Ind vs Eng: మూడో వన్డేలో ఆ ఇద్దరు ఆటగాళ్లు ఆడతారా..? సిరీస్ గెలవడానికి కొత్త వ్యూహం సిద్దం చేస్తున్న టీమిండియా కెప్టెన్..

|

Mar 28, 2021 | 1:10 PM

India vs England 3rd Odi : భారత్, ఇంగ్లాండ్ మధ్య ఆదివారం మూడో వన్డే జరుగనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండు దేశాలు చెరొక

Ind vs Eng: మూడో వన్డేలో ఆ ఇద్దరు ఆటగాళ్లు ఆడతారా..? సిరీస్ గెలవడానికి కొత్త వ్యూహం సిద్దం చేస్తున్న టీమిండియా కెప్టెన్..
India Vs England 3rd Odi
Follow us on

India vs England 3rd Odi : భారత్, ఇంగ్లాండ్ మధ్య ఆదివారం మూడో వన్డే జరుగనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండు దేశాలు చెరొక మ్యాచ్ గెలిచాయి. చివరి మ్యాచ్‌లో తాడోపేడో తేల్చుకోనున్నాయి. సిరీస్ గెలవడానికి రెండు దేశాలు శత విధాల ప్రయత్నం చేయడానికి సిద్దంగా ఉన్నాయి. ఈ క్రమంలో టీమిండియాలో మార్పులు చేర్పులు జరుగుతాయని తెలుస్తోంది.

క్రునాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్‌లకు జట్టులో చోటు దక్కకపోవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే రెండో వన్డేలో పేలవమైన బౌలింగ్ వల్ల భారత్ ఓటమికి కారణమైంది. భారత బ్యాట్స్‌మన్ పరుగుల పర్వతాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, బౌలర్లు వికెట్లు సాధించలేకపోయారు. మరోవైపు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, క్రునాల్ పాండ్యా ఘోరంగా విఫలమయ్యారు. క్రునాల్ 6 ఓవర్లలో 72 పరుగులు ఇచ్చాడు. 72 పరుగులకు ఒక్క వికెట్ కూడా తీసుకోలేకపోయాడు. మరోవైపు, కుల్దీప్ కూడా అదే దారిలో వెళ్లాడు. కుల్దీప్ 10 ఓవర్లలో 84 పరుగులు వదులుకున్నాడు. అతను కూడా 84 పరుగులకు ఒక్క వికెట్ కూడా తీసుకోలేకపోయాడు. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ కుల్దీప్ ను గట్టిగా టార్గెట్ చేశారు. మొత్తం ఎనిమిది సిక్సర్లు సాధించారు. వన్డేలో భారత బౌలర్ ఇచ్చిన అత్యధిక సిక్సర్ల సంఖ్య ఇది.

కుల్దీప్ యాదవ్, క్రునాల్ పాండ్యా స్థానంలో లెగ్ స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వస్తారని సమాచారం. ప్రస్తుతం యుజ్వేంద్ర చాహల్ ఫామ్‌లో లేనప్పటికీ, కెప్టెన్ కోహ్లీకి ఇంకా వేరే మార్గం లేదు. క్రునాల్ పాండ్యా బ్యాటింగ్ బలం మీద జట్టులో తన స్థానాన్ని నిలుపుకోగలడు కానీ అతని బౌలింగ్ ప్రదర్శన పేలవంగా ఉంది. భారతదేశం యొక్క ప్రధాన ఆయుధం భువనేశ్వర్‌తో, యార్కర్ కింగ్ టి నటరాజన్‌కు అవకాశం లభిస్తుందని భావిస్తున్నారు.

Dont Rush Challenge: కుమారుడు, భార్యతో కలిసి స్టెప్పులేసిన టీమిండియా క్రికెటర్‌.. నెట్టింట వైరల్‌గా మారిన వీడియో..

AIBA World Boxing Championship: ఏఐబీఏ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో తలపడనున్న 20 మంది భారత బాక్సర్లు..