India vs England : ఇంగ్లాండ్ సారథి జోరూట్ జోరు మీదున్నాడు. వరుసగా 98, 99, 100 టెస్టుల్లో 150కి పైగా పరుగులు సాధించిన ఏకైక ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. చెన్నై వేదికగా చెపాక్ స్టేడియంలో టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు తొలిసెషన్‌లో అతడు 150 పరుగుల లాండ్ మార్కును చేరుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఎవరికీ సాధ్యంకాని అరుదైన రికార్డు సృష్టించాడు.
శుక్రవారం రూట్ అజేయ శతకంతో నిలిచిన సంగతి తెలిసిందే. దాంతో వందో టెస్టులో శతకం బాదిన తొమ్మిదో ఆటగాడిగా అతడు మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు కొలిన్ కౌడ్రె, జావెద్ మియాందాద్, గార్డన్ గ్రీనిడ్జ్, అలెక్ స్టీవార్ట్, ఇంజమామ్, రికీ పాంటింగ్, గ్రేమ్ స్మిత్, హషిమ్ ఆమ్లా మాత్రమే ఈ ఘనత సాధించారు.
ఇంగ్లాండ్ తొలి రోజు 63 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయిన స్థితిలో క్రీజులోకి వచ్చిన రూట్.. డొమినిక్ సిబ్లీ(87; 286 బంతుల్లో 12×4)తో కలిసి మూడో వికెట్‌కు 200 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలోనే చివరి ఓవర్‌లో సిబ్లీ ఔటయ్యాక ఆట నిలిచిపోయింది.
ఆపై శనివారం స్టోక్స్‌తో కలిసి రూట్ బ్యాటింగ్ మొదలు పెట్టాడు. షాబాజ్ నదీమ్ వేసిన 111వ ఓవర్‌లో సింగిల్ తీసి రూట్ 150 పరుగులు పూర్తి చేశాడు. అతడి కన్నా ముందు వరుస టెస్టుల్లో అత్యధికసార్లు 150కి పైగా పరుగులు చేసిన ఆటగాళ్లలో శ్రీలంక మాజీ కీపర్ కుమార సంగక్కర(2007) నాలుగు సార్లు ఆ ఘనత సాధించి టాప్‌లో ఉన్నాడు. తర్వాతి స్థానాల్లో వాలీ హేమండ్ (1928-29), డాన్ బ్రాడ్‌మన్ (1937), జహీర్ అబ్బాస్(1982-83), ముదస్సార్ నజర్(1983), టామ్ లాథమ్(2018-19), జోరూట్(2021) వరుసగా ఉన్నారు.
India vs England : దూకుడు మీదున్న ఇంగ్లాండ్ ఆటగాళ్లు.. లంచ్ విరామ సమయానికి స్కోరు..
Prabhas Radheshyam: ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఈ దశాబ్దానికి అతిపెద్ద ప్రేమ ప్రకటన వచ్చేసింది