
Ind Vs Eng 1st Test: చెన్నై వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో టీమిండియా 337 పరుగులకు ఆలౌట్ అయింది. 257/6 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన భారత్ మరో 80 పరుగులు జోడించి చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది. లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ వాషింగ్టన్ సుందర్(85*) రాణించడంతో టీమిండియా గౌరవప్రదమైన స్కోర్ సాధించగలిగింది. ఇంగ్లాండ్ బౌలర్లలో బెస్ నాలుగు వికెట్లు.. ఆర్చర్, లీచ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. కాగా, భారత్ ఇంకా 241 పరుగుల వెనుకంజలో ఉండగా.. కొద్దిసేపట్లో ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించనుంది.
అంతకముందు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 578 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. కెప్టెన్ జో రూట్(218: 377 బంతుల్లో 19×4, 2×6) సూపర్ డబుల్ సెంచరీతో ఇన్నింగ్స్‌కి వెన్నుముకగా నిలవగా.. ఓపెనర్ సిబ్లీ(87: 286 బంతుల్లో 12×4, 0x6), ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్(82: 118 బంతుల్లో 10×4, 3×6) మంచి భాగస్వామ్యాలను నెలకొల్పడంలో సహాయపడ్డారు. అటు లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ బెస్(34) కూడా రాణించడంతో ఇంగ్లాండ్ జట్టు భారీ స్కోర్ సాధించింది. టీమిండియా బౌలర్లలో ఇషాంత్, నదీమ్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, అశ్విన్ చెరో మూడు వికెట్లు తీశారు.
India Vs England 1st Test Day 4: రసవత్తరంగా మారిన తొలి టెస్టు.. నాలుగో రోజు పైచేయి సాధించేది ఎవరు.?