India Vs England 2021: ఇండియా తొలి టెస్టు ఓడిపోయిన టీమిండియా రెండో మ్యాచ్ ఎలాగైనా విజయం సాధించాలని కసితో ఉంది. ఈ క్రమంలోనే తుది జట్టులో పలు మార్పులతో బరిలోకి దిగనుంది. మొదటి టెస్టులో విఫలమైన నదీమ్‌ను పక్కన పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక గాయం కారణంగా తొలి మ్యాచ్‌కు దూరమైన అక్షర్ పటేల్ అతడి స్థానంలో రానున్నాడు. ఇక కుల్దీప్ యాదవ్‌ను కూడా తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉండగా.. ఎవరిపై వేటు పడనుందో తెలియాల్సి ఉంది. అలాగే బ్యాటింగ్ విభాగంలోనూ కొన్ని మార్పులు ఉండబోతున్నాయని భోగట్టా. అయితే దీనిపై మాత్రం పూర్తి క్లారిటీ లేదు.
కాగా, తొలి టెస్టులో ఇంగ్లాండ్ చేతుల్లో టీమిండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. 227 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవి చూసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(72), గిల్(50) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. దీనితో నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్ 1-0తో ఆధిక్యం సంపాదించింది.
12 ఏళ్ల బుడతడు.. స్టాక్ మార్కెట్‌లో ఏకంగా రూ. 16 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు.. ఆ తర్వాత ఏమైందంటే.!
తనకున్న వ్యాధిపై క్లారిటీ ఇచ్చి ఎమోషనల్ అయిన కాజల్.. షాక్‌లో ఫ్యాన్స్.!