భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య 5వ టెస్టు రెండో రోజు జరుగుతోంది. క్రీజులో రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ ఉన్నారు. రెండో రోజు 338 పరుగులతో ఆట ప్రారంభించిన భారత్.. జడేజా సెంచరీతో మరింత ఆధిపత్యం దిశగా భారత్ సాగుతోంది. ఈ సెంచరీతో జడేజా.. విదేశీ గడ్డపై తొలిసారి శతకాన్ని పూర్తి చేశాడు. 183 బంతుల్లో 13 ఫోర్లతో తొలి సెంచరీని పూర్తి చేశాడు.
జడేజా అద్భుత ఇన్నింగ్స్..
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో రవీంద్ర జడేజా అద్భుతంగా ఆడి, విదేశాల్లో తన తొలి సెంచరీ సాధించాడు. అతని టెస్టు కెరీర్‌లో ఇది మూడో సెంచరీ. 183 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. విదేశీ గడ్డపై జడేజా తొలి సెంచరీ చేసిన జడేజా.. ఇతంకుముందు భారత గడ్డపై రెండు సెంచరీలు చేశాడు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 98 పరుగుల వద్ద 5 వికెట్లు కోల్పోయింది. ఇక్కడ నుంచి పంత్, జడేజా ఆరో వికెట్‌కు 222 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇంగ్లండ్‌పై ఈ వికెట్‌కు టీమిండియాకు ఇదే అతిపెద్ద భాగస్వామ్యం నిర్మించారు. బర్మింగ్‌హామ్ గడ్డపై భారత జట్టు ఎప్పుడూ 400 పరుగులు చేయలేకపోయింది. మరి ఈ రోజు ఈ స్కోర్‌ని బీట్ చేస్తుందో లేదో చూడాలి. ఇంగ్లండ్ తరపున జేమ్స్ ఆండర్సన్ మూడు వికెట్లు పడగొట్టాడు.
CENTURY for @imjadeja ??
This is his third ? in Test cricket ??
LIVE – https://t.co/LL20D1K7si #ENGvIND pic.twitter.com/10LrrWiuVB
— BCCI (@BCCI) July 2, 2022