IND vs ENG: ప్చ్‌.. బాగా ఆడుతున్నాడు అనుకునేలోపే.. మరోసారి ముంచేసిన ట్రిపుల్‌ సెంచరీ వీరుడు!

లార్డ్స్‌ వేదికగా జరుగుతున్న ఇంగ్లాండ్‌తో మూడో టెస్ట్‌లో టీమిండియా పోరాటం కొనసాగుతోంది. కరుణ్ నాయర్ 40 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు, కానీ పెద్ద స్కోర్‌గా మార్చుకోలేకపోయాడు. ఇంగ్లాండ్ టీం తొలి ఇన్నింగ్స్ లో 387 పరుగులు చేసింది. మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి..

IND vs ENG: ప్చ్‌.. బాగా ఆడుతున్నాడు అనుకునేలోపే.. మరోసారి ముంచేసిన ట్రిపుల్‌ సెంచరీ వీరుడు!
Karun Nair

Updated on: Jul 11, 2025 | 9:40 PM

లార్డ్స్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు ఆసక్తికరగా సాగుతోంది. ఇరు జట్లు హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. తొలి రోజు 4 వికెట్లు మాత్రమే కోల్పోయిన ఇంగ్లాండ్‌ రెండో రోజు బుమ్రా దెబ్బకు ఆలౌట్‌ అయింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌కు టీమిండియాకు ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. మూడు ఫోర్లతో మంచి జోష్‌లో కనిపించిన జైస్వాల్‌.. అదే ఊపులో జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో అవుట్‌ అయ్యాడు. దీంతో టీమిండియా 13 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయింది.

ఇక వన్‌డౌన్‌లో వచ్చిన కరుణ్‌ నాయర్‌, మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. రెండో వికెట్‌కు ఇద్దరూ కలిసి హాఫ్‌ సెంచరీ పార్ట్నర్‌షిప్‌ నెలకొల్పారు. ఈ క్రమంలో కరుణ్‌ నాయర్‌ బాగా ఆడుతున్నట్లు కనిపించాడు. చాలా ఏళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన నాయర్‌కు ఈ సిరీస్‌లో మంచి ఇన్నింగ్స్‌ లేదు. తొలి మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లోనే డకౌట్‌ అయ్యాడు. ఆ తర్వాత కూడా పెద్ద స్కోర్లు కొట్టలేదు. తొలిసారి మంచి టచ్‌లో కనిపించాడు. చూడచక్కటి షాట్లు ఆడాడు. హమ్మయ్యా.. నాయర్‌ నుంచి ఒక మంచి స్కోర్‌ రాబోతుంది అనుకున్న టైమ్‌లో బెన్‌ స్టోక్స్‌ బౌలింగ్‌లో జో రూట్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు.

ఈ సారి కచ్చితం హాఫ్‌ సెంచరీ చేస్తాడని అనుకుంటే.. 62 బంతుల్లో 4 ఫోర్లతో 40 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు. ఈ సిరీస్‌లో నాయర్‌కు ఇదే అత్యధిక స్కోర్‌. 2016లో టీమిండియా తరఫున ట్రిపుల్‌ సెంచరీ కొట్టిన నాయర్‌ నుంచి అలాంటి ఇన్నింగ్స్‌ను క్రికెట్‌ అభిమానులు కోరుకుంటున్నారు. కానీ, నాయర్‌కు మాత్రం పాపం ఏదీ కలిసి రావడం లేదు. మంచి స్టార్ట్‌ లభించినా.. అది పెద్ద ఇన్నింగ్స్‌గా మారడం లేదు. మరి చూడాలి.. 40 పరుగుల ఇన్నింగ్స్‌ ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో రెండో ఇన్నింగ్స్‌లో అయినా నాయర్‌ పెద్ద ఇన్నింగ్స్‌ ఆడతాడో లేదో చూడాలి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి..