన నెట్ ప్రాక్టీస్‌లో వైభవ్ సూర్యవంశీ స్పిన్ బౌలింగ్ చేశాడు. ఈ సందర్భంగా అభిషేక్ శర్మ అతడి బౌలింగ్‌ను ఎదుర్కొన్నాడు. వైభవ్ వేసిన ఓ బంతిని అభిషేక్ భారీ షాట్ ఆడగా, బంతి నెట్‌ను తాకింది. వెంటనే వైభవ్ ఔట్ అంటూ అప్పీల్ చేశాడు. అయితే అభిషేక్ మాత్రం అది ఔట్ కాదంటూ నవ్వుతూ వాదించాడు.
ఇద్దరూ కొద్దిసేపు సరదాగా ఒకరినొకరు ఆటపట్టించుకున్నారు. బ్యాటింగ్ ముగించుకుని వెళ్లే సమయంలో కూడా నేను ఔట్ కాలేదు అంటూ అభిషేక్ వైభవ్‌కు వివరణ ఇవ్వడం అక్కడున్న ఆటగాళ్లను నవ్వుల్లో ముంచెత్తింది. ఈ సరదా ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయితే ఈ వీడియో కంటే ఎక్కువ ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం. ఐర్లాండ్‌తో జరిగే తొలి టీ20లో అతడికి అవకాశం దక్కే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఐపీఎల్‌లో తన దూకుడైన బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన వైభవ్, ఇప్పుడు టీమిండియా జెర్సీలో ఎలా రాణిస్తాడో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
🚨 Cute argument between Vaibhav Sooryavanshi and Abhishek Sharma:
Vaibhav Sooryavanshi was bowling to Abhishek Sharma in the nets. Every time Abhishek played a lofted shot, Vaibhav appealed for a wicket.
He kept shouting “wicket” every time, while Abhishek kept denying it. 😭… pic.twitter.com/1banviw4jW
— Indian Cricket Ministry (@Tejashyyyyyy) June 26, 2026
మరోవైపు భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు ఓపెనింగ్ జోడీ ఎంపిక కూడా కీలకంగా మారింది. ఇటీవల టీ20ల్లో అభిషేక్ శర్మ-సంజూ శాంసన్ జోడీ విజయవంతమైంది. అయితే వైభవ్ సూర్యవంశీ జట్టులోకి రావడంతో ఓపెనింగ్ కాంబినేషన్‌పై చర్చ మొదలైంది. ప్రస్తుతం జట్టులో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ ముగ్గురూ ఎడమచేతి ఓపెనర్లే కావడంతో సమతుల్యత కోసం సంజూ శాంసన్‌ను వైభవ్‌కు జోడీగా పంపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భారత్-ఐర్లాండ్ మధ్య రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి పోరు నేడు సాయంత్రం 6 గంటలకు బెల్ఫాస్ట్‌లో ప్రారంభం కానుంది. యువ ఆటగాళ్ల ప్రదర్శన, ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం జరుగుతుందా లేదా అన్న అంశమే ఈ మ్యాచ్‌లో ప్రధాన ఆకర్షణగా మారింది. అభిమానులు కూడా ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.