Video: వామ్మో.. ఇదేం బాల్ అక్షర్ భయ్యా.. బెయిర్‌స్టోకే మెంటల్ ఎక్కించావ్‌గా.. వీడియో చూస్తే ఫిదానే

Axar Patel Stunning Delivery: తొలిరోజు రెండో సెషన్‌ ఆట కొనసాగుతోంది. దీంతో ఇంగ్లండ్ 5 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. జట్టులో బెన్ స్టోక్స్, బెన్ ఫాక్స్ క్రీజులో ఉన్నారు. జో రూట్ 29 పరుగులు చేసిన తర్వాత రవీంద్ర జడేజాకు బలయ్యాడు. ఒల్లీ పోప్‌ను కూడా జడేజా అవుట్ చేశాడు. 37 పరుగుల వద్ద అక్షర్ పటేల్ బౌలింగ్‌లో జానీ బెయిర్‌స్టో అవుట్ అయ్యాడు.

Video: వామ్మో.. ఇదేం బాల్ అక్షర్ భయ్యా.. బెయిర్‌స్టోకే మెంటల్ ఎక్కించావ్‌గా.. వీడియో చూస్తే ఫిదానే
Axar Patel Vs Jonny Bairsto

Updated on: Jan 25, 2024 | 1:09 PM

Axar Patel Stunning Delivery For Jonny Bairstow: హైదరాబాద్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్టు జరుగుతోంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో టాస్ గెలిచిన ఇంగ్లీష్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇరు జట్లు 3-3 స్పిన్నర్లతో ఆడేందుకు వచ్చాయి.

రెండో సెషన్‌లో అక్షర్ పటేల్ భారత్‌కు తొలి విజయాన్ని అందించాడు. అతను తన 7వ ఓవర్‌లో జానీ బెయిర్‌స్టోను బౌల్డ్ చేశాడు. బెయిర్‌స్టో టర్నింగ్ బాల్‌ను బ్యాట్‌తో నేరుగా ఆడేందుకు ట్రే చేశాడు. కానీ, బంతి నేరుగా స్టంప్‌లోకి వెళ్లింది. బెయిర్‌స్టో 58 బంతుల్లో 37 పరుగులు చేసి జో రూట్‌తో కలిసి 61 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే, ఈ బంతి వెళ్లిన విధానంతో ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ బెయిర్ స్టోతోపాటు జో రూట్ కూడా షాక్ అయ్యారు. ఆఫ్ సైడ్‌లో పడిన బంతి లెగ్ సైడ్ దిశగా దూసుకెళ్లి వికెట్లను తాకింది. దీంతో అవాక్కవుతూ బెయిర్ స్టో పెవిలియన్ చేరాడు.

అక్షర్ పటేల్ కళ్లు చెదిరే బౌలింగ్ వీడియో..

తొలిరోజు రెండో సెషన్‌ ఆట కొనసాగుతోంది. దీంతో ఇంగ్లండ్ 5 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. జట్టులో బెన్ స్టోక్స్, బెన్ ఫాక్స్ క్రీజులో ఉన్నారు. జో రూట్ 29 పరుగులు చేసిన తర్వాత రవీంద్ర జడేజాకు బలయ్యాడు. ఒల్లీ పోప్‌ను కూడా జడేజా అవుట్ చేశాడు. 37 పరుగుల వద్ద అక్షర్ పటేల్ బౌలింగ్‌లో జానీ బెయిర్‌స్టో అవుట్ అయ్యాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..