India vs England: రేపటి నుంచే భారత్-ఇంగ్లాండ్ కీలక టెస్ట్.. పూర్తి షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవిగో..

India vs England Series Full Schedule: ఐదవ టెస్టు జులై 1 నుంచి 5 వరకు జరగనుంది. ఆ తర్వాత మూడు టీ20లు, మూడు ODIలు జరగనున్నాయి.

India vs England: రేపటి నుంచే భారత్-ఇంగ్లాండ్ కీలక టెస్ట్.. పూర్తి షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవిగో..
India Vs England 5th Test Live

Updated on: Jun 30, 2022 | 7:22 PM

భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రేపటి నుంచి జరగనున్న ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో ఎవరు పాస్ అవుతారో, ఎవరు విఫలమవుతారో.. తేలేందుకు సమయం ఆసన్నమైంది. ఇది పటౌడీ సిరీస్‌లో భాగంగా జరగనున్న తుది టెస్ట్. గతేడాది జరిగిన నాలుగు టెస్టుల్లో టీమిండియా 2-1 ఆధిక్యంలో నిలిచింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంగ్లండ్ జట్టుతోపాటు టీమిండియా కూడా చాలా మారింది. కెప్టెన్, కోచ్ అందరూ మారిపోయారు. 5 రోజుల పాటు ఎడ్జ్‌బాస్టన్‌లో ఏ జట్టు ఎలా రాణిస్తుందో చూసేందుకు క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అసలు ఈ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది, ఎలా చూడాలో ఇప్పుడు చూద్దాం..

పటౌడీ సిరీస్‌లో భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఎడ్జ్‌బాస్టన్‌లో 5వ టెస్టు జరగనుంది. గతేడాది ఇంగ్లండ్‌లో ఈ సిరీస్‌ జరిగింది. తొలి 4 టెస్టు మ్యాచ్‌ల్లో భారత జట్టు 2-1తో ఆధిక్యంలో ఉంది. కానీ, మాంచెస్టర్‌లో జరగాల్సిన 5వ టెస్టులో కరోనా విధ్వంసం కనిపించడంతో అది వాయిదా పడింది. మాంచెస్టర్‌లో జరగాల్సిన టెస్టు మ్యాచ్‌నే ఇప్పుడు ఎడ్జ్‌బాస్టన్‌లో నిర్వహిస్తున్నారు.

భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ 2022 పూర్తి షెడ్యూల్( India’s Tour of England 2022 Full Schedule)

ఇవి కూడా చదవండి

రీషెడ్యూల్ చేసిన 5వ టెస్ట్ – జులై 1-5, ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్, సాయంత్రం 3 గంటలకు

తొలి T20I – జులై 7 – ఏజియాస్ బౌల్, సౌతాంప్టన్, రాత్రి 11 గంటలకు

రెండవ T20I – జులై 9 – ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్, రాత్రి 7 గంటలకు

3వ T20I – జులై 10 – ట్రెంట్ బ్రిడ్జ్, నాటింగ్‌హామ్, రాత్రి 11 గంటలకు

తొలి వన్డే – జులై 12 – ఓవల్, లండన్, మధ్యాహ్నం 3:30 గంటలకు

2వ వన్డే – జులై 14 – లార్డ్స్, లండన్ – సాయంత్రం 5:30 గంటలకు

3వ వన్డే – జులై 17 – ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్ – సాయంత్రం 5:30 గంటలకు

IND vs ENG 5th Test Match, Live Streaming: మ్యాచ్‌ను ఎప్పుడు, ఎక్కడ, ఎలా చూడాలి?

భారత్, ఇంగ్లండ్ మధ్య 5వ టెస్టు ఎక్కడ జరగనుంది?

బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య 5వ టెస్టు మ్యాచ్ జరగనుంది. జులై 1 నుంచి ప్రారంభమై జులై 5 వరకు ఈ టెస్ట్ జరగనుంది.

భారత్, ఇంగ్లండ్ మధ్య 5వ టెస్టు మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?

భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు 5వ టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ మధ్యాహ్నం 2:30 గంటలకు వేయనున్నారు.

భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య జరిగే 5వ టెస్ట్ మ్యాచ్‌ను లైవ్‌లో ఎక్కడ చూడాలి?

సోనీ నెట్‌వర్క్ స్పోర్ట్స్ ఛానెల్‌లో 5వ టెస్ట్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని చూడొచ్చు. సోనీ సిక్స్‌లో ఇంగ్లీష్ భాషలో, సోనీ టెన్ 3లో హిందీలో చూడొచ్చు.

భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య 5వ టెస్ట్ మ్యాచ్ ఆన్‌లైన్‌లో ఎలా చూడాలి?

సోనీలివ్‌లో భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న 5వ టెస్ట్ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్‌ను చూడొచ్చు. అదే సమయంలో, మీరు దీనికి సంబంధించిన అప్‌డేట్స్‌ను tv9telugu.comలో కూడా పొందవచ్చు.

భారత టెస్టు జట్టు: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, ఛెతేశ్వర్ పుజారా, రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్, ఆర్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్ , ప్రసిద్ధ్ కృష్ణ, మయాంక్ అగర్వాల్