Ind Vs Eng: వన్డే జట్టును ప్రకటించిన బీసీసీఐ.. సూర్యకుమార్ యాదవ్‌కు చోటు.. భువీ రీ-ఎంట్రీ

|

Mar 19, 2021 | 12:07 PM

India Vs England: ఇంగ్లాండ్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు 18 మంది సభ్యులతో కూడిన టీమిండియా జట్టును బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ ఇండియా (బీసీసీఐ) ప్రకటించింది...

Ind Vs Eng: వన్డే జట్టును ప్రకటించిన బీసీసీఐ.. సూర్యకుమార్ యాదవ్‌కు చోటు.. భువీ రీ-ఎంట్రీ
Suryakumar Yadav
Follow us on

India Vs England: ఇంగ్లాండ్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు 18 మంది సభ్యులతో కూడిన టీమిండియా జట్టును బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ ఇండియా (బీసీసీఐ) ప్రకటించింది. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని మెన్ ఇన్ బ్లూ ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆడుతోన్న సంగతి తెలిసిందే. దీని తర్వాత ఇంగ్లాండ్, భారత్ మధ్య మార్చి 23వ తేదీ నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. పూణే వేదికగా మూడు వన్డేలు జరగనున్నాయి. ఈ వన్డే సిరీస్‌కు 18 మందితో కూడిన టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. అందులో ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్‌కు కూడా చోటు దక్కింది. అలాగే ప్రసిద్ది కృష్ణ, కృనాల్ పాండ్యాలను సైతం సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఇదిలా ఉండగా టీమిండియా గత రెండు వన్డే సిరీస్‌లలోనూ ఓటమిపాలైంది. దీనితో ఈ సిరీస్‌పై అందరి దృష్టి పడింది.

అందరి చూపు కోహ్లీ వైపే…

ఇంగ్లాండ్‌తో జరగబోయే వన్డే సిరీస్‌లో అందరి చూపు కెప్టెన్ విరాట్ కోహ్లీపైనే ఉంది. 2019 ఆగష్టు నుంచి అతడు ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేదు. దీనితో అతడు ఎలా ఆడతాడాన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అటు టీంలో ముఖ్య ఆటగాళ్లు పంత్, సూర్యకుమార్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, చాహల్, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాల పెర్ఫార్మన్స్‌లపై కూడా టీం యాజమాన్యం దృష్టి సారించనుంది.

భారత్ వన్డే జట్టు ఇదే…

విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, శుభ్‌మాన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), చాహల్, కుల్దీప్ యాదవ్, కృనాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, టి నటరాజన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, శార్దుల్ ఠాకూర్

మరిన్ని ఇక్కడ చదవండి:

చుట్టూ భారీ అనకొండలు.. వాటితో ఆటలు.. ఇంతలోనే ఊహించని సంఘటన.. గగుర్పొడిచే వీడియో.!

భారీ పైథాన్‌తో ఫన్నీ గేమ్.. ప్రాణాల మీదకు తెచ్చుకున్న స్నేక్ క్యాచర్.. వైరల్ వీడియో.!

తలపై కొమ్ముతో భయంకర ఆకారం.. బెంబేలెత్తించే దృశ్యం.. ఇంతకీ అది దెయ్యమేనా.!