సొంతగడ్డపై తొలి టెస్టు ఆడేందుకు సిద్ధమవుతున్న భారత క్రికెట్ జట్టు ముమ్మర సాధన చేస్తోంది. శుక్రవారం నుంచి చెపాక్ స్టేడియంలో ఇంగ్లండ్‌తో మొదటి టెస్టు ప్రారంభం కానుండగా.. ఇరుజట్లు మైదానంలో చెమటోడ్చాయి. విరాట్ కోహ్లీ, అజింక్యా రహనే, చతేశ్వర్ పుజారా, రోహిత్ శర్మ, శుభమన్ గిల్ నెట్స్‌లో సుదీర్ఘంగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయగా.. ఇషాంత్, మహమ్మద్ సిరాజ్, బుమ్రా బౌలింగ్ సాధన చేశారు. తర్వాత జట్టు సభ్యులందరూ ఫీల్డింగ్, క్యాచింగ్ ప్రాక్టీస్ చేశారు. అంతేకాకుండా భారత ఆటగాళ్లు టెస్టు సిరీస్ దుస్తులు ధరించి ఫోటో షూట్‌లో సైతం పాల్గొన్నారు.
వెనుక సీట్లో కూర్చొని విరాట్ కోహ్లీకి సహాయపడటమే ఇప్పుడు నా బాధ్యతని రహానే అన్నారు. కోహ్లీకి సహాయపడడమే చాలా సులువైన పని అని తెలిపాడు. కెప్టెన్ అడిగితే సలహా ఇస్తానని అన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ సిరీస్‌పైనే మా దృష్టి అని, లంకలో సిరీస్ నెగ్గి వచ్చిన ఇంగ్లండ్‌పై గెలువడం అంత సులువు కాదని స్పష్టం చేశారు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఇంకా చాలా సమయం ఉందని, ప్రస్తుతం దాని గురించి ఆలోచించడం లేదని అన్నారు. అయితే టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ చేరే అర్హత న్యూజిలాండ్‌కు ఉందని రహానే కితాబిచ్చాడు. కాగా… భారత ఆటగాళ్ల ప్రాక్టీస్‌కు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. అదే విధంగా ఆటగాళ్లు సైతం ప్రాక్టీస్ అప్డేట్స్‌ను వారివారి వ్యక్తిగత ఫేస్‌బుక్, ట్విట్టర్ అకౌంట్లలో పోస్ట్ చేస్తున్నారు. వాటికి వేలల్లో లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి.
Also Read: