India Vs England 2021: ఆస్ట్రేలియాపై అద్భుత విజయాన్ని అందుకున్న టీమిండియా సొంతగడ్డపై భీకర పోరుకు సన్నద్దమైంది. రేపటి నుంచి చెన్నై వేదికగా ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇరు టీమ్స్ ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. శ్రీలంకతో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి జోష్ మీద ఇంగ్లాండ్ ఉండగా.. టీమిండియా హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది.
ఇదిలా ఉంటే రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టులోకి తిరిగి రావడం టీమిండియాకు కలిసొచ్చే అంశం. అటు ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ భీకర ఫామ్‌లో ఉండటం, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్, ఆర్చర్, ఆండర్సన్ వంటి సీనియర్లతో ఇంగ్లీష్ జట్టు కూడా గట్టి పోటీని ఇచ్చేలా ఉంది. అంతేకాకుండా వాళ్లందరికీ ఐపీఎల్ ఆడిన అనుభవం ఉండటంతో మ్యాచ్ మంచి రసవత్తరంగా సాగనుంది.
కాగా, తుది జట్టులో టీమిండియా పలు మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇంగ్లాండ్‌పై లెఫ్ట్ ఆర్మ్ పేసర్ లసిత్ ఎంబుల్దేనియా రెండు టెస్టులకు 15 వికెట్లు పడగొట్టడంతో.. కోహ్లీ అక్షర్ పటేల్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. దీనితో సిడ్నీ టెస్ట్ హీరో వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్యాలకు చోటు దక్కే అవకాశాలు కనిపించట్లేదు. అయితే తుది జట్టులో పంత్ ఉంటాడని ఇప్పటికే కోహ్లీ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ఫైనల్ ఎలెవన్‌లో ఎవరు అడతారన్నది గేమ్ మొదలయ్యే అరగంట ముందు తేలనుంది.
మీ వెహికిల్‌ను అమ్మేసినా.. RC ట్రాన్స్‌ఫర్ కాలేదా.? అయితే ఇలా చేయండి..
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. అనుమానంతో భార్యను కిరాతకంగా.. పక్కా ప్లాన్ ప్రకారమే..
టీమిండియాకు ప్రపంచకప్ అందించాడు.. ఏడాది పాటు నిషేధం ఎదుర్కున్నాడు.. ఆ బ్యాట్స్‌మెన్ ఎవరంటే.?
కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారా.? అయితే ఈ ఐలాండ్‌లో జాలీగా హాలీడేను ఎంజాయ్ చేయండి..!