India vs England 1st Test live streaming: నేటి నుంచి మొదటి టెస్ట్ ప్రారంభం.. వీక్షించండి ఇలా.!

| Edited By: Team Veegam

Feb 05, 2021 | 11:39 AM

India vs England: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్తే ధ్యేయంగా భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ నేటి నుంచి ప్రారంభం కానుంది...

India vs England 1st Test live streaming: నేటి నుంచి మొదటి టెస్ట్ ప్రారంభం.. వీక్షించండి ఇలా.!
Follow us on

India vs England: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్తే ధ్యేయంగా భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. కరోనా తర్వాత సొంతగడ్డపై జరుగుతున్న తొలి సిరీస్ ఇదే కావడం విశేషం. ఇక ఈ మ్యాచ్‌లో భారత్ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. అటు ఇంగ్లాండ్ కూడా గట్టి పోటీని ఇచ్చేందుకు అస్త్ర శస్త్రాలను సిద్దం చేస్తోంది.

పితృత్వ సెలవులపై వెళ్లిన విరాట్ కోహ్లీ ఈ సిరీస్‌కు అందుబాటులో ఉండగా.. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, పేసర్ ఇషాంత్ శర్మ కూడా జట్టులోకి రావడం కలిసొచ్చే అంశం. శ్రీలంకపై సిరీస్ విజయంతో జోష్ మీదున్న ఇంగ్లాండ్.. టీమిండియాకు గట్టి పోటీని ఇవ్వాలని అనుకుంటోంది. టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ప్లేస్ సంపాదించేందుకు తహతహలాడుతోంది.

భారత్ వెర్సస్ ఇంగ్లాండ్ మధ్య ఫస్ట్ టెస్ట్ జరిగేది ఇక్కడే…

Ind vs Eng 1st Test Match: Time, Venue: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు ఈ రోజు చెన్నై వేదికగా ప్రారంభం కానుంది. చిదంబరం స్టేడియం‌లో ఈ మ్యాచ్ జరగనుండగా.. ఈ పిచ్‌పై టీమిండియాకు మంచి రికార్డు ఉంది. కాగా, మ్యాచ్ ఉదయం 9.30 గంటలకు ప్రారంభం అవుతోంది. ఇక టాస్ అరగంట ముందు వేస్తారు.

మ్యాచ్‌ను లైవ్ టెలికాస్ట్ ఇలా చూడొచ్చు..

భారత్, ఇంగ్లాండ్ మొదటి టెస్ట్ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ ఛానల్ లైవ్ టెలికాస్ట్ చేస్తోంది. అంతేకాకుండా డిస్నీ హాట్‌స్టార్, డిస్నీ యాప్, వెబ్‌సైట్‌లో మ్యాచ్ తిలకించవచ్చు. అలాగే లైవ్ స్కోర్ అండ్ కీలక అప్‌డేట్స్ కోసం

ఈ లింక్ క్లిక్ చేయండి.. https://tv9telugu.com/sports/cricket-news/series/india-vs-england-2021-22

మరిన్ని చదవండి:

మీ వెహికిల్‌ను అమ్మేసినా.. RC ట్రాన్స్‌ఫర్ కాలేదా.? అయితే ఇలా చేయండి..

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. అనుమానంతో భార్యను కిరాతకంగా.. పక్కా ప్లాన్‌ ప్రకారమే..

టీమిండియాకు ప్రపంచకప్ అందించాడు.. ఏడాది పాటు నిషేధం ఎదుర్కున్నాడు.. ఆ బ్యాట్స్‌మెన్ ఎవరంటే.?

కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారా.? అయితే ఈ ఐలాండ్‌లో జాలీగా హాలీడేను ఎంజాయ్ చేయండి..!